Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలురాజకీయ వార్తలు

కేసీఆర్ సర్కార్ పై ఎమ్మెల్యే సీతక్క నిరసన -షర్మిల ఫైర్ ….

కేసీఆర్ సర్కార్ పై ఎమ్మెల్యే సీతక్క నిరసన -షర్మిల ఫైర్ ….

అయ్యా .. కేసీఆర్ సారు.. ఇప్పటికే జనం తిరగ పడుతున్నరు: ష‌ర్మిల‌
కరోనాను ఆరోగ్యశ్రీ లో చేర్చేది ఇంకెప్పుడు
ఆలోచిస్తాం అని చెప్పి ఎనిమిది నెలలు గడిచిపోయింది
పేదలు చచ్చినా ఎవరు అడిగేవారు ఉండరనే ధైర్యమా?
కరోనా సునామీలో కల్వకుంట్ల సామ్రాజ్యం కొట్టుకుపోవుడు ఖాయమే

కరోనా రాష్ట్రంలో విజృభిస్తున్న వేళ దాన్ని ఆరోగ్య శ్రీ లో చేరుస్తామన్న మాటను ముఖ్యమంత్రి కేసీఆర్ నిలబెట్టుకోవాలనే డిమాండ్ పై సర్కారుపై వత్తిడి పెరుగుతుంది . దానిపై అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ కు చెందిన ములుగు ఎమ్మెల్యే సీతక్క నీరసం చేపట్టగా , వైయస్ షర్మిల ఘాటుగా స్పందించారు. అయ్యా కేసీఆర్ సారు … ఇప్పటికే జనం తిరగ పడుతున్నారు. కరోనా ను ఆరోగ్య శ్రీ లో చేర్చేది ఇంకెప్పుడు అంటూ నిలదీశారు.

కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చేదెప్పుడు అంటూ ఓ దిన‌ప‌త్రిక‌లో వ‌చ్చిన క‌థ‌నాన్ని పోస్ట్ చేసిన వైఎస్ ష‌ర్మిల తెలంగాణ స‌ర్కారుపై మండిప‌డ్డారు. ‘కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చేది ఆలోచిస్తాం అని చెప్పి ఎనిమిది నెలలు గడిచిపోయింది, కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చేది ఇంకెప్పుడు కేసీఆర్‌ సారు? చచ్చే వారు పేదలు కాదనా? లేక పేదలు చచ్చినా ఎవరు అడిగేవారు ఉండరనే ధైర్యమా? లేక .. మీ లెక్కకు సరిపడ మరణాలు నమోదు కాలేదనా?’ అని ష‌ర్మిల నిల‌దీశారు.

‘అయ్యా.. కేసీఆర్ సారు.. ఇప్పటికే జనం తిరగ పడుతున్నరు, కరోనాతో రోడ్ల మీదపడ్డమని, బతుకులు ఆగమైనయని, జనం ఇంకా బర్బాద్ కాకముందే కరోనాను ఆరోగ్యశ్రీ లో చేర్చండి. ఇచ్చిన మాటను నిలబెట్టుకోండి. లేదంటే.. కరోనా సునామీలో కల్వకుంట్ల సామ్రాజ్యం కొట్టుకుపోవుడు ఖాయమే’ అని ష‌ర్మిల‌ హెచ్చ‌రించారు.

తెలుగుతల్లి ఫ్లైఓవర్ అంబెడ్కర్ విగ్రహం వద్ద ఎమ్మెల్యే సీతక్క నిరసన

 

తెలంగాణ ప్ర‌భుత్వ తీరును నిర‌సిస్తూ ఎమ్మెల్యే సీత‌క్క నిర‌స‌న‌
క‌రోనా చికిత్స‌ను వెంట‌నే ఆరోగ్య శ్రీ‌లో చేర్చాలి
మ‌రిన్ని ఉచిత అంబులెన్స్ సేవ‌ల‌ను అందుబాటులోకి తీసుకురావాలి
ఇళ్ల వ‌ద్ద‌కు వెళ్లి ప్ర‌భుత్వ‌మే ఉచిత వ్యాక్సిన్ వేయాలి
కరోనా మృతుల‌కు ప్ర‌భుత్వ‌మే అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించాలి
క‌రోనా స‌మ‌యంలో తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌ద‌ర్శిస్తోన్న‌ తీరును నిర‌సిస్తూ హైదరాబాద్ లో తెలుగుతల్లి ప్లైఓవర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఎమ్మెల్యే సీత‌క్క నిర‌స‌న తెలిపారు. అంబేద్క‌ర్ విగ్ర‌హానికి విన‌తిప‌త్రం స‌మ‌ర్పించిన సీత‌క్క అక్క‌డే శాంతియుత నిర‌స‌నను కొన‌సాగిస్తున్నారు. క‌రోనా చికిత్స‌ను వెంట‌నే ఆరోగ్య శ్రీ‌లో చేర్చాలని ఆమె డిమాండ్ చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా మ‌రిన్ని ఉచిత అంబులెన్స్ సేవ‌ల‌ను అందుబాటులోకి తీసుకురావాలని ఆమె అన్నారు. క‌రోనా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌లో కొన‌సాగుతోన్న గంద‌ర‌గోళాన్ని తొలగించాల‌ని, ఇళ్ల వ‌ద్ద‌కు వెళ్లి ప్ర‌భుత్వ‌మే ఉచిత వ్యాక్సిన్ వేయాలని ఆమె డిమాండ్ చేశారు. కరోనా మృతుల‌కు ప్ర‌భుత్వ‌మే అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించాలని ఆమె అన్నారు.

Related posts

షర్మిల …బీజేపీ ఎంపీ అరవింద్ మధ్య మాటల యుద్దం

Drukpadam

ఎంపీ పార్థసారథి రెడ్డికి తుమ్మల సత్కారం …

Drukpadam

మాదేశం రండని మోడీకి అమెరికా అధ్యక్షుడి ఆహ్వానం…

Drukpadam

Leave a Comment