Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

రాఘురామ వైద్య పరీక్షల రిపోర్ట్ స్పెషల్ మెసెంజర్ ద్వారా హైకోర్టు కు…

రాఘురామ వైద్య పరీక్షల రిపోర్ట్ స్పెషల్ మెసెంజర్ ద్వారా హైకోర్టు కు…
జిల్లా కోర్టు నుంచి హైకోర్టుకు చేరిన రఘురామ వైద్య పరీక్షల నివేదిక
గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో రఘురామకు వైద్య పరీక్షలు
కొద్దిసేపటి కిందట జిల్లాకోర్టుకు రిపోర్టు సమర్పణ
కాసేపట్లో హైకోర్టు నిర్ణయం వెలువరించే అవకాశం
ఎంపీ రఘురామకృష్ణరాజుకు కాళ్లకు గాయాలు ఎలా తగిలాయన్న దానిపై గుంటూరు జీజీహెచ్ లో వైద్య పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ వైద్య నివేదికను మెడికల్ బోర్డు జిల్లా కోర్టుకు నివేదించగా, జిల్లా కోర్టు ఆ నివేదికను పరిశీలించిన మీదట హైకోర్టుకు అందజేసింది. రఘురామ వైద్య పరీక్షల నివేదికను ఓ ప్రత్యేక మెసెంజర్ ద్వారా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్ కుమార్ రెడ్డి నివాసానికి పంపింది. హైకోర్టు ఈ మెడికల్ రిపోర్టును పరిశీలించి కాసేపట్లో నిర్ణయం వెలువరించే అవకాశాలున్నాయి. హైకోర్టు ఏమి చెబుతుందో అన్న దానిపై ఉత్కంఠ నెలకొన్నది .

అంతకుముందు, జీజీహెచ్ లో వైద్య పరీక్షలు పూర్తికావడంతో ఎంపీ రఘురామకృష్ణరాజును పోలీసులు గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో ఆయన వైద్య పరీక్షల నివేదికపై విచారణ అనంతరం హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తి కలిగిస్తోంది.

Related posts

విమాన సిబ్బందిపై ఎమ్మెల్యే రోజా ఫైర్!

Drukpadam

తెలంగాణ ఆదాయం దూసుకుపోతుంది. ఆర్థిక మంత్రి హరీష్ రావు!

Drukpadam

బిర్యానీ తిని రూ. 7 లక్షల విలువైన కారు గెలుచుకున్న అదృష్టవంతుడు!

Ram Narayana

Leave a Comment