Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఆ ఊర్లో మహిళలందరికీ అతనే భర్త.. కులగణనకు వెళ్లిన అధికారులకు షాక్!

ఆ ఊర్లో మహిళలందరికీ అతనే భర్త.. కులగణనకు వెళ్లిన అధికారులకు షాక్!

  • బీహార్‌లోని అర్వల్ జిల్లా రెడ్‌లైట్ ఏరియాలో ఘటన
  • కుల గణనకు వెళ్లిన అధికారులు 
  • ఒక్కరి పేరునే చెప్పిన 40 మంది మహిళలు
  • వారి పిల్లలు కూడా తమ తండ్రి పేరును ఒకేలా చెప్పిన వైనం
  • ఆరా తీస్తే తెలిసిన అసలు విషయం

ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. బీహార్‌లోని అర్వల్ జిల్లాలోని ఓ రెడ్‌లైట్ ఏరియాలోని దాదాపు 40 మంది మహిళలకు ఒకరే భర్త. వారి పిల్లలు కూడా తమ తండ్రి పేరు ఒకటే చెబుతున్నారు. దీంతో ఆశ్చర్యపోవడం అధికారుల వంతైంది. తర్వాత ఆరా తీసిన అధికారులు అసలు విషయం తెలిసి అవాక్కయ్యారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాష్ట్రంలో ప్రస్తుతం రెండో దశ కులగణన కొనసాగుతోంది. ప్రభుత్వ సిబ్బంది ఇంటింటికి వెళ్లి కులం, విద్య, ఆర్థిక , కుటుంబ స్థితిగతుల గురించి తెలుసుకుని వివరాలు నమోదు చేస్తున్నారు. అందులో భాగంగా అర్వల్ జిల్లాలోని ఓ రెడ్‌లైట్ ఏరియాకు వెళ్లారు.  అక్కడ దాదాపు 40 మంది మహిళలు ఉంటున్నారు. వారి వివరాల సేకరించే క్రమంలో తమ భర్త పేరును అందరూ రూప్‌చంద్ అని చెప్పడంతో అధికారులు విస్తుపోయారు. ఏదో తేడాగా ఉందని భావించిన అధికారులు వారి పిల్లలను పిలిచి తండ్రి పేరు అడిగితే వారు కూడా రూప్‌చంద్ అని చెప్పడంతో షాకయ్యారు.

ఇలా కాదని భావించిన అధికారులు అసలు రూప్‌చంద్ ఎవరనేది కనుక్కుంటే తప్ప ఈ మిస్టరీ వీడదని భావించి ఆరా తీశారు. అప్పుడు బయటపడింది అసలు విషయం. ఆ రెడ్‌లైట్ ఏరియాలో రూప్‌చంద్ అనే డ్యాన్సర్ ఉంటున్నాడు. కొన్నేళ్లుగా అక్కడే ఉంటున్న అతడు పాటలు పాడుతూ, డ్యాన్స్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. దీంతో అతడిపై అభిమానంతో అక్కడి మహిళలు తమ భర్త పేరును రూప్‌చంద్‌గా చెబుతున్నట్టు గుర్తించారు. అలాగే, అక్కడి వారికి కులం అనేది కూడా లేదని అధికారులు పేర్కొన్నారు.

Related posts

కాంగ్రెస్ పార్టీ తీరువల్లే శరద్ పవార్ ప్రధాని కాలేకపోయారు: ప్రధాని మోదీ

Ram Narayana

సిపిఐ నారాయణ లాజిక్ మిస్ అయ్యారా ?

Drukpadam

సిపిఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శిగా కె .రామకృష్ణ ఏకగ్రీవ ఎన్నిక!

Drukpadam

Leave a Comment