Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

పొత్తులు ఉన్నా లేకున్నా కమ్యూనిస్టు అభ్యర్థుల గెలుపే లక్ష్యం …కూనంనేని

పొత్తులు ఉన్నా లేకున్నా కమ్యూనిస్టు అభ్యర్థుల గెలుపే లక్ష్యం …కూనంనేని
-ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నిర్యాణాత్మక శక్తిగా కమ్యూనిస్టులు
-ప్రజాపోరు యాత్రకు ప్రజల నుంచి స్పందన
-రాష్ట్రంలో ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం
-ప్రజల్లో చిచ్చుపెట్టి రాజకీయ లబ్ది పొందేందుకు ప్రయత్నం చేస్తున్న బీజేపీ ఎత్తులు సాగనివ్వం ..

భారత కమ్యూనిస్టుపార్టీ విస్తరణ, బలోపేతంతో పాటు రానున్న ఎన్నికల్లో పొత్తులు ఉన్నా, లేకున్నా చట్టసభల్లో కమ్యూనిస్టుపార్టీ ప్రతి నిధులు అడుగుపెట్టడమే లక్ష్యంగా కార్యాచరణ ఉంటుందని సి.పి.ఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు . స్థానిక శాఖలను బలోపేతం చేస్తూ నూతన ప్రాంతాలలో పార్టీ ఏర్పాటుకు ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించాలని ఆయన కోరారు. పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లా కార్యవర్గస్థాయి సమావేశం శుక్రవారం ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో జరిగింది. రాష్ట్ర వ్యాపితంగా బలమైన నియోజకవర్గాలు ఉన్న జిల్లాలో ఉమ్మడి ఖమ్మం ఒకటని పొత్తులు అవగాహన ఉన్నా లేకున్నా కమ్యూనిస్టుపార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు కృషి జరగాలన్నారు. కమ్యూనిస్టుపార్టీకి బలమైన పునాదులు ఉమ్మడి జిల్లాలో ఉన్నాయని గెలుపుఓటములను శాసించగలిగే శక్తి సి.పి.ఐకి ఉందన్నారు. గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా ముందుకు సాగాలని ఆయన పిలుపు నిచ్చారు. పాలకుల విధానాలు సమాజపరిణామ క్రమంలో వస్తున్న మార్పులు కమ్యూనిస్టుల అవసరాన్ని మరింత పెంచాయన్నారు. ప్రజలను విస్మరించి పాలకులు పాలన సాగిస్తున్న క్రమంలో ప్రజల పక్షాన పోరాడేందుకు కమ్యూనిస్టులు కావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ప్రజల అభిమతానికి అనుగుణంగా పార్టీని విస్తరించాలని కూనంనేని తెలిపారు. స్థానిక సమస్యల పరిష్కారానికి పోరాడేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించుకొని ముందుకు సాగాలన్నారు. ఇదే సమయంలో సైద్ధాంతిక రాజకీయ అవగాహన ముఖ్యమని సాధారణ సభ్యులు మొదలు ఉన్నత స్థాయి వరకు రాజకీయ సైద్దాంతిక శిక్షణా తరగతులు నిర్వహించాలని సాంబశివరావు కోరారు. ఈనెల 14 నుండి ఉమ్మడి జిల్లాలో జరిగిన ప్రజా పోరు యాత్ర పై కూనంనేని స్పందిస్తూ ఉమ్మడి జిల్లాలో యాత్ర ఉద్దేశం నెరవేరిందని పార్టీ సందేశాన్ని తీసుక పోవడంలో కృతకృత్యులైనట్లు అభిప్రాయపడ్డారు. బీజేపీ ప్రమాదాన్ని ప్రజలకు తెలియజెప్పడం ఎంతముఖ్యమో కమ్యూనిస్టు భావజాలం వైపు యువతను ఆకర్షించడం కూడా అంతే ముఖ్యమన్నారు. బీజేపీ దేశంలో ఒక ప్రధాన విచ్చిన్నకర శక్తిగా మారిందని సాంబశివరావు తెలిపారు. కులాలు, మతాల మధ్య విభజన రేఖ తీసుకొచ్చి మెజార్టీ, మైనార్టీ ప్రాతిపదికలో లబ్ది పొందాలని చూస్తుందన్నారు. 75 ఏళ్ళ స్వాతంత్ర భారతం ఎప్పుడూ లేని విధంగా ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలు చెప్పుకునే వాటన్నింటిని తమ గుప్పెట్లో ఉంచుకునేందుకు బీజేపీ ప్రయత్నించడం ఆందోళన కల్గించే అంశం అన్నారు .. గుజరాత్ లో న్యాయ స్థానాల నుంచి వస్తున్న తీర్పులు పలు అనుమాలకు తావిస్తున్నాయని అభిప్రాయపడ్డారు . కరుడుకట్టిన నేరస్తులను వదిలేవేయడం వెనుక ప్రేరేపిత తీర్పులున్నాయన్న భావన ప్రజల్లో కలుగుతుందన్నారు. మతం, కులం పేరుతో రాజకీయాలు చేయడం అవసరమైతే ఘర్షణలు సృష్టించడం బీజేపీ ఎజెండాగా మారిందన్నారు . రాహుల్ గాంధీ విషయంలో బీజేపీ కక్ష్యపూరిత వైఖరిని అవలంభిస్తున్నదని కూనంనేని తప్పుపట్టారు . కర్నాటకలో ముస్లింల రిజర్వేషన్ల రద్దుకు సంబంధించి కోర్టు వ్యతిరేక తీర్పునిచ్చినా అమిత్ షా తెలంగాణకు వచ్చి ముస్లిం రిజర్వేషన్లను రద్దుచేస్తామనడం న్యాయ స్థానాలను ఎక్కిరించినట్లే అవుతుందన్నారు .

రాష్ట్రంలో ప్రధాన సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి కనబడుతుందన్నారు. పోడు భూములకు సంబంధించి సత్వరం పట్టాలివ్వాలని రుణమాఫీని పూర్తిస్తాయిలో అమలు చేయాలని గ్రామ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులర్ చేయాలని తదితర సమస్యలు సత్వర పరిష్కారానికి ఆందోళన కార్యక్రమం చేపట్టనున్నట్లు కూనంనేని తెలిపారు.
మహ్మద్ మౌలానా అధ్యక్షతన జరిగిన సమావేశంలో జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు, రాష్ట్ర కార్యవర్గసభ్యులు పాటు ప్రసాద్, ఎస్.కె. షాబీర్ పాషా, బొల్లోజ్ అయోధ్య, రావులపల్లి రామ్ ప్రసాద్, దండి సురేష్ లు పాల్గొన్నారు.

Related posts

మోదీజీ మా అందరినీ అరెస్ట్ చేయండి.. కేంద్రంపై అరవింద్ కేజ్రీవాల్ ఫైర్!

Drukpadam

ఢిల్లీలో తెలంగాణా నేతలతో బీజేపీ అగ్రనేతలు అమిత్ షా ,నడ్డా భేటీ!

Drukpadam

రాజకీయాల్లో అసహజం అంటూ ఏమీ ఉండదు: సంజయ్ రౌత్!

Drukpadam

Leave a Comment