Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఢిల్లీలో 8వ తరగతి బాలుడి దారుణ హత్య

  • సిగరెట్ తాగుతూ ఓ బాలుడి కంటపడ్డ ఇద్దరు తోటి విద్యార్థులు
  • టీచర్‌కు చెబుతానంటూ బాలుడి హెచ్చరిక
  • అతడిని తీవ్రంగా కొట్టి చంపేసిన విద్యార్థులు
  • కాలువలో మృతదేహం లభ్యం

ఢిల్లీలో నమ్మశక్యం కాని ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. 8వ తరగతి చదువుతున్న ఓ బాలుడిని తోటి విద్యార్థులే హత్య చేశారు. రాజధానిలోని బదర్‌పూర్ ప్రాంతంలోని కాలువలో గురువారం రాత్రి పోలీసులకు స్కూల్ యూనిఫాంలో ఉన్న ఓ విద్యార్థి మృతదేహం లభించింది. ఆ పక్కనే విద్యార్థి స్కూల్ బ్యాగ్ కూడా కనిపించింది. దీని ఆధారంగా పోలీసులు బాలుడి వివరాలు సేకరించారు. 

మృతుడి పేరు సౌరభ్‌ అని, అతడు మోలడ్‌బంద్ గ్రామ బిలాస్‌పూర్ క్యాంపులో నివసిస్తుంటాడని గుర్తించారు. ఇక విచారణ సందర్భంగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. సౌరభ్ స్నేహితులు ఇద్దరు తమ స్కూల్ సమీపంలో సిగరెట్ తాగుతూ అతడి కంట పడ్డారు. దీంతో, టీచర్లకు ఫిర్యాదు చేస్తానని సౌరభ్ హెచ్చరించాడు. ఈ క్రమంలో వారు అతడి తలపై తీవ్రంగా కొట్టి చంపేశారు. కాగా, బాలుడి మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఎయిమ్స్‌కు తరలించిన పోలీసులు, ఇద్దరు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. జువెనైల్ జస్టిస్ బోర్డు ఎదుట హాజరుపరిచారు.

Related posts

గోదావరి ముంపుప్రాంతాల పర్యటనకు సీఎల్పీ బృందం

Drukpadam

సీఎం జగన్ కు సీబీఐ కోర్టు నోటీసులు…

Drukpadam

రోడ్డుపై సిగరెట్ పీక పడేసినందుకు రూ.55 వేల జరిమానా విధించిన ఇంగ్లాండ్ కోర్టు!

Drukpadam

Leave a Comment