Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

అమెరికాలో మళ్లీ కాల్పులు… ఐదుగురి మృతి

  • టెక్సాస్ లోని క్లీవ్ లాండ్ లో ఘటన
  • రైఫిల్ షూటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వ్యక్తి
  • చిన్నారి నిద్రకు ఆటంకం కలుగుతోందన్న పొరుగింటి వారు
  • కోపంతో కాల్పులు జరిపిన వ్యక్తి

అమెరికాలో మళ్లీ కాల్పుల మోత వినిపించింది. టెక్సాస్ లోని క్లీవ్ లాండ్ లో ఓ దుండగుడు తుపాకీతో విరుచుకుపడగా, ఐదుగురు మృతి చెందారు. మృతుల్లో ఎనిమిదేళ్ల చిన్నారి కూడా ఉండడం స్థానికులను కలచివేసింది. కాల్పులు జరిపిన వ్యక్తి పరారీలో ఉన్నాడు. 

ఆ వ్యక్తి ఓ ప్రదేశంలో రైఫిల్ షూటింగ్ ప్రాక్టీసు చేస్తుండగా, పొరుగువారు అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ ఇంట్లో చిన్నారి నిద్రపోయే వేళయిందని, శబ్దాలు చేయవద్దని అతడిని కోరారు. దాంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆ వ్యక్తి తన తుపాకీని పొరుగింటి వారిపై ఎక్కుపెట్టాడు. దగ్గర్నుంచి కాల్చడంతో వారికి తప్పించుకునే అవకాశం లేకపోయింది. 

కాల్పులు జరిగిన సమయంలో ఆ ఇంట్లో 10 మంది వరకు ఉన్నారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అమెరికాలో ఈ ఏడాది ఇప్పటివరకు 174 కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి.

Related posts

విచ్ఛిన్నకారుల పట్ల కవులు కలానికి పదునుపెట్టాలి…ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

Drukpadam

సీఎం పదవికి వైయస్ జగన్ రాజీనామా…ఆమోదించిన గవర్నర్

Ram Narayana

ప్రభుత్వానికి కావాల్సినంత టైం ఇచ్చాం… స్పందన లేదనే ఈ ఉద్యమం: ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు!

Drukpadam

Leave a Comment