Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ప్రజా గాయకుడు గద్దర్ ఇక ప్రత్యక్ష రాజకీయాల్లోకి …కేసీఆర్ పై పోటీకి సై..!

  • ప్రజా గాయకుడు గద్దర్ ఇక ప్రత్యక్ష రాజకీయాల్లోకి …కేసీఆర్ పై పోటీకి సై..!
  • -ఆయన ఎక్కడ పోటీచేస్తే అక్కడ పోటీచేయాలని ఆలోచన
  • -పార్టీలో చేరతారా …? స్వతంత్రంగా పోటీచేస్తారా అనేది వెల్లడించని గద్దర్సీ
  • -ఎల్పీ నేత భట్టికి దగ్గరగా ఉంటారనే వినికిడి
  • -ఇటీవల భట్టి పీపుల్స్ యాత్రలో పాల్గొన్న గద్దర్త
  • -నకు పోలీస్ రక్షణ కావాలని తుఫ్రాన్ పోలీసులకు విజ్ఞప్తి
  • -శేషజీవితం పుట్టిన ఊళ్ళోనే అని వెల్లడి

ప్రజా గాయకుడు….విప్లవ గాయకుడుగా పేరున్న గద్దర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించారు. అంతేకాదు, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుపై పోటీ చేయబోతున్నట్టు తెలిపారు. అయితే కేసీఆర్ ఎక్కడనుంచి పోటీచేస్తే అక్కడ నుంచి చేస్తారా …?లేక గజ్వేల్ లో మాత్రమే అయితేనే చేస్తారా …అనేది ఆయన స్పష్టం చేయనప్పటికీ కేసీఆర్ ఎక్కడ నుంచి పోటీచేస్తే అక్కడ పోటీచేయాలని ఆలోచన ఉన్నట్లు తెలుస్తుంది.

మెదక్ జిల్లా తూప్రాన్‌లో నిన్న పోలీసులను కలిసిన గద్దర్ తనకు రక్షణ కల్పించాలని కోరారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. తన వయసు 76 సంవత్సరాలని, కాబట్టి ఇక నుంచి పుట్టిన ఊళ్లోనే జీవించాలని అనుకుంటున్నట్టు మనసులో మాటను బయటపెట్టారు. తమ గ్రామంపై ‘మై విలేజ్ ఆఫ్ ది 60 ఇయర్స్’ పేరుతో పుస్తకం రాసినట్టు గద్దర్ తెలిపారు. రానున్న ఎన్నికలతో తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెడుతున్నట్టు వివరించారు.

గద్దర్ అంటే కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాపితంగా తెలిసిన వ్యక్తి ..సమసమాజ స్థాపనకు తాను ఎంచుకున్న విప్లవ రాజకీయాల్లో ఐదు దశాబ్దాలకు పైగా కీలక భూమిక నిర్వహించిన ప్రజాగాయకుడు ఇటీవల వాటికీ కొంత దూరంగా ఉంటున్నారు . భద్రాచలం రామాలయాన్ని సందర్శించడం …హైద్రాబాద్ లో చిన్న జీయర్ స్వామి ఆధ్వరంలో ఏర్పాటు చేసిన సమతా మూర్తి కార్యక్రమంలో పాల్గొనడంపై విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ ఆయన జీవితంలో పలువురికి ఆదర్శంగానే నిలిచారు . దేశంలో మావోయుస్టులపై నిర్బంధకాండ కొనసాగుతున్న రోజుల్లో సైతం వారికీ అండగా పౌరహక్కులకోసం తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా నిలిచాడు ..ఆయనపై అనేక సార్లు హత్య ప్రయత్నాలు జరిగాయి. అనేక బుల్లెట్లు ఆయన శరీరంలో ఇంకా ఉన్నాయి. నిర్బంధాలను , ఆటంకాలను లెక్క చేయకుండా పీడిత ,తాడిత ఉద్యమాలకు అండదండలు ఇచ్చిన నాయకుడు ..తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన తన పాటల ద్వారా రాష్ట్ర అవతరణ ఆవశ్యకత గురించి చెప్పి ప్రజలను ఉద్యమంలోకి సంకరించేలా చేసిన గొప్ప వ్యక్తి …తాను నమ్మిన సిద్ధాంతం పూలబాట కాదు మూళ్ళ బాట అని తెలిసిన ఏనాడూ వెనకడుగు వేయలేదు … ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్లు చెప్పడమే కాకుండా కేసీఆర్ పై పోటీకి సై అనడం సంచలనంగా మారింది. చూద్దాం.  సీఎల్పీ నేత భట్టికి గద్దర్ దగ్గరగా ఉంటాడని వినికిడి …భట్టి చేపట్టిన పీపుల్స్ మార్చ్ యాత్రలో కూడా గద్దర్ పాల్గొనడం వారు ఇద్దరు మధ్య ఉన్న సత్సంబంధాలను తెలియజేస్తుంది.  … మరి  ఏపార్టీ నుంచి చేస్తారోచూద్దాం    …

Related posts

క్రమశిక్షణ తప్పుతున్న వైసీపీ …నేతలు తీరుతో ఇబ్బందులు!

Drukpadam

మోదీ ప్రధాని అయ్యింది ఉల్లిపాయల ధరలు తగ్గించడానికి కాదు!: కేంద్ర మంత్రి పాటిల్

Drukpadam

ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పార్టీ మారె ప్రసక్తే లేదు … టీఆర్ యస్ ఎంపీ నామ!

Drukpadam

Leave a Comment