- భగత్ సింగ్ పేరును పవన్ పాదాల కింద ఉంచడంపై పూనమ్ కౌర్ ఆగ్రహం
- స్వాతంత్ర్య సమరయోధులను అవమానించొద్దని విమర్శ
- భగత్ సింగ్ యూనియన్‌కు రిపోర్ట్ చేయాలని ట్విట్టర్ లో పిలుపు
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పోస్టర్ పై నటి పూనమ్ కౌర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. భగత్ సింగ్ పేరును పవన్ పాదాల కింద ఉంచడంపై ట్విట్టర్ వేదికగా విమర్శించారు.
‘‘స్వాతంత్ర్య సమరయోధులను మీరు గౌరవించలేకపోతే పోయారు కానీ, కనీసం వారిని మాత్రం అవమానించకండి. రీసెంట్ గా ఇటీవల విడుదలైన సినిమా పోస్టర్ లో భగత్ సింగ్ పేరును పాదాల కింద ఉంచి అవమానించారు.. ఇది అహంకారమా? అజ్ఞానమా?’’ అని ప్రశ్నించారు.
తర్వాత మరో ట్వీట్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ చేసిన ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ.. ‘‘స్వాతంత్ర్య సమరయోధుడిని కచ్చితంగా అవమానించడం లాంటిదే. దీన్ని వెంటనే భగత్ సింగ్ యూనియన్‌కు రిపోర్ట్ చేయండి’’ అని పేర్కొన్నారు. పూనమ్ కు మద్దతుగా కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇదే సమయంలో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఆమెపై మండిపడుతున్నారు.