Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కర్ణాటక విజయం …ఖమ్మం లో కాంగ్రెస్ సంబరాలు…

-ప్రజాస్వామ్యం గెలిచింది
-కర్ణాటక గెలుపు అన్నాచెల్లెల విజయంతో పాటు కర్ణాటక ప్రజల, ప్రజాస్వామ్య విజయం
-తెలంగాణలోనూ కాంగ్రెస్ గెలుపు తధ్యం
-జిల్లా, నగర కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్, మహమ్మద్ జావేద్
-జిల్లా, నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ
-పార్టీ శ్రేణుల్లో నూతనుత్తేజం నింపిన కర్ణాటక గెలుపు

కర్ణాటక గెలుపుతో ప్రజాస్వామ్యం గెలిచిందని ఇది అన్నా చెల్లెలు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ సాధించిన విజయమని నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావేద్ అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపును పురస్కరించుకొని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో శనివారం విజయోత్సవ ర్యాలీ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్ పాల్గొని మాట్లాడారు. దేశం మార్పు కోరుకుంటుందని కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో నిరూపితమైందన్నారు. ఏఐసిసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రానున్నదని అన్నారు. అధికార అండతో ఎన్ని విష ప్రయోగాలు చేసిన కర్ణాటక ప్రజలు ప్రజాస్వామ్యానికి పట్టం కట్టారని అన్నారు. అనంతరం నగర కాంగ్రెస్ అధ్యక్షులు, పీసీసి సభ్యులు మహమ్మద్ జావేద్ మాట్లాడుతూ.. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నాయకత్వంలో కాంగ్రెస్ విజయోత్సవాల పరంపర కొనసాగుతున్నదని ఆశాభావం వ్యక్తం చేశారు. అధికార మధంతో బిజెపి పన్నిన పన్నాగాలకు కర్ణాటక ప్రజలు తగిన బుద్ధి చెప్పారని తెలిపారు. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక లతో పాటు తెలంగాణ, చతిస్గడ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ మిజోరాం రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ విజయభావుట ఎగరవేయ నున్నదని ధీమా వ్యక్తం చేశారు.2024లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయమే లక్ష్యంగా కార్యకర్తలు నాయకులు నడుం బిగించాలన్నారు . రాహుల్ గాంధీ జోడో యాత్ర ద్వారా నిరంకుశ నియతృత్వ పాలనకు కర్ణాటక ప్రజలు చరమగీతం పాడారని అన్నారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే , టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సారథ్యంలో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి పీఠం ఎక్కించడమే తమ కర్తవ్యం అని, అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో నయా నిజాం దొరను నిరుద్యోగిని చేసి ఇంటికి పంపడమే తమ లక్ష్యమన్నారు . రాహుల్ గాంధీ ఇచ్చిన జోడో యాత్ర స్పూర్తితో కెసిఆర్ ను గద్దె దింపి వైయస్ రాజశేఖర్ రెడ్డి కలలుగన్న రాజన్న రాజ్యంతో పాటు సోనియమ్మ ఆకాంక్షించిన అసలు సిసలైన బంగారు తెలంగాణను సాధిస్తామని అన్నారు.

అనంతరం కార్యకర్తలకు పార్టీ శ్రేణులకు మిఠాయిలు పంచిపెట్టి, కాంగ్రెస్ కార్యాలయం నుండి జీవీ మాల్ మీదుగా వినోద థియేటర్ రోడ్డులో పాత బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహిస్తు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గేల నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినదించారు.ఈ కార్యక్రమంలో జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు యడ్లపల్లి సంతోష్, జిల్లా మైనారిటీ అధ్యక్షులు సయ్యద్ ముజాహిద్ హుస్సేన్,జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు మొక్కా శేఖర్ గౌడ్,కార్పొరేటర్లు మలీదు వెంకటేశ్వర్లు,దుద్ధుకూరి వెంకటేశ్వర్లు,లకావత్ సైదులు నాయక్,మిక్కిలినేని నరేందర్,బానోత్ బాలాజీ నాయక్,కామేపల్లి జడ్పీటీసీ బానోత్ వెంకట ప్రవీణ్ నాయక్,ఎంపీటీసీ నల్లమోతు లక్ష్మయ్య,నగర మైనారిటి అధ్యక్షులు అబ్బాస్ భాయ్,నగర ఎస్టీ సెల్ అధ్యక్షులు శంకర్ నాయక్,నగర,సేవాదళ్ అధ్యక్షులు ఎస్డీ గౌస్,జహీర్ భాయ్,ఖమ్మం నియోజకవర్గ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ ఏలూరి రవి, కామ అశోక్,కళింగ కనకరాజు,నాగటి చంద్రం,కొట్టేముక్కల నాగేశ్వరావు,మద్దినేని రమేష్,కిలారి అనిల్,దొడ్డా ప్రవీణ్,భోజడ్ల సత్యనారాయణ, గడ్డం వెంకటయ్య తదితర నాయకులు పాల్గొన్నారు.

Related posts

రాష్ట్రంలో కొన్ని వారాలైనా లాక్ డౌన్ పెట్టాలి…సీఎల్పీ నేత భట్టి

Drukpadam

రాహుల్ ,ప్రియాంక వెంటే నా ప్రయాణం …నవజ్యోత్ సింగ్ సిద్దు ….

Drukpadam

ఉష్… హుజురాబాద్ ఎన్నికపై బహిరంగ ప్రకటనలు వద్దు …రేణుకా చౌదరి!

Drukpadam

Leave a Comment