Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

బీఆర్ యస్ తో కామ్రేడ్ల పొత్తు లేనట్లేనా ?…హుస్నాబాద్ సిపిఐ అభ్యర్థిగా చాడ వెంకటరెడ్డి …

బీఆర్ యస్ తో కామ్రేడ్ల పొత్తు లేనట్లేనా ?…హుస్నాబాద్ సిపిఐ అభ్యర్థిగా చాడ వెంకటరెడ్డి …
-అంతకు ముందే తన అభ్యర్థిని ప్రకటించిన కేటీఆర్
-బీఆర్ యస్ వైఖరిపై అసంతృప్తితో ఉన్న లెఫ్ట్ పార్టీలు
-లెఫ్ట్ పార్టీలకు ఎమ్మెల్సీలు , రాజ్యసభ అంటూ సంకేతాలు
-అదేం కుదరదంటున్న వామపక్షాలు
-కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపుతో రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు ఉండే అవకాశం -కొట్టిపారేయలేమన్న సిపిఐ కార్యదర్శి నారాయణ
-ఈనెల 18 ,19 తేదీల్లో జరిగే జాతీయ సమితి సమావేశాల్లో పొత్తులపై నిర్ణయం..
-అవసరమైతే కాంగ్రెస్ తో జతకట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు

రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వంలో అధికారంలో ఉన్న బీఆర్ యస్ పార్టీతో కామ్రేడ్స్ పొత్తు పై నీలినీడలు అలుముకున్నాయి. అసలు పొత్తు ఉంటుందా ? ఉండదా ..,? హుస్నాబాద్ లో బీఆర్ యస్ , సిపిఐ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించడం పై రాజకీయాల్లో ప్రకంపనలు బయలుదేరాయి. పొత్తు ,పొత్తు అంటూనే బీఆర్ యస్ సాగదీయటంపై లెఫ్ట్ పార్టీలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. దీంతో పొత్తు లేనట్లేనా అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పొత్తుపై కేసీఆర్ మాట్లాడదాం…మాట్లాడదాం అంటూనే వాయిదాలు వేయడం మర్యాద కాదని అంటున్నారు లెఫ్ట్ నేతలు … పైగా తాము కోరుతున్న సీట్లలో అభ్యర్థులను ప్రకటించడంపై గుర్రుగా ఉన్నారు . …?ఇందుకు బీఆర్ యస్ భాద్యత వహించాలని అంటున్నారు కామ్రేడ్స్ … వారి వైఖరిపై విసుగు చెందిన సిపిఐ హుస్నాబాద్ నియోజకవర్గానికి తమ పార్టీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే సిపిఐ సీనియర్ నాయకుడు చాడ వెంకటరెడ్డిని ప్రకటించడం సంచలనంగా మారింది. సోమవారం బీజేపీ హటావో ,దేశ్ కి బచావో నినాదంతో రాష్ట్ర వ్యాపితంగా చేపట్టిన యాత్రల ముగింపు సందర్భంగా హుస్నాబాద్ లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ,రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు లు పాల్గొని కేంద్ర రాష్ట్ర ప్రభత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ధ్వజమెత్తారు . అంతే కాకుండా పొత్తులు ఉన్న లేకున్నా హుస్నాబాద్ నియోజకవర్గంలో చాడ వెంకటరెడ్డి పోటిఖాయమని ప్రకటించారు . ఇటీవల కాలంలో బీఆర్ యస్ ప్రభుత్వం పట్ల సానుకూలంగా ఉన్న సిపిఐ ఒక్కసారిగా రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై విరుచుకుపడటం చర్చనీయాంశంగా మారింది. మునుగోడు ఎన్నికల సందర్భంగా లెఫ్ట్ పార్టీల సహాయం తీసుకోని ఎన్నికల్లో గెలిచినప్పటికీ ఎన్నికల అనంతరం కేసీఆర్ వైఖరి అందుకు భిన్నంగా ఉందని వామపక్షాలు అభిప్రాయపడుతున్నాయి. అంతే కాకుండా ప్రజలు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడంలో వైఫల్యాలు ఉన్నాయని మండి పడుతున్నారు . సిపిఐ రాష్ట్ర సమితి నడుపుతున్న ప్రజాపక్షం పత్రికకు అడ్వార్టైజ్మెంట్ విషయంలో జి ఓ ఇవ్వకపోవడం ,అక్రిడేషన్ల విషయంలో ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పడంపై సిపిఐ నేతలు మండిపడుతున్నారు .

కొద్దిరోజుల క్రితం హుస్నాబాద్ వచ్చిన మంత్రి కేటీఆర్ సిపిఐ పార్టీ అడుగుతున్నా సీటుకు బీఆర్ యస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ ను ప్రకటించడం గమనార్హం… దీంతో లెఫ్ట్ పార్టీలతో పొత్తులకు అవకాశం లేనట్లే అంటున్నారు పరిశీలకులు . పైకి పొత్తు పొత్తు అంటూ లోపల వేరే ఆలోచనలు బీఆర్ యస్ చేస్తుందనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి . లెఫ్ట్ పార్టీలకు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చే బదులు వారికీ ఎమ్మెల్సీలు ఇవ్వాలనే వాదనలు కూడా చేస్తున్నారు బీఆర్ యస్ నేతలు …దానిపై అధినేత కేసీఆర్ వారి నేతలను ఎలాంటి కట్టడి చేయకపోవడం సందేహాలకు దారితీస్తుంది. పైగా లెఫ్ట్ పార్టీలు అడుగుతున్నా నియోజకవర్గాల్లో వారి పార్టీ వారిని కూడా ప్రచారం చేసుకోమని చెప్పడం పొత్తులపై కేసీఆర్ వైఖరిని తెలియజేస్తుందని అంటున్నారు లెఫ్ట్ నేతలు ..

కొద్దరోజుల వరకు బీజేపీకి వ్యతిరేకంగా బీఆర్ యస్ తో తప్పక పొత్తు ఉంటుందని చెపుతున్న లెఫ్ట్ నేతల స్వరాల్లో మార్పు కనిపిస్తుంది. పొత్తుల గురించి ,ప్రజాసమస్యల గురించి చర్చించేందుకు సీఎం సమయం కావాలని వారు లేఖలు రాసినప్పటికీ అటునుంచి స్పందనలేదని విశ్వసనీయ సమాచారం …దీన్ని లెఫ్ట్ నేతలు కూడా అంగీకరిస్తున్నారు . ఈనెల 18 ,19 తేదీల్లో ఢిల్లీలో జరగనున్న సిపిఐ జాతీయ కౌన్సిల్ సమావేశాల్లో చర్చించి తెలంగాణాలో పొత్తులపై ఒక నిర్ణయానికి వస్తామని అంటున్నారు సిపిఐ నేతలు …సిపిఎం మాత్రం ఇంకా గుంభనంగా ఉంది .

Related posts

రేపు ఉదయం 8 గంటల నుంచి చంద్రబాబు దీక్ష!

Drukpadam

కేసీఆర్ ఫార్మ్ హౌస్ ను లక్ష నాగళ్లతో దున్ని, పేదలకు పంచుతాం: బండి సంజయ్!

Drukpadam

పొలిటికల్ టూరిస్టులు వస్తుంటారు పోతుంటారు ..రాహుల్ ,నడ్డా టూర్ లపై కేటీఆర్ వ్యంగ్యబాణాలు …

Drukpadam

Leave a Comment