Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

రఘురామ అరెస్ట్ వెనక అమిత్ షా ఉన్నారు … సిపిఐ నారాయణ…

రఘురామ అరెస్ట్ వెనక అమిత్ షా ఉన్నారు … సిపిఐ నారాయణ
-కేసీఆర్ కూడా ఉన్నారా ? ఈ లాజిక్ నిజమేనా
-వారి సహకారం లేకుండా రఘురామను అరెస్ట్ చేయలేరు
-వ్యాక్సిన్ కంపెనీ అధినేత కులాన్ని జగన్ ప్రస్తావించారు
-పై స్థాయి బీజేపీ నాయకుల నుంచి అరెస్టులకు అనుమతి
-రాష్ట్రస్థాయి బీజేపీ నేతలు మాత్రం ఖండిస్తారు
వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు అరెస్ట్ వెనక కేంద్ర హోంమంత్రి అమిత్ షా, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హస్తం ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. ఇది నిజమేనా ? అమిత్ షా ఉన్నట్లు తెలిస్తే టీడీపీ ఎందుకు అంతగా సపోర్ట్ చేస్తుంది. బీజేపీ పవన్ కళ్యాణ్ ఎందుకు ఖండిస్తారు ? పైగా కేసీఆర్ కు కూడా తెలిసే జరిగిందని నారాయణ అంటున్నారు. ఇంత పెద్ద పెద్ద వాళ్ళు అరెస్ట్ వెనక ఉంటె రఘురామ అంతగా ఎందుకు రెచ్చిపోతారు. నియోజకవర్గాన్ని వదిలి ఢిల్లీ, హైదరాబాద్ లో కూర్చొని అదే పనిగా ప్రభుత్వం మీద , ముఖ్యమంత్రి జగన్ పై వ్యక్తిగతంగా విమర్శలు చేసే దైర్యం ఎందుకు చేశారు. అమిత్ షా, కేసీఆర్ సహకారం లేకుండా రఘురామను అరెస్ట్ చేసే అవకాశమే లేదన్నారు. రఘురామ వ్యాఖ్యలను తాను సమర్థించడం లేదన్న నారాయణ..కోర్టు ఆదేశాలను అమలు చేయకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడాన్ని తాను వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు. ఓ వ్యాక్సిన్ కంపెనీ అధినేత కులం గురించి ముఖ్యమంత్రి జగన్ ప్రస్తావించారన్న విషయాన్ని ఈ సందర్భంగా నారాయణ గుర్తు చేశారు.

అరెస్టులకు పై స్థాయిలోని బీజేపీ నేతలు అనుమతి ఇస్తున్నారని, రాష్ట్రస్థాయి బీజేపీ నేతలు మాత్రం అరెస్టులను ఖండిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ నేతల తీరు వింతగా ఉందన్నారు. ఈటల రాజేందర్ పైనా ముఖ్యమంత్రి కేసీఆర్ కక్ష సాధిస్తున్నారని అన్నారు. ప్రతిపక్షాలను లేకుండా చేయాలనుకోవడం దుర్మార్గమని, అలాంటి పరిస్థితే వస్తే కనుక ప్రజలే బుద్ధి చెబుతారని నారాయణ హెచ్చరించారు. అమిత్ షా , కేసీఆర్ సహకారం నిజంగా ఉంటె రఘురామ వ్యవహారం మరో మలుపు తిరుగుతుంది అనడంలో సందేహంలేదు.

Related posts

మహారాష్ట్ర రాజకీయాల్లో మరో కుదుపు …

Drukpadam

క్రాస్ ఓటింగ్ కు పాల్పడిన నలుగురిని సస్పెండ్ చేస్తూ జగన్ సంచనల నిర్ణయం …

Drukpadam

బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ హక్కులను కాలరాస్తోంది: బీవీ రాఘవులు!

Drukpadam

Leave a Comment