Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలు

ఉద్యమనేత బుడన్ బేగ్ ను కరోనా మహమ్మారి కబళించింది

ఉద్యమనేత బుడన్ బేగ్ ను కరోనా మహమ్మారి కబళించింది.

-మంత్రి పువ్వాడ ,ఎంపీ నామ, జడ్పీ చైర్మన్ లింగాల , వద్దిరాజు రవి సంతాపం
-మంచి వ్యక్తిని పోగొట్టుకున్నామన్న తోటి ఉద్యమకారులు

తెలంగాణ ఉద్యమ కారుడు , ఉన్నత విద్యావంతుడు . ఎందరికో మార్గదర్శకుడు , అభ్యుదయవాది , మృదు స్వభావి , టీఆర్ యస్ పార్టీ జిల్లా మాజీ అధ్యక్షడు బుడన్ బేగ్ (65 ) ను కరోనా మహమ్మారి కబళించింది. ఆయన కరోనా తో పోరాడుతూ ,బెంగుళూరు లోని ఒక ప్రవేట్ ఆసుపత్రిలో కన్ను మూశారు. తెలంగాణ ఉద్యమం అంటే చాలామంది ముందుకు రాని రోజుల్లో వేళ్ళమీద లెక్కపెట్టదగ్గ ఉద్యమకారుల్లో ఆయన ఒకరు. దిండిగల రాజేందర్ , రామారావు , సుబ్బారావు , నరేందర్ , శేషు , లాంటి కొద్దీ మంది ఉద్యమకారులు టీఆర్ యస్ ఏ పిలుపు ఇచ్చిన ముందుండి పోరాడే వారు. టీఆర్ యస్ నాయకులూ వస్తే వారిని రిసీవ్ చేసుకోవడం , తిరిగి వారిని పెంపు వరకు వెంట ఉండే వారు. ఉద్యమ కాలంలో ఖమ్మం జిల్లాలో పెద్దగా టీఆర్ యస్ కు ఆదరణ లేదు. ఆయనప్పటికీ ఉన్న కొద్దిమంది ఉద్యమకారులు ఖమ్మం జిల్లాలో టీఆర్ యస్ వాణిని వినిపించారు. ఉద్యమంలో పాల్గొన్నారు. అరెస్టులు అయ్యారు. కేసులను ఎదుర్కొన్నారు. జైళ్లకు వెళ్లారు. వారి జేబుల్లో గులాబీ కండువాలు నిత్యం ఉండేవి . వారికీ అడ్డాగా గౌరీ నాథ్ ,మోహన్ స్వీట్స్ ఉండేది . ఉండీల గౌరీ కూడా ఉద్యమకారులకు అండగా నిలిచేవారు. కొంతమంది వారిని గేలి చేసేవారు.ఆయన ఏ నాడు నిరుత్సహ పడకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పని చేశారు. 2014 లో ఉమ్మడి ఖమ్మం జిల్లా టీఆర్ యస్ అధ్యక్షుడిగా ఉన్న బేగ్ కు ఖమ్మం పార్లమెంట్ కు పోటీచేసే ఆవకాశం కేసీఆర్ కల్పించారు. తరువాత జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతూనే రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి సంత చైర్మన్ గా నియమితులైయ్యారు. 2018 అసెంబ్లీ ఎన్నకలకు ముందు ఆయన టీఆర్ యస్ కు రాజీనామా చేశారు. తెలుగు దేశానికి దగ్గర అయ్యారు. వివిధ పార్టీలు ఆయన్ను ఆహ్వానించినప్పటికీ దేనిలోనూ చేరలేదు . ఇటీవల కాలంలో తిరిగి టీఆర్ యస్ లో చేరారు.ఆయనతో కలిసి ఉద్యమం లో పని చేసిన వారు మంచి వ్యక్తిని పోగొట్టుకున్నామని విచారం వ్యక్తం చేశారు.

బేగ్ మృతి పట్ల మంత్రి పువ్వాడ సంతాపం.

తెలంగాణ రాష్ట్ర సమితి మాజీ జిల్లా అధ్యక్షుడు షేక్ బుడాన్ బేగ్ మృతి పట్ల రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సంతాపం వ్యక్తం చేశారు.

వారి మరణం బాధాకరమన్నారు. తెరాస పార్టీలో క్రియాశీలకంగా పని చేశారని, కార్యకర్త నుండి జిల్లా అధ్యక్షుడిగా ఎదిగారని, వారి మరణం పార్టీకి తీరని లోటన్నారు.

వారి కుటుంబానికి తమ ప్రగాఢ సానుబూతిని వ్యక్తం చేశారు. బేగ్ ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి ధైర్యం ప్రసాదించాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానని అన్నారు.

బుడాన్ బేగ్ గారి మృతి పట్ల ఎంపీ నామ దిగ్ర్భాంతి

తెలంగాణ ఉద్యమ నేత , టీఆర్ఎస్ ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షులు , టీఎస్ ఐడీసీ మాజీ ఛైర్మన్ బుడాన్ బేగ్ సాహెబ్ కరోనాతో పోరాడి తుది శ్వాస విడవడం పట్ల పార్టీ లోక్ సభా పక్ష నేత , ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు సోమవారం ఒక ప్రకటనలో దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు . ఆయన మృతికి తీవ్ర సంతాపం తెలిపారు . బుడాన్ బేగ్ సాహెబ్ మృతి తనను కలచివేసింది అని ఎంపీ నామ విచారం వ్యక్తం చేశారు . పార్టీలో క్రియాశీలకంగా పని చేసిన ఆయన మృతి పార్టీకి తీరని లోటని పేర్కొంటూ ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని బాధపడ్డారు . బెంగుళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బేగ్ గారికి అవసరమైన కీలకమైన మెడిసిన్ అందుబాటులో లేక ఆరోగ్యం ప్రమాదంలో పడిన సంగతిని తెలుసుకున్న ఎంపీ నామ గారు వెంటనే స్పందించి , చికిత్సకు అవసరమైన ఇంజక్షన్లను సేకరించి రోడ్డుమార్గాన పంపిస్తే ఆలస్యమవుతుందని భావించి విమానంలో బేగ్ కుమారుడు అబ్దుల్ కలాం ద్వారా పంపించడం జరిగింది . ఆదివారం 42 ఇంజక్షన్లు పంపారు . మళ్ళీ సోమవారం మరో 21 ఇంజక్షన్లు బెంగుళూరు పంపించారు . కోలుకుని తిరిగి ఇంటికి వస్తాడనుకున్న సమయంలో బేగ్ గారు మృత్యువాతపడడం తనను తీవ్రంగా కలచివేసిందని నామ ఆవేదన వ్యక్తం చేశారు . బేగ్ తనతో ప్రాణంగా ఉండే వాడని , నా సొంత సోదరుడు లాంటి వాడని పేర్కొన్నారు . తానంటే ఎంతో అభిమానంగా ఉండే బేగ్ ను కరోనా పొట్టన పెట్టుకోవడం అత్యంత బాధాకరమని ఎంపీ నామవిచారం వ్యక్తం చేశారు . ఈ విషాధాన్ని తట్టుకునే ఆత్మధైర్యాన్ని దైవం వారి కుటుంబ సభ్యులకు ప్రసాదించాలని అలానే బేగ్ ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ ఎంపీ నామ బేగ్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు .

బేగ్  మృతి పట్ల జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు సంతాపం.

తెలంగాణ రాష్ట్ర సమితి మాజీ జిల్లా అధ్యక్షుడు షేక్ బుడాన్ బేగ్ మృతి పట్ల లింగాల కమల్ రాజు సంతాపం వ్యక్తం చేశారు.

వారి మరణం బాధాకరమన్నారు. తెరాస పార్టీలో క్రియాశీలకంగా పని చేశారని, కార్యకర్త నుండి జిల్లా అధ్యక్షుడిగా ఎదిగారని, వారి మరణం పార్టీకి తీరని లోటన్నారు.

వారి కుటుంబానికి తమ ప్రగాఢ సానుబూతిని వ్యక్తం చేశారు. బేగ్ ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి ధైర్యం ప్రసాదించాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానని అన్నారు.

 

బేగ్ మృతి దిగ్భ్రాంతి కలిగించింది- గాయత్రి రవి నివాళి

టీఆర్ఎస్ మాజీ జిల్లా అధ్యక్షుడు బేగ్ మృతి తనకు దిగ్భ్రాంతి కలిగించిందని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి) పేర్కొన్నారు. ఆయన మృతి పట్ల సంతాపం తెలుపుతూ గాయత్రి రవి ఓ ప్రకటన విడుదల చేశారు. సౌమ్యుడు, మృధు స్వభావం కలిగిన బేగ్ తక్కువ కాలంలో రాజకీయాల్లో రాణించి.. అందరి అభిమానాన్ని చూరగొన్నారని కొనియాడారు. అధికార పార్టీకి జిల్లా అధ్యక్షుడిగా ఉండి ఉమ్మడి జిల్లాలో అందరినీ సమన్వయం చేయడం లో బేగ్ ఎంతో శ్రమించారని శ్లాఘించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

Related posts

మళ్ళీ విజృంభిస్తున్న కరోనా …నిర్లక్ష్యం మీ ఇందుకు కారణం!

Drukpadam

భారత్ లో అత్యంత చవకైన కరోనా వ్యాక్సిన్ కోర్బెవాక్స్ !

Drukpadam

కరోనాతో మరణిస్తే రూ.50వేల పరిహారం…

Drukpadam

Leave a Comment