Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగి “రేసు” లో ఆశావహులు …

ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగి “రేసు” లో ఆశావహులు …
గత ఎన్నికల్లో కాంగ్రెస్ కు సిపిఐ టీడీపీ మద్దతు
కాంగ్రెస్ 6 , టీడీపీ రెండు , ఒకస్థానంలో బీఆర్ యస్, మరో స్థానంలో స్వాతంత్ర అభ్యర్థి గెలుపు
ఈసారి పొంగులేటి అడుగులపైనే అందరి చూపు

నవంబర్ లో జరగనున్న తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగి రేసులో ఆశావహులు ఎవరు …? దాని బలం బలహీనతలు ఏమిటి..?అనేది చర్చనీయంశంగా ఉంది….2018 ఎన్నికల్లో కాంగ్రెస్ టీడీపీ , సిపిఐ కలసి పోటీచేశాయి. టీఆర్ యస్ ఒంటరిగా పోటీచేసింది. దీంతో ఒక్క ఖమ్మం సీట్లోనే టీఆర్ యస్ అభ్యర్థిగా పోటీచేసిన పువ్వాడ అజయ్ విజయం సాధించారు . 6 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ విజయ ఢంకా మోగించగా ,టీడీపీ రెండు , స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన రాములు నాయక్ వైరాలో విజయం సాధించారు . అయితే పాలేరు , మధిర , ఇల్లందు , కొత్తగూడెం , పినపాక , భద్రాచలం లలో కాంగ్రెస్ అభ్యర్థులుగా పోటీచేసిన కందాల ఉపేందర్ రెడ్డి , భట్టి విక్రమార్క , హరిప్రియ నాయక్ , వనమా వెంకటేశ్వరరావు ,రేగా కాంతారావు, పొదెం వీరయ్య లు విజయం సాధించారు . అనంతరం రాజకీయ పరిణామాల్లో భట్టి ,పొదెం మినహా మిగతా అందరు అధికార బీఆర్ యస్ కు జై కొట్టారు .

రేపు జరగనున్న ఎన్నికల కోసం కాంగ్రెస్ లో ఆశావహుల సంఖ్య భారీగానే ఉంది. కర్ణాటక ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ ఆశావహుల్లో ఆశలు రేకెత్తిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత తమకు అనుకూలంగా ఉంటుందని లెక్కలు వేసుకుంటున్నారు . ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నుంచి పోటీచేసేందుకు సిద్దపడుతున్నారు . ఉమ్మడి జిల్లాలో మూడు మాత్రమే జనరల్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా వాటిలో పాలేరు .ఖమ్మం ,కొత్తగూడెం ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీలో రాయల నాగేశ్వరరావు పేరు వినిపిస్తుంది . పీసీసీ అధికార ప్రతినిధి మద్ది శ్రీనివాస్ రెడ్డి కూడా టికెట్ ఆశిస్తున్నారు. ఖమ్మం నుంచి జావీద్ , మానుకొండ రాధాకిషోర్ , మరికొందరి పేర్లు వినిపిస్తున్నాయి. రేణుక చౌదరి కూడా పోటీచేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు . కొత్తగూడెం నుంచి పోటీచేసేందుకు పోట్ల నాగేశ్వరరావు పావులు కదుపుతున్నారు. మరోపక్క అనేక సార్లు కొత్తగూడెం సీటుకోసం విఫల యత్నం చేసిన ఎడవల్లి కృష్ణ తనకు ఈసారైనా అవకాశం ఇవ్వాలని అంటున్నారు . మరి ఒకరిద్దరి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇవి గాక రెండు ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయి. వాటిలో మధిర నుంచి సీటింగ్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క ఉన్నారు. సత్తుపల్లి నుంచి పోటీచేసేందుకు మాజీమంత్రి సంభాని ప్రయత్నం చేస్తున్నారు. మావతారాయ్ కూడా నేను ఉన్నానని అంటున్నారు . మరో ఇద్దరు పేర్లు పరిశీలనలో ఉన్నాయని తెలుస్తుంది. ఎస్టీ నియోజకర్గాలు ఐదు ఉండగా వాటిలో వైరా నుంచి బాలాజీ నాయక్ , రాంమూర్తి నాయక్ మరికొందరి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఇల్లందు నుంచి డాక్టర్ రవినాయక్ , వెంకటేశ్వర్లు , మరో ముగ్గురు పేర్లు వినిపిస్తున్నాయి. పినపాక నుంచి ములుగు ఎమ్మెల్యే సీతక్క కుమారుడితోపాటు , చందా లింగయ్య కుమారుడి పేరు ప్రచారం లో ఉంది. ఇక భద్రాచలం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే పొదెం వీరయ్య పోటీ దాదాపు ఖాయం …అశ్వారావుపేట నుంచి సున్నం నాగమణి , తాటి వెంకటేశ్వర్లు , పేర్లు ఉన్నాయి.

అయితే పొంగులేటి కాంగ్రెస్ లోచేరితే కొన్ని సీట్లలో మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. పొంగులేటి చేరిక పై ఆధారపడి సీట్ల కేటాయింపులు ఉంటాయని రాజకీయ పరిశీలకుల అభిప్రాయం …

 

 

Related posts

బిగ్ బాస్ హౌస్ పై నారాయణ కామెంట్ …కేసుపెడతానన్న నాగార్జున పెట్టుకోమన్న నారాయణ!

Drukpadam

కాపు రిజర్వేషన్ అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన జీవీఎల్ నరసింహారావు!

Drukpadam

నకిలీ మందులు ,నాణ్యత లేని ఆహారం… ప్రజల జీవితాలతో చెలగాటం..!

Drukpadam

Leave a Comment