Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

పొంగులేటికి బీజేపీ బంపర్ ఆఫర్…కేంద్రమంత్రి పదవి ఇస్తామని సంకేతాలు !

పొంగులేటికి బీజేపీ బంపర్ ఆఫర్…కేంద్రమంత్రి పదవి ఇస్తామని సంకేతాలు !
-రాష్ట్రంలో బీజేపీ పరిస్థితిపై ఈటెలతో సుదీర్ఘ చర్చ
-హాజరైన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ,జూపల్లి కృష్ణారావు
-రాష్ట్రంలో అధికారం వస్తుందనే భరోసా ఇవ్వలేక పోయారని ప్రచారం
-కేసీఆర్ కాళేశ్వరం అవినీతి ,కవిత లిక్కర్ స్కాం పై ప్రశ్నించిన నేతలు
-తగిన సమాధానం దొరకని వైనం …అసంపూర్తిగానే చర్చలు
-పొంగులేటి ,జూపల్లి కాంగ్రెస్ లోకి పోతున్నారని ప్రచారం
-ఈటలతో భేటీతో సందేహాలు …అనుయాయుల్లో అసంతృప్తి
-కాంగ్రెస్ పెరిగిన జోష్… బీజేపీలో తగ్గిన జోరు ….

పొంగులేటి బీజేపీ బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తుంది…. పార్టీలో చేరితే కేంద్రమంత్రి పదవి ఇవ్వడంతోపాటు ఒక్క ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో తనతోపాటు జాయిన్ అయ్యేవారికి టికెట్స్ ఇస్తామని కూడా హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. కేంద్రమంత్రి పదవి ఉంటె ఆయనకు ప్రోటోకాల్, సెక్యూరిటీ ఉంటుందని దీంతో ఎన్నికల్లో కూడా ఇది ఉపయోగపడుతుందని పొంగులేటిని బీజేపీ కన్విన్స్ చేసే ప్రయత్నం చేసేందని అంటున్నారు . అయితే జిల్లాలో రాజకీయ పరిస్థితులు అనుయాయుల అభిప్రాయాలు అందుకు భిన్నంగా ఉండటంతో ఆయన ఇరకాటంలో పడ్డారు . అందువల్లనే ఆయన ఎవరికీ మాట ఇవ్వకుండా మల్లగుల్లాలు పడుతున్నారు.

గతంలో అనేక సార్లు అటు కాంగ్రెస్ ,ఇటు బీజేపీ నేతలు పొంగులేటిని జూపల్లిని పలుమార్లు కలిసి చర్చించారు . రాహుల్ దూతలు నేరుగానే చర్చించారు . రాహుల్ తో నేరుగా ఫోన్ లో మాట్లాడించారు . రేవంత్ రెడ్డి తో అనుకోకుండా భేటీ జరిగింది. అభిప్రాయాలు పంచుకున్నారు .కానీ ఒక నిర్ణయానికి రాలేదు. చివరకు గత నెల బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ ఆధ్వరంలో బీజేపీ ప్రతినిధి బృందం ఖమ్మంలో పొంగులేటి నివాసానికి వచ్చి చర్చించింది. అప్పుడు కూడా ఐదు గంటలకు పైగా జరిగిన చర్చలు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేదు ..తిరిగి ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ లోకి పొంగులేటి వెళుతున్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో జూపల్లి తో కలిసి బీజేపీ నేత ఈటెలను ఫామ్ హౌస్ లో కలవడంపై ఉత్కంఠత నెలకొన్నది . ఇది సాధారణ భేటీ అని చెపుతున్నప్పటికీ సుదీర్ఘంగా జరిపిన చర్చలు బయటకు వెల్లడి కాలేదు …

పొంగులేటి ,జూపల్లిలను వారి అనుయాయులు కాంగ్రెస్ లో చేరాలని వత్తిడి తెస్తున్న సమయంలో బీజేపీ నేతను కలవడం పై సందేహాలు నెలకొన్నాయి. కారణాలు ఏమైనా ఇది రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే బీజేపీలోకి రమ్మని ఈటల వారిని మరోసారి కోరారని అందుకు వారు సంధించిన ప్రశ్నలకు ఈటెల వైపు నుంచి సరైన సమాధానం రాలేదని అంటున్నారు . బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు అవకాశాలపై కూడా వారి చర్చల్లో చోటుచేసుకుందని సమాచారం .

కర్ణాటక ఎన్నికలకు ముందు దూకుడుగా ఉన్న బీజేపీ కొంత నీరసించింది. అధికారంలో ఉన్న కర్ణాటకలో ఓడిపోవడం ఆపార్టీ శ్రేణులకు ఇబ్బందికరంగా మారింది. పైగా రాష్ట్రంలో బీజేపీ నేతల మధ్య సఖ్యత లేదని , కేవలం హిందుత్వ ఎజెండాగానే ఎన్నికల్లోకి వెళ్లడం ద్వారా లబ్ది పొందాలని చూడటం, వారి ప్రచారంలోను , సభలు అటువైపుగానే ఆలోచనలు చేయడం పట్ల తెలంగాణా సమాజం జీర్ణించుకోలేక పోతుంది. ఇప్పటికే ఏ ఒక్క నాయకుడు ఒక జిల్లాను శాసించే స్థాయిలో లేరు ..కేంద్రంలో అధికారంలో ఉందికదా అని కేసీఆర్ కు వ్యతిరేకంగా ఉన్న శక్తులు బీజేపీలో చేరాయి. కేసీఆర్ అవినీతి పైన , కవిత లిక్కర్ స్కాం పైన చర్యలు ఉంటాయని ,వారు జైల్లోకి వెళ్లడం ఖాయమని బీజేపీ అంటున్నా ఆచరణలో కార్యరూపం దాల్చకపోవడంపై బీజేపీపై నమ్మకంతో చేరిన నేతలు సైతం ఆలోచనలో పడ్డట్లు ఇటీవల వార్తలు వస్తున్నాయి.

తెలంగాణాలో కొన్ని నెలల క్రితం కాంగ్రెస్ బలహీనంగా ఉన్నప్పటికీ ఇటీవల కాలంలో దాని గ్రాఫ్ బాగా పెరిగిందని అంటున్నారు . పైగా గ్రూపులుగా కొట్టుకుంటున్నప్పటికీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటు బ్యాంకు గతంలోకన్నా పెరిగిందని అంటున్నారు . ఉమ్మడి ఖమ్మం , నల్లగొండ , మహబూబ్ నగర్ , రంగారెడ్డి , వరంగల్ ,కరీంనగర్ లాంటి జిల్లాల్లోను మెదక్, ఆదిలాబాద్ , నిజామాబాద్ జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి అనుకూల వాతావరణం ఉందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే రాష్ట్రమంత్రి హరీష్ రావు మాత్రం 40 నుంచి 50 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కు అభ్యర్థులే దొరకటంలేదని అంటున్నారు. భట్టి పుపుల్స్ మార్చ్, అంతకు ముందు రేవంత్ రెడ్డి హత్ సే హత్ జోడో యాత్ర , నిరుద్యోగ నిరసన ర్యాలీలు, మల్లికార్జునఖర్గే ,ప్రియాంక రాష్ట్ర పర్యటనలు కాంగ్రెస్ శ్రేణులను కదిలిస్తున్నాయని అంటున్నారు . కర్ణాటక ఎన్నిలక తర్వాత కాంగ్రెస్ లో జోష్ పెరిగింది. అయితే కేసీఆర్ చాణిక్యం ముందు ఇవి ఎంతవరకు పనిచేస్తాయో చూడాలి …

Related posts

యాదవులను క్షమాపణలు కోరిన సీపీఐ నారాయణ!

Drukpadam

రాజారెడ్డికే భ‌య‌ప‌డలేదు… జ‌గ‌న్‌కు భ‌య‌ప‌డ‌తామా?: నారా లోకేశ్!

Drukpadam

శరద్​ పవార్​ తో ప్రశాంత్​ కిషోర్​ భేటీ.. ‘మిషన్​ 2024’పై మంతనాలు!

Drukpadam

Leave a Comment