Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలు

తెలంగాణలో మరోసారి లాక్ డౌన్ పొడిగింపు…

తెలంగాణలో మరోసారి లాక్ డౌన్ పొడిగింపు…

  • ఇటీవలే 10 రోజుల లాక్ డౌన్ విధింపు
  • ఈ నెల 30 వరకు పొడిగిస్తూ కేసీఆర్ నిర్ణయం
  • లాక్ డౌన్ పొడిగింపుకే మొగ్గు చూపిన మంత్రులు
  • రాష్ట్రంలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి

కరోనా సెకండ్ వేవ్ ప్రభంజనాన్ని ఎదుర్కొంటున్న తెలంగాణలో మరోసారి లాక్ డౌన్ పొడిగించారు. ఈ నెల 30 వరకు లాక్ డౌన్ పొడిగిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. లాక్ డౌన్ పొడిగింపుపై ఆయన మంత్రుల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. మంత్రులు లాక్ డౌన్ పొడిగింపుకే మొగ్గు చూపారు. ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం 10 రోజుల లాక్ డౌన్ విధించింది. తెలంగాణలో గత కొన్నిరోజులుగా 4 వేలకు అటూఇటూగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధిక కేసులు వెల్లడవుతున్నాయి. ఈ నేపథ్యంలో, లాక్ డౌన్ పొడిగించడమే మేలని రాష్ట్ర క్యాబినెట్ అభిప్రాయపడింది.

Related posts

దేశీయ, అంతర్జాతీయ విమానాలను నిషేధించిన నేపాల్

Drukpadam

2023 వరకు ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్ బుకింగ్స్ ఫుల్… వెయిటింగ్ లిస్టులో భారత్!

Drukpadam

ప్రపంచాన్ని వణికించే డెల్టా వేరియంట్.. చిన్నారులపై ప్రభావమెంత?

Drukpadam

Leave a Comment