Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

తెలంగాణాలో ఎన్నికల కోసం ఎన్నికల సంఘం కసరత్తు…

తెలంగాణాలో ఎన్నికల కోసం ఎన్నికల సంఘం కసరత్తు…
-అక్టోబర్ చివరినాటికి 18 సంవత్సరాలు నిండినవారికి ఓటు హక్కుకు అవకాశం
-మార్పులు చేర్పులకు సైతం సమయం ఇచ్చిన ఈసీ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను ఈ ఏడాది చివ‌ర్లో నిర్వ‌హించేందుకు ఎన్నిక‌ల సంఘం క‌స‌ర‌త్తు ప్రారంభించింది. ఈ నేప‌థ్యంలో కొత్త ఓట‌ర్ల న‌మోదుకు ప్ర‌క్రియ ప్రారంభించింది ఎన్నికల సంఘం. ఇందులో భాగంగా 2023 అక్టోబ‌ర్ 1వ తేదీ నాటికి 18 సంవ‌త్స‌రాలు నిండిన వారు కొత్త‌గా ఓట‌రు న‌మోదు కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. అర్హత కలిగిన వారు బూత్‌ లెవల్‌ అధికారుల వద్ద దరఖాస్తు పూర్తి చేయాలని సూచించారు.

అదే విధంగా జూన్‌ 24 నుంచి జులై 24 తేదీ వరకు ఓటరు కార్డులపై ఫోటోల మార్పిడి, పోలింగ్‌ కేంద్రాల బౌండరీల నిర్ధారణ చేయనున్నారు. జులై 25 నుంచి 31వ తేదీ వరకు నమూనా ఓటరు జాబితా రూపొందించనున్నారు. ఆ తర్వాత ఆగస్టు 2వ తేదీన ఓటరు ముసాయిదా జాబితాను విడుదల చేయనుంది. ఆగస్టు 31వ తేదీ వరకు ముసాయిదా జాబితాపై అభ్యంతరాలను స్వీకరించనుంది. ముసాయిదా జాబితాపై అందిన ఫిర్యాదులను సెప్టెంబర్‌ 22వ తేదీ వరకు పరిష్కరించనున్నారు. ఓటర్ల తుది జాబితా విడుదల కోసం సెప్టెంబర్‌ 29వ తేదీ వరకు ఎలక్షన్‌ కమిషన్‌ అనుమతి తీసుకుంటారు. కమిషన్‌ అనుమతి లభించగానే అక్టోబర్‌ 4వ తేదీన ఓటర్ల తుది జాబితా విడుద‌ల కానుంది. www.nvsp.in ద్వారా ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తుల‌కు అవ‌కాశం క‌ల్పించారు.

Related posts

బతికే ఉన్న నన్ను చంపేయకండి: కోట శ్రీనివాసరావు!

Drukpadam

మా బడ్జెట్‌లో సకల జనుల సంక్షేమం ఉంది : అసెంబ్లీలో మంత్రి హరీశ్‌రావు!

Drukpadam

మంత్రి కొప్పుల ఈశ్వర్ కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు!

Drukpadam

Leave a Comment