Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

సీల్డ్ కవర్ లో సుప్రీం కోర్ట్ కు రాఘురామ మెడికల్ రిపోర్ట్…

సీల్డ్ కవర్ లో సుప్రీం కోర్ట్ కు రాఘురామ మెడికల్ రిపోర్ట్…
-ఈ నెల 21 న బైలు పై విచారణ
-మెడికల్ రిపోర్ట్ పై ఉత్కంఠ
-ఆర్మీ ఆసుపత్రిలో తన తండ్రిని కలిసేందుకు రఘురాం కుమారుడు ప్రయత్నం
-కుదరదన్న ఆర్మీ అధికారులు -అసంతృప్తి వ్యక్తం చేసిన భారత్
అంత్యంత నాటకీయపరిణామాల మధ్య రాజద్రోహం కేసులో అరెస్ట్ అయిన నరసాపురం ఎంపీ రాఘురామ కృషంరాజు దెబ్బలపై సుప్రీం ఆదేశాల మేరకు పరీక్షలు పూర్తీ అయ్యాయి. తెలంగాణ హైకోర్టు నియమించిన జడిసియల్ అధికారి నాగార్జున ఆధ్వరంలో డాక్టర్ల బృందం ఆయనకు పరీక్షలు నిర్వహించింది. రిపోర్ట్ ను అత్యంత గోప్యంగా సీల్డ్ కవర్లో సుప్రీం కోర్ట్ కు అందించనున్నారు. ఈ నెల 21 న ఆయన బెయిల్ పిటిషన్ పై సుప్రీం కోర్ట్ లో విచారణ జరగనున్నది. రాఘురామ కృషం రాజు ప్రస్తుతం సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో ఉన్నారు . సుప్రీం కోర్ట్ ఆదేశాలు మేరకు పరీక్షల అనంతరం అక్కడే ఆయన కస్టడీ లో ఉన్నారు. అందువల్ల ఎవరిని కలిసేందుకు వీలులేదని ఆర్మీ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. అయితే ఆయన ను కలిసేందుకు ఆయన కుమారుడు భారత్ వచ్చారు. ఆయన కలిసేందుకు సైతం అధికారులు అనుమతి నిరాకరించారు. కోర్ట్ పరిధిలో కేసు ఉన్నందున ఎవరికీ అనుమతి ఇవ్వటం లేదు. గత ఐదు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ ఎ సి బి అధికారులు ఆయన్ను హైద్రాబాద్ లోని ఆయన నివాసంలో అరెస్ట్ చేశారు. అక్కడ నుంచి గుంటూరు లోని ఎ సి బి కార్యాలయానికి తరలించారు. అక్కడ నుంచి ఎ సి బి కోర్ట్ కు తరలించారు. ఎ సి బి కోర్ట్ కు వెళ్ళాక ముందే రాఘురామ బెయిల్ కోసం హైకోర్టు కు ఆశ్రయించారు.హైకోర్టు బెయిల్ విషయం ఎ సి బి కోర్ట్ లోనే తేల్చుకోవాలి గని నేరుగా ఇక్కడకు రావడం ఏమిటని అభ్యంతరం వ్యక్తం చేసింది. చివరకు ఎ సి బి కోర్ట్ బైలు ఇచందుకు నిరాకరించటమే కాకుండా 28 వరకు రిమాండ్ విధిస్తు ఆదేశాలు జారీచేశారు. దీంతో రాఘురామ తనను ఎ సి బి కస్టడీ లో విఫరీతంగా కొట్టారని తన కాళ్లు అందువల్లనే వాచి పోయాయని ఎ సి బి కోర్ట్ కు 12 పేజీల లిఖిత పూర్వకమైన లేఖ అంద జేశారు. దీనిపై స్పందించిన కోర్ట్ పరీక్షలకు ఆదేశాలు జారీచేసింది.తనకు ఆరోగ్యం సరిగా లేనందున రమేష్ ఆసుపత్రికి తరలించాలని కోర్ట్ ను ఆయన కోరారు. అయితే ఈ లోపు హైకోర్టు రాఘురామ దెబ్బల విషయం సీరియస్ గా తీసుకొని మెడికల్ టీమ్ ను ఏర్పాటు చేసి ఆయన దెబ్బలపై గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించి సీల్డ్ కవర్ లో నివేదిక అందజేయాలని ఆదేశాలు జారీచేసింది. సీల్డ్ కవర్ హైకోర్టు కు అందింది . దాన్ని న్యాయమూర్తి పరిశీలించారు.దానిపై ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. అయితే ఈ లోపు రాఘురామ సుప్రీం కోర్ట్ ను ఆశ్రయించారు. సుప్రీం కోర్ట్ లో రాఘురామ తరుపున ప్రముఖ సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్గ్ని వాదించారు. ప్రభుత్వం తరుపున అడ్వకేట్ దుశ్యంత్ వాదించారు. రాఘురామ కు తిరిగి పరీక్షలు నిర్వహించాలని సుప్రీం కోర్ట్ ఆదేశాలు జారీచేసింది. ఈ సారి ఆయనను ఎ సి బి అధికారులు భౌతిక దాడులకు పయపడ్డారా ? లేదా ? అనేది తేలాలంటే సికిందరాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలు జారీచేసింది. ఇందుకు ఆయనే ఖర్చులు భరిస్తారని తెలిపింది. వెంటనే ఆయన్ను గుంటూరు జిల్లా జైలు నుంచి సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రికి ప్రత్యేక వాహనం లో తరలించారు . అక్కడ జ్యూడిషల్ అధికారి పర్వవేక్షణలో పరీక్షలు జరిగాయి.పరీక్షల రిపోర్ట్ కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. అందులో ఏముంది. గుంటూరు ఆసుపత్రిలో వైద్యాధికారులు చేసిన పరీక్షలకు భిన్నంగా ఏమైనా ఫలితాలు ఉంటాయా ?ఆయన అరికాళ్లకు నిజంగా దెబ్బలు తగిలాయా?లేదా ? ఆర్మీ డాక్టర్ లు జరిపిన పరీక్షలలో ఏమి తేలనునది . సీల్డ్ కవర్ లో ఏముంది.సుప్రీం కోర్ట్ ఈ నెల 21 న ఆయన బైలు పై వాదనలు విననున్నది ఆ సందర్భంగా ఆర్మీ ఆసుపత్రిలో జరిగిన పరీక్షల విషయం బయటకు వచ్చే ఆవకాశం ఉంది. అప్పటి వరకు దానిపై నెలకొన్న ఉత్కంఠ కొనసాగుతూనే ఉంటుంది.

రఘురాజుకు వైద్య పరీక్షలు నిర్వహించాం: ఆర్మీ ఆసుపత్రి వైద్యులు

జ్యుడీషియల్ అధికారి ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు చేశాం
మొత్తం ప్రక్రియను వీడియో తీశాం
ప్రస్తుతం రఘురాజు మెడికల్ కేర్ లో ఉన్నారు
వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఆర్మీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. ఈ మేరకు ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. తెలంగాణ హైకోర్టు నియమించిన జ్యుడీషియల్ అధికారి ఆధ్వర్యంలో ముగ్గురు వైద్యుల బృందం పరీక్షలను నిర్వహించిందని చెప్పారు.

ఈ పరీక్షల ప్రక్రియను వీడియో తీశామని తెలిపారు. ప్రస్తుతం రఘురాజు ఆసుపత్రిలో మెడికల్ కేర్ లో ఉన్నారని చెప్పారు. సుప్రీంకోర్టు తదుపరి ఆదేశాలను ఇచ్చేంత వరకు ఆయన ఇక్కడే ఉంటారని వెల్లడించారు. కరోనా ప్రొటోకాల్ ను కూడా పాటిస్తున్నామని చెప్పారు.

మరోవైపు డాక్టర్లు ఇచ్చే రిపోర్టును సుప్రీంకోర్టుకు తెలంగాణ హైకోర్టు సీల్డ్ కవర్ లో సమర్పించనుంది. రఘురాజు ఆసుపత్రిలో ఉన్న సమయాన్ని కూడా జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నట్టుగానే పరిగణించనున్నారు. ఇదిలావుంచితే, ఆయనను కలిసేందుకు ఆర్మీ అధికారులు ఎవరినీ అనుమతించడం లేదు.

Related posts

జడ్జి పురుషుడు అయినా, మహిళ అయినా సర్ అనాలి: గుజరాత్ హైకోర్టు సీజే 

Drukpadam

గత రెండేళ్లుగా రూ.2000 నోట్లను ముద్రించడంలేదు: కేంద్రం

Drukpadam

చెన్నై ఆసుపత్రిలో చేరిన ప్రధాని మోదీ సోదరుడు!

Drukpadam

Leave a Comment