- ఓ టింబర్ డిపో, కార్ల షోరూంలో ఎగిసిపడిన మంటలు
- మంటల ధాటికి 50కి పైగా కార్లు దగ్ధం!
- రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది
- పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి
ఎల్బీ నగర్ లో మంగళవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ టింబర్ డిపో, కార్ల షోరూంలో మంటలు ఎగిసిపడుతున్నాయి. తొలుత టింబర్ డిపోలో మంటలు ఎగిసిపడటంతో ఆ పక్కనే ఉన్న పాత కార్ల షోరూంకు కూడా మంటలు వ్యాప్తి చెందాయి. మంటల దాటికి 20 నుండి 50కి పైగా కార్లు దగ్ధమయ్యాయి.
రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పింది. మంటలు ఆర్పుతున్న సమయంలో కార్ల గ్యారేజీలో సిలిండర్ పేలింది. దీంతో భారీ శబ్దాలతో మంటలు ఎగిసిపడ్డాయి. పరిసర ప్రాంతాల్లో పొగ దట్టంగా అలుముకుంది. దట్టమైన పొగతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. చుట్టు పక్కలవారిని ఖాళీ చేయించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.