Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

కర్నాటకలో మహిళలందరికీ బస్సు ప్రయాణం ఉచితమే… మంత్రి రామలింగారెడ్డి

  • ర్కింగ్ వుమెన్ లేదా ఇంకెవరైనా సరే బస్సు ప్రయాణం ఉచితమేనన్న మంత్రి 
  • అన్ని ప్రభుత్వ సర్వీసుల్లో ఉచిత ప్రయాణంపై కేబినెట్ నిర్ణయం తీసుకుంటుందని వ్యాఖ్య
  • మహిళలకు ఉచిత ప్రయాణం త్వరలో ప్రారంభం

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చింది. అందులో ప్రధానమైనది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. ఈ హామీపై షరతులు ఉంటాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిపై కర్ణాటక రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి స్పందించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని అమలు చేయడంలో ఎలాంటి షరతులు ఉండబోవని చెప్పారు. వర్కింగ్ వుమెనా, ఇంకెవరా అనే అంశంతో సంబంధం లేదని, బస్సులో ప్రయాణించే మహిళలందరికీ ఉచితమేనని స్పష్టం చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా 3.5 కోట్ల మందికి పైగా మహిళలు ఉన్నారు కదా అని విలేకరులు ప్రశ్నించగా… వారందరూ బస్సులో ప్రయాణించాలనుకుంటే అందరికీ ఉచితమేనని చెప్పారు. అయితే అన్ని ప్రభుత్వ సర్వీసుల్లో ఉచిత ప్రయాణంపై కేబినెట్ తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్కీమ్ త్వరలో ప్రారంభమవుతుందన్నారు. తాను ఎండీలు, ఇతర అధికారులతో ఈ స్కీమ్ గురించి మాట్లాడానని, ఇందుకు సంబంధించిన వివరాలను, ఖర్చులను సీఎంకు సమర్పించినట్లు చెప్పారు.

Related posts

ఫిలిప్పీన్స్ ను కకావికలం చేసిన సూపర్ టైఫూన్ ‘రాయ్’… 112 మంది మృతి

Drukpadam

హైద్రాబాద్ నుంచి లండన్ కు నేరుగా విమానాలు!

Drukpadam

ఢిల్లీలో డాక్టర్లు వర్సెస్ పోలీసులు.. ఉద్రిక్త పరిస్థితులు

Drukpadam

Leave a Comment