తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రకటించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదంతో చైర్మన్ తో పాటు సభ్యుల పేర్లను ప్రకటించారు. చైర్మన్ గా సీనియర్ ఐఏఎస్ అధికారి డాక్టర్ బి .జనార్దన్ రెడ్డిని నియమించారు. మిగతా సభ్యులను కూడా ప్రకటించారు. టి ఎం జి ఓ మాజీ అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి కి కూడా అందులో ప్రాతినిధ్యం కల్పించటం విశేషం . తెలంగాణ రాష్ట్రంలో లక్ష 93 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ప్రకటించిన నేపథ్యంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు ప్రాధాన్యత సంతరించుకున్నది.ఇప్పటికే నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నది . పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు యువత లో ఆశలు చిగురింప చేసింది . అందులో కమిషన్ చైర్మన్ గా ఐఏఎస్ ను నియమించటం పై కూడా సానుకూల వ్యాఖ్యానాలే వినిపిస్తున్నాయి. మరి ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ కోసం సత్వర చర్యలు తీసుకుంటుందా ? లేదా ? అనేది చూడాలి .
సభ్యుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ చైర్మన్, సభ్యులను నియమించిన ముఖ్యమంత్రి కేసీఆర్
టీఎస్ పీఎస్సీ చైర్మన్ గా ఐఏఎస్ అధికారి డాక్టర్. బి. జనార్ధన్ రెడ్డి
టీఎస్ పీఎస్సీ సభ్యులుగా మరో ఏడుగురు నియామకం
సభ్యులుగా రామావత్ ధన్ సింగ్,బి.లింగారెడ్డి, కోట్ల అరుణకుమారి..
డా.ఆరవెళ్లి చంద్రశేఖర్ రావు,ఆర్.సత్యనారాయణ..
కారం రవీందర్ రెడ్డి,సుమిత్రా ఆనంద్