Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

‘అవినాశ్ రెడ్డిపై చర్యలు తీసుకోండి..సునీత మెమో..పరిగణనలోకి తీసుకోని హైకోర్టు

‘అవినాశ్ రెడ్డిపై చర్యలు తీసుకోండి’ అంటూ వైఎస్ సునీత మెమో.. పరిగణనలోకి తీసుకోని హైకోర్టు

  • అవినాశ్ తల్లికి సర్జరీ జరగలేదని మెమోలో పేర్కొన్న సునీత
  • అవినాశ్ కు బెయిల్ మంజూరు చేసిన న్యాయస్థానం  
  • సీబీఐ సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం

వైఎస్ వివేకా హత్య కేసులో వైసీపీ కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. షరతులతో కూడిన బెయిల్ ను హైకోర్టు మంజూరు చేసింది. మరోవైపు వివేకా కూతురు సునీత హైకోర్టులో మెమో దాఖలు చేశారు. అవినాశ్ తల్లికి ఆరోగ్యం బాగోలేదని, దీంతో ఆమెను అవినాశ్ దగ్గరుండి చూసుకోవాల్సిన అవసరం ఉందని గత వారం వాదనల సందర్భంగా కోర్టుకు అవినాశ్ లాయర్ తెలిపారు. అవినాశ్ కు బెయిల్ ఇవ్వాలని, అవినాశ్ తల్లి అనారోగ్యం విషయంలో తాము తప్పు చెపితే తమపై చర్యలు తీసుకోవచ్చని కోర్టుకు తెలిపారు.

ఈ క్రమంలో సునీత మెమో దాఖలు చేశారు. అవినాశ్ తల్లికి ఎలాంటి సర్జరీ జరగలేదని, అవినాశ్ పై చర్యలు తీసుకోవాలని మెమోలో ఆమె కోరారు. అయితే ఆమె మెమోను హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. అవినాశ్ కు బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు హైకోర్టు బెయిల్ ఆర్డర్ ను సీబీఐ అధికారులు పరిశీలిస్తున్నారు. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సీబీఐ సవాల్ చేసే అవకాశం ఉంది.

Related posts

కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి నివేదిత ఇంటి వద్ద డబుల్ బెడ్రూం లబ్ధిదారుల ఆందోళన…

Ram Narayana

కేంద్రం పొదుపు మంత్రం … ఖర్చులు తగ్గించుకోండి

Drukpadam

అమెరికా వైట్‌హౌస్ పరిసరాల్లోకి ట్రక్‌తో దూసుకెళ్లిన తెలుగు యువకుడికి శిక్ష !

Drukpadam

Leave a Comment