Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

అమరుల త్యాగాలు వెలకట్టలేనివి ఎమ్మెల్యే వనమా…!

అమరుల త్యాగాలు వెలకట్టలేనివి
ఎమ్మెల్యే వనమా

తెలంగాణ రాష్ట్ర సాధనలో తమ అమూల్యమైన ప్రాణాలను తృణప్రాయంగా త్యాగం చేసిన తెలంగాణ అమరుల త్యాగాలు వెలకట్టలేనివని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు.
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా వనమా ఆధ్వర్యంలో శుక్రవారం భారీ మోటార్ సైకిల్ విజయోత్సవ ర్యాలీ నిర్వహహించి జాతీయ జెండాను ఆవిష్కరించారు .బస్టాండ్ సెంటర్ వద్ద అమరవీరుల స్థూపానికి పూలమాలవేసి తెలంగాణ అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలో అగ్ర భాగాన నిలిపేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. అమరుల త్యాగాలు వృధా కాకుండా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. అభివృద్ధి సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే రోల్ మోడల్ గా నిలిచిందన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి, జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర రావు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు, అభిమానులు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Related posts

వైసీపీ ఎంపీ రఘరామ అరెస్ట్ ప్రతీకార రాజకీయాలకు నిదర్శనం :చంద్రబాబు…

Drukpadam

అసెంబ్లీ తీర్మానాలు చెల్లవని హైకోర్టు చెప్పడం దారుణం: మోదుగుల

Drukpadam

కాంగ్రెస్ వైఫల్యమే బిజెపి ఎదుగుదల కారణం …సిపిఐ పోరు యాత్రలో వక్తలు …

Drukpadam

Leave a Comment