Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలు

ఉదయం 10 తర్వాత బయట వస్తే వాహనం జప్తు: డీజీపీ మహేందర్‌రెడ్డి హెచ్చరిక…

ఉదయం 10 తర్వాత బయట వస్తే వాహనం జప్తు: డీజీపీ మహేందర్‌రెడ్డి హెచ్చరిక…
-లాక్‌డౌన్‌ను మరింత కఠినతరం చేయనున్న ప్రభుత్వం
-గల్లీలు, కాలనీల్లో నిఘా పెంచాలని నిర్ణయం
-10 గంటలకే గస్తీ వాహనాలు సైరన్ మోగించాలని ఆదేశం
-కరోనా కట్టడి చేయాలంటే కఠిన చర్యలు తప్పవు
తెలంగాణలో లాక్‌డౌన్‌ మరింత పటిష్ఠంగా అమలు కానుంది. ఉదయం 10 గంటలతో ప్రభుత్వం ఇచ్చిన సడలింపు ముగియనున్నప్పటికీ పని లేకున్నా వాహనాలపై బయటకు వచ్చే వారి పని పట్టాలని పోలీసులు నిర్ణయించారు. ఇకపై 10 గంటల తర్వాత బయటకు వచ్చే వారి వాహనాలను తాత్కాలికంగా జప్తు చేయాలని డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. కాలనీలు, అంతర్గత రోడ్లలోనూ నిఘాను పెంచాలని సూచించారు.ఎవరు నిబంధనలను ఉల్లంఘించిన చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను డీజీపీ ఆదేశంనించారు.

10 గంటలకే అన్ని గస్తీ వాహనాలు సైరన్ మోగించాలని, ఉదయం ఆరు గంటల నుంచే ప్రజలు బయటకు వచ్చి నిత్యావసరాలు కొనుగోలు చేసుకునేలా చైతన్య పరచాలని సూచించారు. అలాగే, కరోనా వ్యాప్తికి ఎక్కువగా అవకాశం ఉండే చేపలు, కూరగాయల మార్కెట్లలో రద్దీని తగ్గించేందుకు ఆయా శాఖల అధికారులతో కలిసి వికేంద్రీకరణ దిశగా చర్యలు చేపట్టాలని డీజీపీ సూచించారు.

Related posts

మహమ్మారి ఇప్పుడప్పుడే పోయేది కాదు..ప్రపంచ ఆరోగ్య సంస్థ!

Drukpadam

తెలంగాణ లో లాక్‌డౌన్ మరో 10 రోజుల పొడిగింపు ….

Drukpadam

కరోనా సోకితే వచ్చే రక్షణ కన్నా,వ్యాక్సిన్​ తీసుకుంటే వచ్చే రక్షణే ఎక్కువ: తాజా అధ్యయనంలో వెల్లడి!

Drukpadam

Leave a Comment