Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ప్రతిపక్షం లేకుండానే ఏపీ బడ్జెట్ సమావేశాలు…

ప్రతిపక్షం లేకుండానే ఏపీ బడ్జెట్ సమావేశాలు…
రూ. 2.30 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్..
రాష్ట్ర బడ్జెట్ అంచనా రూ. 2,29,779.27 కోట్లు
రెవెన్యూ వ్యయం రూ. 1,82,196 కోట్లు
రెవెన్యూ లోటు రూ. 5 వేల కోట్లు
వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టిన కన్నబాబు
ప్రతిపక్షం లేకుండానే ఏపీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి . మొదటి సరిగా ప్రతిపక్షం బడ్జెట్ సమావేశాలను బహిష్కరించడం విశేషం .అయితే ఇదే సమయం లో తెలుగుదేశం ఆధ్వరంలో బయట మాక్ అసెంబ్లీ ని నిర్వహిస్తున్నారు.
ఏపీ రాష్ట్ర బడ్జెట్ ను ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. దాదాపు రూ. 2.30 లక్షల కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో సంక్షేమ పథకాలకు పెద్దపీట వేశారు. ఈ బడ్జెట్ లో నవరత్నాలకే ప్రభుత్వం పెద్దపీటను వేసింది. ప్రజల సంక్షేమమే వైసీపీ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని బుగ్గన ఈ సందర్భంగా చెప్పారు. మండలిలో బడ్జెట్ ను హోమ్ మంత్రి మేకతోటి సుచరిత ప్రవేశ పెట్టారు. కరోనా కారణంగా మార్చ్ లో ప్రవేశ పెట్టాల్సిన బడ్జెట్ వాయిదా పడటంతో అనివార్య పరిస్థితిలో కోవిద్ నిబంధనలకనుగుణంగా బడ్జెట్ సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఒకటి రెండు రోజుల బడ్జెట్ సమావేశాలపై టీడీపీ భగ్గుమన్నది . కనీసం వారంరోజులైనా సమావేశాలు ఉండాలని డిమాండ్ చేసింది. ఒకటి రెండు రోజుల సమావేశాలకు తాము హాజరు కాబోమని ముందుగానే ప్రకటించి సమేవేశాలను భహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. ప్రతిపక్షాలేకుండానే సమావేశాలు ప్రారంభం అయ్యాయి. గవర్నర్ బిస్వా భూషణ్ హరిచందన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు.

బడ్జెట్ వివరాలు వివరాలు ఈ విధంగా ఉన్నాయి

2021-22 రాష్ట్ర బడ్జెట్ అంచనా – రూ. 2,29,779.27 కోట్లు
రెవెన్యూ వ్యయం – రూ. 1,82,196 కోట్లు
మూలధన వ్యయం – రూ. 47,582 కోట్లు
రెవెన్యూ లోటు – రూ. 5 వేల కోట్లు (0.47 శాతం)
ద్రవ్య లోటు – రూ. 37,029.79 కోట్లు
జీఎస్డీపీలో ద్రవ్యలోటు – రూ. 3.49 శాతం
నీటిపారుదల శాఖకు – రూ. 13,237.78 కోట్లు
అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ ప్రసంగాన్ని ఆర్థిక మంత్రి బుగ్గన ముగించారు. వెంటనే వ్యవసాయ మంత్రి కన్నబాబు వ్యవసాయశాఖ బడ్జెట్ ను ప్రారంభించారు.
ఆరోగ్య రంగానికి రూ. 13,840.44 కోట్లు
దిశ పథకానికి రూ. 33.75 కోట్లు
రోడ్లు, భవనాల శాఖకు రూ. 7,594.6 కోట్లు

బడ్జెట్ వివరాలు:

ఆరోగ్య రంగానికి – రూ. 13,840.44 కోట్లు
ఆసుపత్రుల్లో నాడు-నేడు కార్యక్రమానికి – రూ. 1,535 కోట్లు
ఆరోగ్యశ్రీ, ఔషధాల కొనుగోళ్లకు – రూ. 2,248.94 కోట్లు
ఏపీవీవీపీ ఆసుపత్రుల్లో శానిటైజేషన్ కు – రూ. 100 కోట్లు
శ్రీకాకుళం జిల్లాలోని పలాస ఆసుపత్రికి – రూ. 50 కోట్లు
కరోనాపై పోరాటానికి – రూ. 1,000 కోట్లు
పరిశ్రమలకు ఇన్సెంటివ్ ల కోసం – రూ. 1,000 కోట్లు
ఏపీఐఐసీకి – రూ. 200 కోట్లు
ఎంఎస్ఎంఈలో మౌలిక వసతులకు – రూ. 60.93 కోట్లు
కడప స్టీల్ ప్లాంట్ కు – రూ. 250 కోట్లు
ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ కు – రూ. 200 కోట్లు
హౌసింగ్, మౌలిక వసతులకు – రూ. 5,661 కోట్లు
అంగన్వాడీల్లో నాడు-నేడు కార్యక్రమాలకు – రూ. 278 కోట్లు
దిశ పథకం – రూ. 33.75 కోట్లు
వైయస్సార్ సంపూర్ణ పోషణ – రూ. 1,556.39 కోట్లు
వైయస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ – రూ. 243.61 కోట్లు
రోడ్లు, భవనాల శాఖకు రూ. 7,594.6 కోట్లు
ఇమాంలు, మౌజాంలకు – రూ. 80 కోట్లు
అర్చకుల ఇన్సెంటివ్ లకు – రూ. 120 కోట్లు
వైయస్సార్ బీమా – రూ. 372.12 కోట్లు
ల్యాండ్ రీసర్వే కోసం – రూ. 40 కోట్లు
మున్సిపల్, పట్టణ అభివృద్ధిశాఖకు – రూ. 8,727 కోట్లు.

ఏపీ వ్యవసాయ బడ్జెట్​.. ప్రధాన అంశాలు!

వ్యవసాయ బడ్జెట్ రూ.68,000 కోట్లు
రైతు భరోసా, పీఎం కిసాన్ కు రూ.17,030 కోట్లు
ధాన్యం కొనుగోళ్లకు రూ.18,343 కోట్లు
ఉచిత విద్యుత్ కు రూ.17,430 కోట్లు

ఏపీ ప్రభుత్వం రూ.2.3 లక్షల కోట్లతో బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. వ్యవసాయ బడ్జెట్ కేటాయింపులను ఆ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అసెంబ్లీలో వెల్లడించారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా వ్యవసాయ బడ్జెట్ ను కేటాయించినట్టు ఆయన చెప్పారు.

వ్యవసాయ బడ్జెట్ లోని ముఖ్యాంశాలు

వ్యసాయ బడ్జెట్ ను వ్యవసాయ శాఖామంత్రి కురసాల కన్నబాబు ప్రవేశ పెట్టారు. మండలిలో వ్యవసాయ బడ్జెట్ ను డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణ దాస్ ప్రవేశ పెట్టారు.

వ్యవసాయ బడ్జెట్ రూ.68,000 కోట్లు
రైతు భరోసా, పీఎం కిసాన్ కోసం రూ.17,030 కోట్లు
సున్నా వడ్డీ పంట రుణాల కోసం రూ.573 కోట్లు
వైఎస్సార్ ఉచిత పంట బీమా కోసం రూ.1,252 కోట్లు
పంట నష్ట పరిహారం కోసం రూ.1,038 కోట్లు
ధాన్యం కొనుగోళ్లకు రూ.18,343 కోట్లు
ఇతర పంట ఉత్పత్తుల కొనుగోళ్లకు రూ.4,761 కోట్లు
ఉచిత విద్యుత్ కోసం రూ.17,430 కోట్లు
విద్యుత్ ఫీడర్ల చానెళ్ల సామర్థ్య పెంపునకు రూ.1,700 కోట్లు
శనగ పంట క్యాష్ సబ్ వెన్షన్ కోసం రూ.300 కోట్లు
సూక్ష్మ సేద్యానికి రూ.1,224 కోట్లు
ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్ ధరను రూపాయిన్నరకే సరఫరా చేయడానికి రూ.1,520 కోట్లు

గత ప్రభుత్వం బకాయిల చెల్లింపుల కోసం రూ.2,771 కోట్లు

వడ్డీలేని రుణాలు, పావలా వడ్డీ రుణాల మాఫీ కోసం రూ.688 కోట్లు
విత్తన బకాయిలు రూ.384 కోట్లు
ధాన్యం కొనుగోళ్ల బకాయిలు రూ.960 కోట్లు
పంటల బీమా బకాయిల కోసం రూ. 716 కోట్లు
రైతుల పరిహారం కోసం రూ.23 కోట్లు

Related posts

మొగల్తూరులో చిరంజీవి ఇంటి వివాదం …!

Drukpadam

శ్రీశైలం వద్ద రోప్ వే… ప్రణాళికలు సిద్ధం చేసిన ఏపీ ప్రభుత్వం!

Drukpadam

మిల్లెట్స్ అందరికీ సరిపడకపోవచ్చు..!

Drukpadam

Leave a Comment