Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

రేణిగుంట విమానాశ్రయానికి బాంబు బెదిరింపు!

  • రెండ్రోజుల క్రితం ఈమెయిల్ ద్వారా బెదిరింపు
  • తాజాగా వెలుగులోకి ఘటన
  • ఈమెయిల్ ఆధారంగా నిందితుల కోసం వేట
  • విమానాశ్రయంలో భద్రత కట్టుదిట్టం

రేణిగుంట విమానాశ్రయానికి బాంబు బెదిరింపు రావడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. రెండ్రోజుల క్రితమే ఈ ఘటన జరగ్గా తాజాగా వెలుగులోకి వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తులు ఈమెయిల్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో తిరుపతి విమానాశ్రయ సీఐఎస్ఎఫ్ క్రైం ఇంటెలిజెన్స్ విభాగం ఎస్సై నాగరాజు ఏర్పేడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈమెయిల్ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు. మరోవైపు, బాంబు బెదిరింపు నేపథ్యంలో విమానాశ్రయంలో భద్రతను మరింత పటిష్ఠం చేశారు.

Related posts

తన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడం పట్ల సాయిపల్లవి స్పందన!

Drukpadam

కేంద్ర ప్రభుత్వ కీలక సమావేశానికి మరోసారి మంత్రి హరీశ్ రావు దూరం

Drukpadam

సీబీఐపై ఝార్ఖండ్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు!

Drukpadam

Leave a Comment