Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

కళ్ళం నుంచే వ్యవసాయశాఖమంత్రితో మాట్లాడిన సీఎల్పీ నేత…

కళ్ళం నుంచే వ్యవసాయశాఖమంత్రితో మాట్లాడిన సీఎల్పీ నేత…
-స్పందించిన వ్యవసాయమంత్రి నిరంజన్ రెడ్డి

-రైతుల సమస్యల పరిష్కారానికి మంత్రి హామీ
-తరుగు తీయవద్దని మంత్రికి చెప్పిన భట్టి

చింతకానీ మండలం తిమ్మినేని పాలెం పొలం గట్టు మీదనుంచి వ్యవసాయశాఖామంత్రి నిరంజన్ రెడ్డితో మాట్లాడిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు. కొన్ని రోజుల తరబడి వడ్లు కొనకుండా, మిల్లులు ఎలాట్ కాకుండా, లారీలు రాకుండా గత కొన్ని రోజులుగా పొలంలో తడుస్తున్న ధాన్యం గురించి వ్యవసాయ శాఖామంత్రికి చెప్పి దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని సూచన. అలాగు తరుగు కూడా 6కిలోల నుంచి 8 కిలోల వరకూ తీస్తున్నారు. అంత మొత్తంలో తరగు తీయకుండా చూడాలని మంత్రికి చెప్పిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. గత కొన్ని రోజులుగా ఎర్రుపాలెం , మధిర, చింతకాని, బోనకల్, ముదిగొండ తదితర మండలాల్లోని పొలాల్లో ఉన్న ధాన్యాన్ని చూసి, సమస్యలన్నీ వెంటనే పరిష్కరించాలని లేకపోతే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదముందని మంత్రి ద్రుష్టికి తీసుకువచ్చి, చర్యలు తీసుకోవాలని కోరిన సీఎల్పీ నేత . ఈ విషయంపై స్పందించిన మంత్రి నిరంజన్ రెడ్డి.. జిల్లా అధికారులతో మాట్లాడి రైతుల సమస్యలు పరిష్కారం కోసం ప్రయత్నిస్తానని సీఎల్పీనేతకు ఆ మేరకు హామీ ఇచ్చారు.

అకాల వర్షాలు, ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందుల గురించి పలు మండలాల్లో పర్యటిస్తున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. ఈ సందర్భంగా చింతకాని మండలంలోని తిమ్మినేని పాళెం, తిరుమలాయపాళెం, జగన్నాథపురం, పందిళ్ల పళ్లి, రామక్రిష్ణాపురం వంటి పలు గ్రామాల్లో ఈ రోజు ఆయన పర్యటించారు. ఈ సందర్బంగా పీపీఎస్ఈ కొ-ఆపరేటివ్ సొసైటీ కింద నాగులవంచ కొనుగోలు కేంద్రానికి మిల్లును అలాట్ చేయలేదని రైతులు తమ గోడును సీఎల్పీ నేత వద్ద వెళ్లబోసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అంబటి వెంకటేశ్వరరావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కన్నెబోయిన గోపి, మండల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొప్పుల గోవింద రావు, పందిళ్లపల్లి ఎంపీటీసీ వీరభద్రం, సొసైటీ డైరెక్టర్లు తూము కోటేశ్వర రావు, రామారావు, మండల కాంగ్రెస్ నాయకులు బసవయ్య, కోరపాటి రాము తదితరుల పాల్గొన్నారు.

Related posts

తొలి రోజే రాష్ట్రప‌తి ఎన్నిక‌కు 11 నామినేష‌న్లు… ఒక నామినేష‌న్ తిర‌స్క‌ర‌ణ‌!

Drukpadam

పదకొండేళ్ల చిన్నారికి ప్రేమ లేఖలు రాసిన టీచర్.. అమెరికాలో ఘటన

Ram Narayana

Why Hasn’t A Woman Run The New York Times Styles Section

Drukpadam

Leave a Comment