Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

టీడీపీ మాక్ అసెంబ్లీ డ్రామా కంపెనీ : మంత్రి పేర్ని నాని ఎద్దేవా !

టీడీపీ మాక్ అసెంబ్లీ డ్రామా కంపెనీ : మంత్రి పేర్ని నాని ఎద్దేవా !
ఏపీ అసెంబ్లీ సమావేశాలను బాయ్ కాట్ చేసిన టీడీపీ
నేడు, రేపు మాక్ అసెంబ్లీ
మహానటులు కనిపించారంటూ పేర్ని నాని వ్యంగ్యం
సురభి డ్రామా కంపెనీని గుర్తుచేసిందని ఎద్దేవా
టీడీపీ అసెంబ్లీ సమావేశాలను వెగ్గొట్టి మాక్ అసెంబ్లీ నిర్వహించడంపై ఏపీ రాష్ట్ర సమాచార శాఖామంత్రి పేర్ని నాని మండి పడ్డారు. టీడీపీ మాక్ అసెంబ్లీ ఒక డ్రామా కంపెనీని తలపింఛందని ఎద్దేవాచేశారు.
ఇవాళ్టి ఏపీ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన టీడీపీ… నేడు, రేపు మాక్ అసెంబ్లీ నిర్వహించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ రవాణా శాఖ మంత్రి పేర్ని నాని విమర్శనాస్త్రాలు సంధించారు. టీడీపీ మాక్ అసెంబ్లీలో మహానటులు కనిపించారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. టీడీపీ మాక్ అసెంబ్లీ సురభి డ్రామా కంపెనీని గుర్తు చేసిందని, వీళ్ల మాక్ అసెంబ్లీని చూసి మరో డ్రామా కంపెనీ వచ్చిందనుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

గ్లోబల్ టెండర్లలో తప్పులుంటే వ్యాక్సిన్ కంపెనీలు చెప్పాలి గానీ… చంద్రబాబు, లోకేశ్ ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని విమర్శించారు. టీకా ఉత్పత్తి కంపెనీల్లో చంద్రబాబుకేమైనా వాటాలున్నాయా? అని ప్రశ్నించారు. ఎంత సేపటికి ప్రభుత్వం చేసే పనులకు అడ్డుపడటం తప్ప వారు చేసింది ఏమిటో చెప్పాలని అన్నారు. జగన్ ప్రభుత్వానికి మంచి పేరు ప్రజలలో రాకూడదనే ఏకైక లక్ష్యంతో పని చేస్తూ అభాసు పాలౌతున్నారని అన్నారు. నిమ్మగడ్డ రేమేష్ ను కొన్ని రోజులు, పోలీస్ అధికారి వెంకటేశ్వర రావు ను కొన్ని రోజులు రఘురామకృషంరాజు ను కొన్ని రోజులు వాడుకొని ప్రభుత్వం మీద లేనిపోని కట్టుకథలు అల్లి పరువు తీసుకుంటున్నారని అన్నారు. ప్రభుత్వం చేసే పనుల్లో అవకతవకలు ఉంటె నిర్దిష్ట ఆరోపణలు చేస్తే ఎవరైనా అర్థం చేసుకుంటారని మేమె కూడా నిజమే కదా వారు చెప్పింది అని అనుకోవటానికి ఆస్కారం ఉంటుందని అన్నారు. ప్రజలకు మేలు చేసినందుకు రాకపోగా
ప్రతి దానికి అడ్డుపడం పనిగా పెట్టుకున్నారని ఇప్పటికే దిగజారిన టీడీపీ మరింత దిగజారడం ఖాయమన్నారు. చంద్రబాబు డ్రామాల పట్ల వారి కార్యకర్తలే విసిగి పోతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా డ్రామాలు ఆపి సద్విమర్శలు పూనుకుంటే ప్రజలకు మేలు జరుగుతుందని హితవు పలికారు.

Related posts

కాంగ్రెస్ వర్గాల్లో కొత్త ఉత్సాహం… కోమటిరెడ్డి నివాసానికి రేవంత్ రెడ్డి!

Drukpadam

ఏపీలో టీడీపీ, వైసీపీలకి మేం దూరం: బీజేపీ నేత సునీల్ దేవధర్!

Drukpadam

మీడియాతో చంద్రబాబు చిట్ చాట్- కీలక వ్యాఖ్యలు…

Drukpadam

Leave a Comment