Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

2023 లో టీఆర్ యస్ అధికారంలోకి రాదా… ?

2023 లో టీఆర్ యస్ అధికారంలోకి రాదా …?
-ఈటల మాటల్లో ఉన్న అంతరార్ధం ఏమిటి ?
– హుజురాబాద్ కు ఎన్నికలు జరగవా ?
-ఎమ్మెల్యే పదవి ని ఈటల వదులుకోరా?
తొందరపడి ఒక కోకిల ముందే కూసింది అన్న చందంగా ఎన్నికలు జరిగి రెండు సంవత్సరాలు కాలేదు. 2023 లో జరిగే శాసనసభ ఎన్నికల్లో టీఆర్ యస్ అధికారంలోకి రాదని హుజురాబాద్ లో జరిగిన మీడియా సమావేశంలో ఈటల వ్యాఖ్యానించారు. మంత్రి గంగుల కమలాకర్ ను ఉద్దేశించి మాట్లాడుతూ 2023 లో నీవు ఉండవు నీ అధికారం ఉండదు బిడ్డా ? జాగ్రత్తగా వళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు అని హెచ్చరించారు. మొదటి సారిగా ఆయన హరీష్ రావు పై కూడా అన్యాపదేశంగా చురకలు అంటించారు. మా ఫ్రెండ్ ను ఇక్కడ ఇంచార్జి గా నియమించినట్లు తెలిసింది. ఆయన మేనేజ్ చేస్తాడంట మంచిది . హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు ప్రలోభాలకు లొంగరు. ఇక్కడ ప్రజలను డబ్బుతో కొనలేరు.గత 20 సంవత్సరాలుగా వారిని గుండెల్లో పెట్టుకొని కాపాడుకున్నా…. ముందు ముందు కూడా ఇదే విధంగా కాపాడుకుంటా…, కొందరిని ప్రలోభ పెట్టవచ్చు వారికీ కూడా తెలుసు ఈటల రాజేందర్ ఎలాంటి వాడు అనేది . అందువల్ల ఎవరు వచ్చినా, ఇక్కడ ప్రజలు లొంగరనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. నాగార్జున సాగర్ లో కొనుగోలు చేసినట్లు హుజారాబాద్ లో ప్రజలను కొనుకోలు చేయటం సాధ్యంకాదు . హుజురాబాద్ లో వారి ప్రలోభాలు ,ప్రయోగాలు పనిచేయవని అంటూనే ఎన్నికలు వచ్చినప్పుడు చూద్దాం …ఆయినా ఎన్నికలు జరిగే ఆవకాశాలే లేవు అని అన్నారు. అంటే ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామాకు సిద్ధంగా లేరని అనుకోవాలా? ఎందుకు ఆలా మాట్లాడారు.అనే సందేహాలు కలుగుతున్నాయి. అసలు రాజకీయంగా ఎలాంటి అడుగులు వేయబోతున్నారు. సీఎల్పీ నేత భట్టిని , టీఆర్ యస్ కు దూరంగా ఉన్న రాజ్యసభ సభ్యులు డి .శ్రీనివాస్ ను కలిసి ఏమి మాట్లాడారు. కొండా విశ్వేశ్వర రెడ్డి బంధుత్వం పేరుతొ కలిశారు. వారు ఎలాంటి సలహాలు ఇచ్చారనే విషయం ఇంకా బయటకు రాలేదు. రాజకీయంగా ఆయన ఎదో ఒక నిర్ణయం తీసుకోవాలి . ఎదో ఒక పార్టీలో చేరడమా? కొత్త సమీకరణలకు నడుం బిగించటమా? దీనిపై ఇంకా క్లారిటీ లేదు.ఒక సందర్భంలో ఈటల ముఖ్యమంత్రి తో రాజీకి ప్రయత్నిస్తున్నారని వార్తలు వచ్చాయి. ముఖ్యమంత్రి కూడా మెత్తపడ్డారని రేపో మాపో వీరివురి మధ్య భేటీ ఉంటుందని ఆ వార్త కథనం సారాంశం కాని అందుకు భిన్నంగా పరిణామాలు వేగంగా మారుతున్నాయి. రెండవసారి హుజురాబాద్ పర్యటన సందర్భంగా ఈటల ఈసారి కొంచం ఆవేశంగా మాట్లాడారు. ఇప్పటి వరకు తన వెంట ఉన్న కొంతమంది తనకు దూరమైయ్యారనే ఆగ్రహం ఆయనలో కనిపించింది. రాజకీయాలు అంటేనే అలానే ఉంటాయనే సత్యాన్ని ఈటలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదను కుంటా? రేపు మరిన్ని ప్రలోభాలకు ఆవకాశం ఉంటుంది.నేటి వరకు నీపక్కన ఉన్నవారు ప్లేటు ఫిరావించవచ్చు. నాయకులను నమ్ముకుంటే ఒక్కక్కసారి లాభంతో పాటు నష్టం ఉంటుంది.ప్రజల విశ్వాసమే ముఖ్యం అందుకు విషయాలను ప్రజలకు వివరించేందుకు నిరంతరం వారిమధ్య ఉండాలి . ఎక్కడో హైద్రాబాద్ లో ఉండాలి అప్పుడప్పుడు వచ్చి పొతే ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లి నష్టం జరుగుతుంది. గంగుల కమలాకర్ అధికారం ఏమో గాని నీ ఎమ్మెల్యే సీటు లేకుండా అవుతుంది.2023 సంగతి అటుంచితే నీమీద వచ్చిన ఆరోపణలు అబద్ధాలని ప్రజలు నమ్మాలి అందుకు ప్రభుత్వం పైన యుద్ధం చేయటంతో పాటు యుద్ధభూమిలో గెలుపుకు కావాల్సిన ప్రణాళికలు రూపొందించుకోవాలి . ప్రభుత్వం ,పార్టీ యంత్రాంగాన్ని ఎదుర్కోవాలి ? సీఎం కేసీఆర్ రాజకీయ చాణిక్యుడుగా పేరున్నవాడు ప్రస్తుత రాజకీయనాయకుల్లో అత్యంత సమర్ధుడైన నాయకుడు . ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు . కీలు విరిగి వాతపెట్టడం తెలిసిన వాడు . ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత ఉన్నా ప్రతిపక్షాలు రాష్ట్రంలో బలంగా లేవు . ఎవరి భాదలు ఎవరికీ ఉన్నాయి. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిని అందరి సమ్మతితో నిరణయించుకోలేని పరిస్థితి ఉంది. బీజేపీ లో అంతర్గత విభేదాలు ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి. వామపక్షాలు కేసీఆర్ కు దగ్గర అయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయి. అన్ని పక్షాలను కేసీఆర్ మేనేజ్ చేస్తున్నారని వైయస్ షర్మిల కూడా విమర్శించారు. అందువల్ల ఈటల అన్నంత తేలికగా 2023 ఎన్నికల్లో ఉంటుందో లేదో చూడాలి మరి !

Related posts

భారతిరెడ్డి పీఏ తన సంతకాన్ని ఫోర్జరీ చేశాడని వంగలపూడి అనిత తీవ్ర ఆరోపణ..

Drukpadam

బీజేపీకి భ‌య‌ప‌డే ప్ర‌స‌క్తే లేదు: రాహుల్ గాంధీ!

Drukpadam

ముగిసిన బెంగాల్ ఎన్నికలు … చివర విడతలోనూ 76 ,07 శాతం పోలింగ్

Drukpadam

Leave a Comment