Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కరోనా కట్టడి పై ముఖ్యమంత్రి ద్రుష్టి : నేడు వరంగల్ పర్యటన…

కరోనా కట్టడి పై ముఖ్యమంత్రి ద్రుష్టి : నేడు వరంగల్ పర్యటన…
– వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిని సందర్శించనున్న కేసీఆర్
-ఉదయం 11 గంటలకు హెలికాప్టర్‌లో వరంగల్‌కు
-11.45 గంటలకు వరంగల్ సెంట్రల్ జైలు సందర్శన
-2 గంటలకు ఎంజీఎంకు
-అనంతరం అధికారులు, మంత్రులతో సమీక్ష సమావేశం
-4 గంటలకు తిరిగి హైదరాబాద్‌కు
ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా కట్టడంపై ద్రుష్టి సారించారు. అందులో భాగంగానే ఆయన వరంగల్ పర్యటన చేస్తున్నారు. వైద్య ఆరోగ్యశాఖ ను కూడా చూస్తున్న కేసీఆర్ కరోనా మహమ్మారిని ఎదుర్కోవటంతో పాటు రాష్ట్రంలో వ్యాక్సిన్ కార్యక్రమాన్ని వేగంగా చేయాలనే ఆలోచనలో ఉన్నారు. అందుకోసం ఉన్నతస్థాయి సమావేశం సైతం నిర్వయించారు. ఇటీవల గాంధీ ఆసుపత్రిని సందర్శించి కరోనా రోగులతో ముచ్చటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు వరంగల్ ఎంజీఎంను సందర్శించనున్నారు. ఉదయం 11 గంటలకు హెలికాప్టర్‌లో హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలకు చేరుకుంటారు. అక్కడి నుంచి ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంటికి వెళ్తారు. అనంతరం 11.45 గంటలకు వరంగల్ సెంట్రల్ జైలును సందర్శించి దానిని ఆసుపత్రిగా మార్చేందుకు తగిన ఆదేశాలు ఇస్తారు.

మధ్యాహ్న భోజనం అనంతరం 2 గంటలకు ఎంజీఎంను సందర్శించి ఆసుపత్రిలోని సౌకర్యాలను పరిశీలిస్తారు. రోగులతో మాట్లాడతారు. ఆ తర్వాత మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, జిల్లా ప్రజాప్రతినిధులు, కలెక్టర్, పోలీస్ కమిషనర్, వైద్యాధికారులు, ఆసుపత్రి సూపరింటెండెంట్ తదితరులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించి సాయంత్రం 4 గంటలకు తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. కాగా, నేడు ప్రపంచ సాంస్కృతిక దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.

Related posts

మళ్లీ మనసు మార్చుకున్న సినీ నటి దివ్యవాణి.. టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటన!

Drukpadam

అజిత్​ పవార్​ తో ప్రభుత్వ ఏర్పాటు పెద్ద పొరపాటే: మహారాష్ట్ర మాజీ సీఎం ఫడ్నవీస్​!

Drukpadam

సందేహాలు మిగుల్చుతున్న సర్వే రిపోర్టులు !

Drukpadam

Leave a Comment