సొంత పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి పెద్దిరెడ్డి
- ఇంటింటికీ తిరిగి ఓట్లు అడిగి గెలిచుంటే ఆ విలువ తెలిసుండేది
- నా పేరుపై గెలిచి.. ఇంట్లో కూర్చున్నారు
- ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదు
తన సొంత నియోజకవర్గం పుంగనూరు వైసీపీ నేతలపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు ఆయన తన నియోజకవర్గంలో కరోనా రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి వైద్య సదుపాయాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇంటింటికీ తిరిగి ఓట్లు అడిగి గెలిచుంటే ప్రజాప్రతినిధులకు ఆ విలువ తెలిసేదని అన్నారు. ప్రజలకు సేవ చేయాలనే ధ్యాస ఒక్కరికి కూడా లేదని మండిపడ్డారు. తన పేరుపై గెలిచిన వారందరూ ఇళ్లలో కూర్చొని, ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అందరూ మారాలని… అధికారులకు సహకరిస్తూ, ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. మరోవైపు, పెద్దిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయడం ఇప్పుడు వైసీపీలో చర్చనీయాంశంగా మారింది.