ఆంధ్రప్రదేశ్

మామిడిపళ్ల కోసం లండన్‌ నగరంలో తన్నుకున్న జనం…!

  • లండన్‌లో మామిడి పండ్ల కోసం తన్నుకున్న జనం 
  • చేతికందిన వస్తువులతో దాడికి యత్నం
  • నెట్టింట వీడియో వైరల్
  • లండన్‌లో ఇలాంటి ఘటనలా అంటూ ఆశ్చర్యపోతున్న నెటిజన్లు

మామిడిపండ్లు ఇష్టపడని వారు వుండరు. ఎంత రేటైనా సరే కొనుక్కుని సీజన్ లో వాటిని ఓ పట్టుపడతారు. అయితే, ఇలాంటి మామిడి పండ్ల కోసం తన్నుకున్న సంఘటన ఒకటి తాజాగా చోటుచేసుకుంది. పైగా ఇది లండన్ మహానగరంలో జరగడం ఇక్కడ విశేషం! దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. 

ఈ వీడియోలో కొందరు మామిడి పళ్లు చేజిక్కించుకునే ప్రయత్నంలో ఒకరిపై మరొకరు దాడికి దిగారు. చేతికి అందిన వస్తువులతో కొట్టుకునే ప్రయత్నం చేశారు. ఓ మహిళ కూడా తగ్గేదేలేదంటూ ఈ గొడవలోకి దిగింది. అవతలి వ్యక్తిని అమాంతం తోసేసింది. గొడవ జరుగుతున్న ప్రాంతంలో నేల తడిగా ఉండటంతో కొందరు జారి పడ్డారు కూడా. 

నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసి నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు. లండన్‌లో ఇది జరిగిందని తెలిసి మరింత ఆశ్చర్యానికి లోనవుతున్నారు. ‘‘మామిడి పళ్ల కోసం ఇంతగా తన్నుకుంటున్నారంటే ఆ మహానగరాన్ని దేవుడే కాపాడాలి’’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Related posts

ఎన్వీ రమణను కలిసి కృతజ్ఞతలు తెలిపిన జర్నలిస్ట్ సంఘాల నేతలు!

Drukpadam

పురిటి నొప్పులతో విలవిల్లాడిన గర్భిణి.. టెర్రస్‌పై విందు చేసుకున్న వైద్యులు!

Drukpadam

ఢిల్లీ యూనివర్సిటీ కీలక నిర్ణయం.. ‘సారే జ‌హా సె అచ్చా’ పాట రాసిన కవి చాప్ట‌ర్‌ తొలగింపు!

Drukpadam