Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

ఏ ముఖ్యమంత్రీ చేయని సాహసం చేసిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య.. 

ఏ ముఖ్యమంత్రీ చేయని సాహసం చేసిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య.. 

  • విధానసభలోని పశ్చిమ ద్వారాన్ని తెరిపించిన సిద్ధరామయ్య
  • 1998 ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆ తలుపులకు తాళం వేయించిన అప్పటి సీఎం జేహెచ్  పటేల్
  •  వాస్తుదోషం కారణంగానే మూత
  • మూఢనమ్మకాలను పాతిపెట్టేశారంటూ ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సాహసం చేశారు. వాస్తు దోషం కారణంతో ఎప్పుడో కొన్ని సంవత్సరాల పాటు మూసేసిన విధాన సభలోని తన చాంబర్ పశ్చిమ ద్వారాన్ని తెరిపించారు. సామాజిక మాధ్యమాల్లో ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఆ ద్వారాన్ని ఎందుకు మూసివేశారని అక్కడి అధికారులను సిద్ధరామయ్య ప్రశ్నించారు. వాస్తు దోషం కారణంగా చాలా ఏళ్ల క్రితమే ఆ తలుపులు మూసేసినట్టు సీఎంకు చెప్పారు. దీంతో దానిని తెరవాలని ఆదేశించారు. తలుపులు తెరుచుకున్నాక ఆ ద్వారం గుండానే సీఎం తన చాంబర్‌లోకి ప్రవేశించారు. ఈ వీడియోను చూసిన వారు సిద్ధరామయ్యపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మూఢనమ్మకాలను సీఎం పాతిపెట్టేశారని కొందరు అంటే.. సిద్ధరామయ్య సమస్యల్లో చిక్కుకోవడం ఖాయమని మరికొందరు చెబుతున్నారు.

ఆ గేటును ఎవరు మూసేశారంటే?
విధానసౌధలోని ఈ తలుపులను 1998లో అప్పటి ముఖ్యమంత్రి జేహెచ్ పటేల్ మూసివేయించారు. ఆ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పరాజయానికి కారణం ఈ ద్వారమేనని భావించి తాళాలు వేయించారు. 2013లో సిద్ధరామయ్య ముఖ్యమంత్రి అయ్యాక ఆ తలుపులు తెరిపించారు. అయితే, ఆ తర్వాత 15 ఏళ్లలో ఆరుగురు ముఖ్యమంత్రులుగా పనిచేసినా ఎవరూ ఆ తలుపులు తెరిచే ప్రయత్నం చేయలేదు. బీజేపీ హయాంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన బీఎస్ యడియూరప్ప, బసవరాజు బొమ్మై, జేడీఎస్ నేత హెచ్‌డీ కుమారస్వామి ఎవరూ కూడా ఆ తలుపులు తెరిపించే సాహసం చేయలేకపోయారు. కానీ, సిద్ధరామయ్య మాత్రం ఆ తలుపులు తెరిపించి తన చాంబర్‌లోకి ఎంట్రీ ఇచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు.

Related posts

మోదీ కేబినెట్లో 20 మంది సీనియర్లకు ఉద్వాసన.. ఎందుకంటే!?

Drukpadam

వచ్చే జనవరిలో వందే సాధారణ్ రైళ్లు.. ప్రత్యేకత ఏంటంటే..!

Ram Narayana

ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్… 18 మంది మావోల మృతి…

Ram Narayana

Leave a Comment