Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలు

బ్లాక్ , ఫంగస్ ,వైట్ ఫంగస్ ఏది డేంజర్ ….

బ్లాక్ , ఫంగస్ ,వైట్ ఫంగస్ ఏది డేంజర్ ….
-వైట్ ఫంగస్ ఉందని ప్రచారం జరుగుతున్న ఎక్కడ నిర్దారణ కాలేదు
-రోగనిరోధక శక్తి లేని కరోనా రోగులని ప్రభావితం చేసే శక్తి వైట్ ఫంగస్ కు ఉంది
-ఉత్తరప్రదేశ్ లో ఒక కేసు వచ్చిందనని అంటున్నారు
-అనేక రకాల ఫంగస్ లు ఉన్నా వాటికీ వైద్యం అందుబాటులో ఉంది.
-ఫంగస్ లకు పెద్దగా భయపడాల్సిన అవసరంలేదు
కరోనా వైరస్ తర్వాత కొత్తగా వినబడుతున్న మాట బ్లాక్ ఫంగస్ (ముకోర్మైకోసిస్). వివిధ రాష్ట్రాలలో ఇప్పుడిప్పుడే ఈ కేసులు పెరుగుతున్నాయి. తక్కువ సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. ఇదిలా ఉంటే మళ్లీ ఇప్పడు వైట్ ఫంగస్ అని వినబడుతుంది. దీంతో ప్రజలు చాలా అయోమయంలో ఉన్నారు. అయితే ప్రధానంగా రోగనిరోధక శక్తి లేని కోవిడ్ -19 రోగులను ప్రభావితం చేసే వ్యాధి వైట్ ఫంగస్ అని తేలింది. అయితే నిపుణులు “వైట్ ఫంగస్” వంటి వ్యాధి లేదని చెబుతున్నారు. దానిని కాన్డిడియాసిస్ అంటున్నారు. వైట్ ఫంగస్ మొదటి నివేదికలు బీహార్లోని పాట్నా నుంచి వచ్చాయి. అయితే ప్రభుత్వం నిర్వహిస్తున్న పాట్నా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (పిఎంసిహెచ్) ఈ నివేదికలను తోసిపుచ్చింది. తాజాగా ఉత్తర ప్రదేశ్‌లో వైట్ ఫంగస్ అని పిలవబడే ఓ కేసు కనుగొనబడింది.

వైట్ ఫంగస్ కేవలం ఒక అపోహ మాత్రమే అంటున్నారు. ఇది ప్రాథమికంగా కాన్డిడియాసిస్ అనే ఫంగస్ వల్ల కలిగే ఫంగల్ ఇన్ఫెక్షన్ మాత్రమే అని నిపుణులు వాదిస్తున్నారు. ఇది సర్వసాధారణమైన ఫంగల్ ఇన్ఫెక్షన్ అని అంటు వ్యాధుల నిపుణుడు డాక్టర్ ఈశ్వర్ గిలాడా పేర్కొన్నారు. బ్లాక్ ఫంగస్ కంటే “వైట్ ఫంగస్” చాలా ప్రమాదకరమని నివేదికలకు ఎటువంటి ఆధారం లేదని కొట్టిపారేసారు. బ్లాక్ ఫంగస్ రోగులకు చికిత్స చేస్తున్న బొంబాయి ఆసుపత్రిలోని పల్మోనాలజిస్ట్ డాక్టర్ కపిల్ సాల్జియా మాట్లాడుతూ.. ముకోర్మైకోసిస్ మరింత ఇన్వాసివ్, సైనసెస్, కళ్ళు, మెదడుకు చాలా నష్టం కలిగిస్తుందని అన్నారు. విస్తృతమైన శస్త్రచికిత్స అవసరమని చెబుతున్నారు.

ముకోర్మైకోసిస్ మరింత ప్రమాదకరమైనది ఎందుకంటే ఇది సాధారణంగా మానవ వ్యవస్థలో కనిపించదు. కానీ కాండిడియాసిస్ సులభంగా నిర్ధారణ అవుతుంది. అంతేకాకుండా సులభంగా చికిత్స చేయొచ్చు. ఇది ప్రాణాంతకం కాదు. మీరు చికిత్స లేదా లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే అప్పుడు హానికరంగా మారుతుందని డాక్టర్ కపిల్ సాల్జియా చెప్పారు. బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారు, డయాబెటిస్‌తో బాధపడుతున్నవారు , కోవిడ్ -19 చికిత్స సమయంలో చాలా కాలం పాటు స్టెరాయిడ్స్ వాడినవారు కాన్డిడియాసిస్‌కు గురవుతారని తెలిపారు.

సర్వసాధారణమైన కాన్డిడియాసిస్ ఇన్ఫెక్షన్ ఓరల్ థ్రష్ అని నిపుణులు తెలిపారు. “ఈ ఇన్ఫెక్షన్ సాధారణంగా సన్నని లైనింగ్, పెదవులు, ముక్కు, నోటి లోపల, జననేంద్రియ ప్రాంతం వంటి శ్లేష్మ జంక్షన్లు ఉన్న శరీర భాగాలను ప్రభావితం చేస్తుంది” అని డాక్టర్ గిలాడా తెలిపారు. తలనొప్పి, ముఖం ఒక వైపు నొప్పి, వాపు, దృష్టి కోల్పోవడం లేదా దృష్టి తగ్గడం, నోటిలో పుండు వంటివి గమనించాల్సిన లక్షణాలు. సంక్రమణను గుర్తించడానికి 10 శాతం KOH (పొటాషియం హైడ్రాక్సైడ్) లోపు సాధారణ మైక్రోస్కోపిక్ పరీక్ష చేయవచ్చని డాక్టర్ గిలాడా తెలిపారు.

Related posts

కోట్లు ఖర్చు చేసి కొవిడ్ కోచ్‌లుగా మార్చితే ఒక్కరూ ఎక్కని వైనం!

Drukpadam

కరోనా కేసులు పెరుగుతున్న వేళ.. ఈ గ్యాడ్జెట్లు దగ్గర ఉంచుకుంటే ప్రయోజనమే!

Drukpadam

చైనా నుంచి తెలంగాణ‌కు 200 ఆక్సిజ‌న్ కాన్స‌న్‌ట్రేట‌ర్లు..

Drukpadam

Leave a Comment