Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఫ్రాన్స్ జాతీయ దినోత్సవానికి గౌరవ అతిథిగా ప్రధాని మోదీ…

ఫ్రాన్స్ జాతీయ దినోత్సవానికి గౌరవ అతిథిగా ప్రధాని మోదీ…

  • జులై 14న ఫ్రాన్స్ జాతీయ దినోత్సవం
  • పారిస్ లో బాస్టిల్ డే ఉత్సవాలు
  • ప్రధాని మోదీని ఆహ్వానించిన ఫ్రాన్స్ దేశాధ్యక్షుడు మేక్రాన్
  • ఈ ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా భారత రాఫెల్ యుద్ధ విమానాలు

ప్రతి ఏడాది జులై 14వ తేదీన ఫ్రాన్స్ జాతీయ దినోత్సవం నిర్వహిస్తారు. కాగా, ఈ ఏడాది ఫ్రాన్స్ జాతీయ దినోత్సవానికి గౌరవ అతిథిగా భారత ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. ఫ్రాన్స్ దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ ఆహ్వానాన్ని మన్నించి మోదీ ఈ కార్యక్రమం కోసం ఫ్రాన్స్ వెళ్లనున్నారు.

ఫ్రాన్స్ నేషనల్ డే సందర్భంగా పారిస్ లోని చాంప్స్ ఎలిసిస్ లో బాస్టిల్ డే ఫ్లై పాస్ట్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భారత్ కు చెందిన 3 రాఫెల్ యుద్ధ విమానాలు కూడా పాల్గొంటుండడం విశేషం.

రాఫెల్ యుద్ధ విమానాలను భారత్… ఫ్రాన్స్ నుంచే కొనుగోలు చేసింది. ఫ్రాన్స్ జాతీయ దినోత్సవం సందర్భంగా జరిగే సైనిక కవాతులో ఈ మూడు రాఫెల్ యుద్ధ విమానాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.

Related posts

ముందస్తు బెయిల్ పిటిషన్ పై వాదనలు వినిపించిన అవినాశ్ రెడ్డి న్యాయవాది…

Drukpadam

ర‌ష్యా దూకుడు.. 36 దేశాల విమానాల‌పై నిషేధం!

Drukpadam

ఢిల్లీ పెద్దల ఆదేశాలతోనే ఐటీ దాడులు.. మర్రి రాజశేఖర్ రెడ్డి ఆరోపణలు!

Drukpadam

Leave a Comment