Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఆనందయ్య మందుకి ల్యాబ్‌లో షాకింగ్ రిపోర్ట్.! అన్నీ శాస్త్రయమే ఆయుష్ కమిషనర్ కీలక వ్యాఖ్యలు

  • మందు తయరీ పదార్థాల పరిశీలన
  • ల్యాబ్ రిపోర్ట్ సానుకూలంగానే..
  • కమిషనర్ రాములు కామెంట్స్

ఆనందయ్య మందుపై అధ్యయనం చేస్తున్న ఆయుష్ శాఖ కమిషనర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మందు తయారీకి వినియోగిస్తున్న పదార్థాలకు సంబంధించి ల్యాబ్ రిపోర్ట్ పాజిటివ్‌గానే వచ్చిందని చెప్పారు.

ఆనందయ్య కరోనా మందుపై ఎడతెగని ఉత్కంఠ నెలకొంది. శాస్త్రీయ అధ్యయనం జరగాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం మందును అధ్యయనం చేయాలని ఆయుష్, ఐసీఎంఆర్‌ను ఆదేశించిన విషయం తెలిసిందే. ఆనందయ్య ఆయుర్వేద మందును పరిశీలించిన ఆయుష్ ల్యాబ్‌‌లో ఆసక్తికర విషయాలు వెల్లడైనట్లు తెలుస్తోంది. మందు తయారీ విధానంలో వినియోగించిన పదార్థాలన్నీ శాస్త్రీయంగానే ఉన్నాయని.. తయారీ పదార్థాలపై ల్యాబ్ రిపోర్ట్ పాజిటివ్‌గానే వచ్చినట్లు ఆయుష్ కమిషనర్ రాములు ఓ చానల్ ఇంటర్వ్యూలో చెప్పారు.

అయితే ఆనందయ్య మందు తయారు చేసే విధానాన్ని పరిశీలించనున్నట్లు రాములు చెప్పారు. శుక్రవారం మందు తయారీలో సాయపడుతున్న ఆనందయ్య అనుచరులను అడిగి కొన్ని వివరాలు సేకరించినట్లు చెప్పారు. ఆనందయ్య మందు తయారు చేస్తున్న విధానాన్ని దగ్గరుండి పరిశీలిస్తామన్నారు. అలాగే ఇప్పటి వరకూ ఆనందయ్య మందు తీసుకున్న వారి అభిప్రాయాలను కూడా సేకరిస్తామని రాములు తెలిపారు.

ఐసీఎంఆర్ కూడా మందుపై అధ్యయనం చేస్తున్నందున వారి సహకారం కూడా తీసుకుంటామని రాములు చెప్పారు. ఆనందయ్య మందు తయారీ విధానం.. అనంతరం మందుపై అధ్యయనానికి సుమారు వారం నుంచి పది రోజుల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మందుపై శాస్త్రీయ అధ్యయనం పూర్తయి.. నివేదిక వచ్చే వరకూ పంపిణీకి అవకాశం లేదని.. అప్పటి వరకూ బాధితులెవరూ కృష్ణపట్నం రావొద్దని నెల్లూరు జిల్లా అధికారులు సూచిస్తున్నారు

Related posts

వైసీపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఖర్చు రూ. 328 కోట్లు!

Ram Narayana

సాయిధరమ్ తేజ్ ప్రమాదం… మీడియా స్పందించినతీరు పై తీవ్ర అభ్యంతరాలు!

Drukpadam

మళ్లీ ఎన్నికల నగారా మోగనున్నదా?

Drukpadam

Leave a Comment