Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

సామాన్యుడి ఆవేదన …..

సామాన్యుడి ఆవేదన …..
– అధికారులకు నాయకులకు నాదొక విన్నపం..
ఇమంది ఉదయ్ కుమార్ ,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:తెలంగాణ
సామజిక కార్యకర్త
ఆయన కుటుంబం కరోనా మహమ్మారితో ఐదుగురిని కోల్పోయింది…. వారి ప్రాణాలు కాపాడుకునేందుకు ఆయన పడ్డ కష్టాలు వర్ణనాతీతం …. స్వయంగా ఆయన అనుభవించిన అనేక బాధలకు ప్రతిరూపమే ఈ ఆవేదన ….. ఆయన రాసిన  విజ్ఞప్తిని యధాతధంగా ఇస్తున్నాం …… ఎడిటర్ దృక్పధం ……..

కరోనా మొదటి దశ నుంచి నేటి వరకు నా తండ్రి బాబాయి, బావ, అత్తగారు, పిన్ని ఇలా సొంత వారు ఎంతో మంది ఆప్తులు స్నేహితులు ఎంతో మంది కరోనా బారినపడి చనిపోయారు. నాన్న గారు చనిపోయినప్పటికి నేటికీ పరిస్థితిలో చాలా మార్పు వచ్చింది.
ఏ మందులు వాడాలో ఏది మంచో ఏది చెడో తెలియకుండా డాక్టర్లు, ప్రభుత్వాలు చెప్పినట్లు మందులు వాడుతున్నాము. మాస్కో నుంచి వెంటిలేటర్ వరకు కరోనా రాపిడ్ టెస్ట్ నుండి వ్యాక్సిన్ వరకు విటమిన్ టాబ్లెట్ నుంచి రెమీ డెసివర్ వరకు అన్ని రకాల మందులు పద్ధతులు వాడుతూ పాటిస్తున్నాము. కరోనా నుంచి బయటపడితే నేడు బ్లాక్ ఫంగస్ వైట్ ఫంగస్ అంటూ కొత్త జబ్బులతో అల్లాడుతున్నారు. నాన్న చనిపోయినప్పుడు అందుబాటులో లేని వైద్యం ప్రభుత్వాలు ప్రైవేటు ఆసుపత్రులకు కరోనా అనుమతులు ఇచ్చాయి. కానీ అత్తయ్య ఆసుపత్రిలో చేరేసరికి అందుబాటులో రెమీ డెసివర్ ఇంజెక్షన్లు అందుబాటులో లేవు. మూడు ఇంజక్షన్లు దొరికాయి ఒకటి ముప్పై ఐదు వేలు చొప్పున లక్ష ఐదు వేలకు మూడు ఇంజక్షన్ల కొనుగోలు చేసి ఉంచుకున్నాను. మొత్తం ఆరు మిగతావి దొరకక చేసేదిలేక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకు వెళ్ళాను. ఆక్సిజన్, వెంటిలేటర్లు ఉన్నాయని సంబరపడ్డాను. అక్కడ సైతం వార్డు బాయ్ నుండి డాక్టర్ల దాకా అందరూ ఎంతో కష్టపడి పని చేస్తున్నారు. తీరం తెలియని ప్రయాణం కొనసాగిస్తున్నారు. వారం రోజులు గడిచాయి.రోజుకి ముగ్గురు నలుగురు చొప్పున పక్కన ఉన్నటువంటి బాధితులు చనిపోతూనే ఉన్నారు. స్థల మార్పిడి జరిగితే బాగుంటుందని మరల ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకు వచ్చాము. అక్కడ ఆక్సిజన్ ఉన్నాగాని పట్టించుకునే వారు తక్కువ . ఇంజెక్షన్లు ఆక్సిజన్ మీదే కదా ఆమె వైద్యం అనుకొని మరో నాలుగు రోజుల అనంతరం డిశ్చార్జ్ చేయించుకుని ఇంటికి తీసుకొచ్చి మందు ఇస్తే బాగుంటుంది అని ఆలోచించాను. కానీ ఆక్సిజన్ కొరత ఎలా తీర్చాలో అర్థం కాక దాదాపు రెండు లక్షల రూపాయలు పెట్టి ఆక్సిజన్ కాన్సెంట్రేటర్ తెప్పించాను. రెండు గంటల్లో దాన్ని అమర్చుకొని ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్న తరుణంలో మా అత్తగారు అకస్మాత్తుగా చనిపోయారు. అత్తగారు ఆస్పత్రిలో చేరిందని తెలిసిన వెంటనే మా చెల్లెలు మా పిన్నిని తీసుకువెళ్లి వ్యాక్సిన్ మొదటి డోసు వేయించింది. వేసుకున్న రెండు రోజులు స్వల్ప జ్వరం తలనొప్పి లాంటి దుష్ప్రభావం చూపించింది. అందరికీ అలాగే ఉంటుంది కదా అని అనుకుంటూ ఉన్నాము. ఇంతలో మరో మూడు రోజులలో ఆసుపత్రిలో చేర్చాల్సి వచ్చింది ఆక్సిజన్ అందక నానా ఇబ్బందులు పడుతూ వారం రోజుల అనంతరం తను చని పోయింది.

ప్రభుత్వాలు మొదట్లో పారాసెట్మాల్ టాబ్లెట్ బ్లీచింగ్ పౌడర్లతో తగ్గిపోతుందని తేలికగా తీసుకున్నారు, అనంతరం హైడ్రోక్లోరిక్ ఎం పిచికారి అన్నారు అనంతరం అనేక రకాల విటమిన్ టాబ్లెట్లు పోషకాహారాలు తీసుకోవాలన్నారు, మాస్కు, శానిటైజేషన్, సోషల్ డిస్టెన్స్ సరిపోతుందని ఈ నియమాలు పాటించాలని అన్నారు. కరోనా వచ్చిన వారితో పాటు రాని వారు సైతం హోమ్ క్వారంటైన్ లో ఉండాలని, తరువాత కరోనా వచ్చి తగ్గిన వారి రక్తంలో ప్లాస్మాను సేకరించి కరోనా పేషెంట్లకు ఇస్తే తగ్గిపోతుందని ప్లాస్మా దాతలను ప్రోత్సహించారు. ఎట్లా ప్రభుత్వం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ద్వారా వచ్చిన సూచనలు అన్ని ప్రజలతో పాటించేట్లుగా చేశాయి. కానీ నేడు అన్ని శూన్యంగా మారాయి జనం చస్తూ బతుకుతున్నారు. ప్రభుత్వాలు నాయకులు అధికారులు ఎంతో కష్టపడి వైద్యుల సహకారంతో ప్రజల ప్రాణాలు కాపాడేందుకు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో తమ వారి ప్రాణాలు కాపాడుకునేందుకు ఎవరూ ఖర్చుకు వెనకాడకుండా ఉన్నదంతా తెగ నమ్ముకొని అయినా బతికించుకుందాం అని ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఎంత ఖర్చు చేసిన మనుషులు దక్కని పరిస్థితుల్లో ఉన్నాము.

 

దయచేసి మీకందరికీ పాదాభివందనం చేసి చేతులెత్తి నమస్కరిస్తున్నా…

 

ఇప్పుడు ఎవరు మాట్లాడినా ఎవరిని కదిలించినా ఒకటే చర్చ జరుగుతోంది. అది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం లో ఆనందయ్య అనే అతను ఆయుర్వేద మందులు ఇస్తున్నారు బాగా పనిచేస్తుందని.
కరోనా కి ఆయుర్వేద మందు బాగా పనిచేస్తుందట అది వేసుకుంటే గంటల వ్యాధులు అనే ఆక్సిడెంట్ లెవెల్స్ పెరుగుతాయి. కరోనా కూడా రెండు రోజుల్లో మాయం అయిపోతుంది అని విపరీతంగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతుంది . చాలామంది తెలిసిన వారి వద్ద నుంచి వివరాలు తెలుసుకున్నాను. కానీ జిల్లా కలెక్టర్ స్వయంగా డాక్టర్లను తీసుకెళ్లి పరిశీలించి లోకాయుక్తకు నివేదిక అందజేసిన అనంతరం నమ్మకం కుదిరింది. కలెక్టర్ నివేదిక కావచ్చు వైఎస్సార్సీపీ నాయకుల నమ్మకం కావచ్చు లేదా ఆయుర్వేద వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం ఏదేమైనా గాని ఆనందయ్య ఇచ్చే కరోనా మందు పేరేదైనా గాని అది ఆయుర్వేదం లేదా మూలికల పసరు మందు కావచ్చు. కరోనా కష్టకాలంలో హనుమంతుడు తెచ్చిన సంజీవనిలా ఆనందయ్య ఇచ్చే మందు పై నమ్మకంతో జనం వేలాదిగా తరలి వెళ్లి గుళికలను సేవించి బాగు పడ్డామని చెబుతున్నారు. మనం కూడా నమ్మకూడదా..నమ్మితే పోయేదేముంది నష్టమేమీ లేదు కదా..
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పినట్లు మన ప్రభుత్వాలు హైడ్రోక్లోరోక్వీన్ విటమిన్ మందులు అని చెప్పారు. నమ్మాము. అనంతరం కరోనా వచ్చిన వారి రక్తం ప్లాస్మాతో తగ్గించవచ్చునని చెప్పారు అది నమ్మాము.అనేక ఇంజెక్షన్లు వ్యాక్సిన్లు, ఆవిరి పట్టడము , ఇలా ఎన్నో రకాల పద్ధతులు సూచనలు పాటిస్తూనే ఉన్నాము. మందులు ఒకటే కాదు మీరు ధైర్యంగా ఉండాలి మీ ధైర్యం మిమ్మల్ని కాపాడుతుంది అని డాక్టర్లు చెప్పారు అది కూడా అది కూడా నమ్మాము. ప్రస్తుత తరుణంలో ప్రజలందరికీ కావాల్సింది నమ్మకం . అన్ని రకాల పద్ధతులు వాడాక ఇప్పుడు జనం ఆనందయ్య మందును నమ్ముతున్నారు. ఇప్పటిదాకా ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లు నమ్ముతూనే ఉన్నారు. అయినా కానీ ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. కరోనా కేసులు చావుల లెక్కలు తక్కువచేసి బయటి ప్రపంచానికి తెలియకుండా దాచిన అంతమాత్రాన ప్రజలకు తెలియదా తమ వారిని ఎంతమందిని కోల్పోతున్నామని. నాయకుల మొదలు కార్యకర్త వరకు స్వీపర్ల మొదలు డాక్టర్ల వరకు రెవెన్యూ, పోలీసు, శానిటేషన్, వైద్యులు జర్నలిస్టులు అందరూ ప్రాణాలకోర్చి శ్రమిస్తున్నారు. ప్రజల ప్రాణాలు కాపాడడానికి వీరంతా దేవుళ్లు కాదు కదా. కానీ దేవుని రూపంలో ప్రజలకు సేవ చేస్తున్నారు దానికి అందర్నీ తప్పక అభినందించాల్సిందే. కానీ ఇప్పుడు ప్రజలకు కావాల్సింది ధైర్యం, తగ్గుతుందనే నమ్మకం, మందులు వాడవచ్చు ఏమీ కాదని చెప్పే భరోసా ఇప్పుడు అందరి నమ్మకం ఆనందయ్య నందు మీదే అందుకే ఆనందయ్య మందును ఆదరిద్దాం..

అసలు ఆనందయ్య మందులో ఏముంది ..

ఆనందయ్య వాడే మందులు మనం నిత్యం ఆయుర్వేదం పసరు వైద్యం హోమియో వైద్యం ఇలా అనేక రకాలుగా పిలుచుకునే ఇంటి వైద్యం లాంటి వాటికి సంబంధించిన వస్తువులు పదార్థాలు ఉంటాయి. వీటిలో ముఖ్యంగా అల్లం, తాటి బెల్లం , తేనే, నల్ల జీలకర్ర, తోక మిరియాలు, పట్టా, లవంగాలు, వేప ఆకులు, నేరేడు మరియు మామిడి చిగురులు, నేలఉసిరి, కొండపల్లేరు, బుడ్డ బుడస ఆకులు, పిప్పిoట ఆకులు, తెల్ల జిల్లేడు పూలమొగ్గలు, ముళ్ళ వంకాయలు మొదలగు పదార్థాలతో చిగుళ్ళతో మూలికలతో కలగలిపి మందు గుళికలు తయారుచేసి ప్రజలకు ఇస్తున్నారు. దుష్ప్రభావాలు లేని ఇంటి వైద్యం లాంటి ఆనందయ్య మందు తో నష్టం లేనప్పుడు నమ్మడానికి ఏమైంది. నమ్మకమే జీవితానికి పునాది అయినప్పుడు ఆ నమ్మకం తోటే ఇప్పటివరకు నాయకులు, ప్రభుత్వాలు,అధికారులు చెప్పినవన్నీ నమ్మాము. ఇప్పటికే బాగా ప్రాచుర్యం పొందిన ఈ మందుపై అసలు ఏముందో జనం ఎందుకు నమ్ముతున్నారు దాని వివరాలు తెలుసుకోవాలని లోకాయుక్తకు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆరుగురు ఆయుర్వేద డాక్టర్ల బృందం తో ఆనంద ఈ మందు ఇచ్చే ప్రాంతానికి వెళ్లి ఆరా తీసి వివరాలు సేకరించారు. పోలీసులు అధికారులు అంతా కలిసి లోకాయుక్తకు నివేదికను సమర్పించారు. దీని సారాంశం లో ఆనందం ఇచ్చే మందు లో వాడిన వారు ఎవరు కూడా ఇప్పటివరకు చెడు ప్రభావాలకు లోను కాలేదని ప్రజలు తమకు తమవారికి కరోనా తగ్గుతుందని నమ్మకంతో చెబుతున్నారని చెప్పారు నివేదించారు. కానీ మందును తయారుచేసే ప్రాంతాలు పరిశుభ్రంగా లేవని మాత్రమే చెప్పినట్లుగా తెలుస్తోంది. ఆనందయ్య ఇచ్చే మందు తో జనం కరోనా నమ్మకంతో తగ్గించుకుంటున్నారు. అని సామాజిక మాధ్యమాలు వెల్లువెత్తుతున్నాయి. ఆనంద ఇచ్చే మందు తో నష్టం లేనప్పుడు ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వాలు ప్రజలకు నమ్మకం కలిగే విధంగా చర్యలు చేపట్టవచ్చు కదా అని ప్రజలు కోరుతున్నారు.

 

వైఎస్సార్ సీపీ నాయకులను అభినందించాలి.

ఇప్పటికే వైయస్సార్ సిపి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కోట్ల రూపాయల సొంత ఖర్చుతో కరోనా రోగుల కోసం ఆక్సిజన్ బెడ్లు సమకూర్చారు. ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ ఆనందయ్య మందు పంపిణీ కోసం శ్రమిస్తున్నారు కరోనా రోగుల కోసం సహాయ సహకారాలు అందిస్తున్నారు. అందరు నాయకులు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టలేరు. కాబట్టి నియోజకవర్గంలోనే స్వచ్ఛంద సంస్థలు లేదా నాయకులు అధికారులు ఆనందయ్య మందులు నియోజకవర్గంలో పంపిణీ చేసే విధంగా చర్యలు చేపడితే బాగుంటుంది. ప్రభుత్వ పెద్దలు సైతం ఆనందయ్య మందును తయారీ విధానాన్ని స్వార్థం లేని స్వచ్ఛంద సంస్థలతో పనిచేస్తున్న వారిని ఎన్నుకొని ఆయా నియోజకవర్గాల వారీగా నలుగురు చొప్పున ఆనందయ్య గారి దగ్గరకు పంపించి అందుకు కావలసిన ముడి పదార్థాలు సరుకులు ఏ విధంగా సేకరించారు తెలుసుకొని ఆయా నియోజకవర్గాల్లో నిల్వచేసుకొని అనునిత్యం మందు తయారీ విధానాన్ని బయటికి పోకుండా (ఎందుకంటే ఎంతో శ్రమించి ఆనందయ్య మందును తయారు చేశారు కాబట్టి ) జాగ్రత్తగా ఆన్లైన్లో ఆనందయ్య తన స్వస్థలం లోనే ఉండి సామాజిక మాధ్యమాల ద్వారా యువకులతో మందు తయారు చేయిస్తూ దానికి సంబంధించిన ఖర్చును స్వచ్ఛంద సంస్థలు గానీ ఆయా నియోజకవర్గంలోని దాతృత్వం కలిగిన నాయకులు పెద్దలు గాని భరిస్తూ పంపిణీ చేయవచ్చు. ఎవరైనా ప్రజల ప్రాణాల కోసమే కదా పని చేసేది. ప్రభుత్వమే ఒక అడుగు ముందుకు వేసి బాధ్యత తీసుకుంటే ఎంతో మందిని కాపాడిన వారవుతారు. ఆనందయ్య సేవలను గుర్తించి వారి మందులు మన ప్రజల కోసం వాడుకుంటే మంచిదే కదా.

మందుతో లాభాలు ఏమున్నాయి…

మంది తోటి లాభాలు ఉన్నాయా లేదా అనేది కొద్దిసేపు పక్కన పెడితే నష్టం అయితే ఉండదని లేదని అధికారులు చెబుతున్నారు కదా. నష్టాలు దుష్ఫలితాలు లేనప్పుడు మందు తయారు చేసే వారికి సహకారం అందించవచ్చు కదా ..
హైడ్రోక్లోరోక్వీన్, క్లోరోఫిల్ మంచిదని ఇతర దేశాలకు అమ్ముకున్నాము. మనం కూడా వాడాము.తర్వాత దానితో ఉపయోగం లేదన్నారు. అద్భుతంగా ప్లాస్మా థెరపీ ఉపయోగం ఉంటుందని దాతలను ఎంతోమందిని ముందుకు రమ్మన్నారు కానీ ఈ రోజున ప్లాస్మా ఎందుకు పనికి రాదని అంటున్నారు. అలాగే రెమీడేసివర్ ఏకైక మందు కరోనాకు అని చెప్పారు. ఇప్పుడు అది వాడవద్దని స్టెరాయిడ్లు ఇంజక్షన్ వల్ల ఆరోగ్యం దెబ్బతిని బ్లాక్ అండ్ వైట్ ఫంగస్ లతో కొత్త జబ్బులతో చనిపోతున్నారు అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెబుతుంది. ఇన్ని రకాలుగా ప్రయత్నించి ప్రాణాలు పోగొట్టుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. రోగులకు సేవ చేసే సందర్భంలో వైద్యులు సైతం దేశవ్యాప్తంగా వేలాదిగా చనిపోయారు. అయినా సరే దేశ సరిహద్దుల్లో కాపలాగా సైనికుల వలె వైద్యులు నిరంతరం పోరాడుతూనే ఉన్నారు. ఇన్ని రకాలుగా ప్రయత్నించినప్పుడు ఏ నమ్మకంతో పాటించాము నిబంధనలను. మరొక్కసారి ఆనందయ్య గారి మందును వాడితే తప్పేముంది దాని వల్ల మనిషికి దుష్ఫలితాలు ఏమీ లేవు కదా.ఎమ్మెల్యేలకు వినిపిస్తాను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వారు కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేలకు ఆదర్శంగా నిలిచారు ఆయనలా అందరూ కోట్లు ఖర్చు పెట్టే స్తోమత మిగతా నాయకులు లేకపోవచ్చు కానీ జనం నమ్ముతున్న ఆనందయ్య మందును ఆంధ్రప్రదేశ్ అంతటా అందించే ఆలోచన చేస్తే తప్పేముంది. వ్యాక్సిన్ ల కోసం ఆక్సిజన్ ల కోసం వేలకోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు ముఖ్యమంత్రులు. ప్రతి నియోజకవర్గంలో ఐదు నుంచి పది లక్షల రూపాయలతో మందు తయారయ్యే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఈ కరచును నాయకులు లేదా స్వచ్ఛంద సంస్థలు భరించి ఆనందం మందులు అందరికీ పని చేసే విధంగా ఆలోచన చేయవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే సామాన్యుల వద్దకు చేరే విధంగా వాలంటరీ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తుంది గతంలో హోమియో మందులను ఇంటింటికి వాలంటీర్ల ద్వారా అందించారు. ఇప్పుడు అదే విధంగా వాలంటరీ వ్యవస్థ తోటి ఆనందయ్య మందులు సైతం అందరికీ అందించవచ్చు. ఒక్కసారైనా పెద్ద మనసుతో ప్రభుత్వాలు నాయకుడు ఆలోచించండి నేడు వ్యాక్సిన్లు తయారు చేసే వాళ్ళు బిలియనీర్ల జాబితాలో కొత్తగా తొమ్మిది మంది చేరారు అంటే ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాయి. వారు సొమ్ము చేసుకుంటున్నారు అర్థం చేసుకోవాల్సి ఉంది. ప్రజల కోసం పని చేసే ప్రభుత్వాలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో నాయకులు పోలీసులు అధికారులు ప్రజల కోసం రాత్రి పగలు తేడా లేకుండా నిత్యం శ్రమిస్తూనే ఉన్నారు భరిస్తూనే ఉన్నారు. మందు పై ఉన్న ప్రజల నమ్మకాన్ని పక్కదారి పట్టించే సొమ్ము చేసుకునే వారు పుట్టకముందే ప్రజలు నమ్ముతున్న మందును అందరికీ పంచే విధంగా అందరిలో నమ్మకం కలిగించే విధంగా ప్రభుత్వ అధికారులు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి ఆలోచించండి.. ఆనందయ్య మందును ఆదరించండి..

పోరాడితే పోయేదేముంది.. బానిస సంకెళ్లు తప్ప.. అనేది పాత నానుడి
నమ్మకంతో మందు వేస్తే పోయేదేముంది కరోనా తప్ప.. మరో సారి ఆలోచించండి.. ప్లీజ్.. ప్లీజ్..

దయచేసి ఎమ్మెల్యేలు, మంత్రులు ముఖ్యమంత్రులు, గవర్నర్లు, ప్రధానమంత్రి వరకు ఈ మెసేజ్ చేరే విధంగా సహకరిస్తారని ఆశిస్తున్నాను ..

ఇమంది ఉదయ్ కుమార్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,
తెలంగాణ రాష్ట్రం,
9985540005

Related posts

రోడ్ ప్రమాదాలకు కొత్త భాష్యం చెప్పిన మధ్యప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే !

Drukpadam

ఇంటర్నెట్ సేవల నిలిపివేత…హక్కులకు భంగమే …ఐక్యరాజ్యసమితి !

Drukpadam

ముగిసిన టోక్యో ఒలింపిక్ క్రీడలు… అమెరికాకు అగ్రస్థానం!

Drukpadam

Leave a Comment