ఈనెల 8 ప్రధాని మోడీ బహిరంగ సభను జయప్రదం చేయండి …పొంగులేటి
బీఆర్ యస్ ,కాంగ్రెస్ వి మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలు
తెలంగాణాలో బీజేపీదే అధికారం…మరికొద్దిరోజుల్లో చాల మార్పులు
ఈనెల 8 న ప్రధాని హనుమకొండ లో నిర్వహించే భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలనీ బీజేపీ జాతీయ నాయకులు , తమిళనాడు సహా ఇంచార్జి డాక్టర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి పిలుపు నిచ్చారు . శనివారం ఖమ్మం జిల్లా బీజేపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో బీజేపీ విస్తరణకు తీసుకోవాలన్సిన చర్యల గురించి చరించినట్లు తెలిపారు .
జులై 8వ తేదీన హన్మకొండలో నిర్వహించే భారీ బహిరంగ సభకు ఖమ్మం జిల్లా ప్రజలు, ప్రత్యేకించి బీజేపీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. అంతకుముందు బీజేపీ జిల్లా ముఖ్యనేతలతో సమావేశమై సంస్థాగత విషయాలపై చర్చించారు . ఇటీవల భోపాల్ లో జరిగిన ఎన్నికల భూత్ కమిటీల సమావేశంలో ప్రధాని చేసిన దిశా నిర్దేశం మేరకు కార్యకర్తలు సమాయత్తం కావాలని పిలుపు నిచ్చారు .
అదే రోజు వరంగల్ లో మేఘా టెక్స్‌టైల్ పార్క్, రైల్వే ఓవర్‌హాల్ మరియు మెయింటెనెన్స్ ప్రాజెక్ట్, రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీకి ప్రధాని శంకుస్థాపన చేస్తారని అన్నారు . మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పదం లో పయనిస్తుందని అన్నారు . తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ యస్ , కాంగ్రెస్ పార్టీలు మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు . వారు ఎన్ని రాజకీయాలు చేసిన తెలంగాణ లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు . కుటుంబ పార్టీలు, కమ్యూనిస్టులు, వారి ప్రేరేపిత, సంకుచిత రాజకీయాలపై, ఇటీవలి పర్యటనలో, విదేశాల దృష్టిలో భారతదేశ ప్రతిష్టను దిగజార్చిన కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు.
9 సంవత్సరాల సేవా, సుశాసన్, గరీబ్ కళ్యాణ్ యొక్క 9 సంవత్సరాల సుపరిపాలనపై కార్యక్రమాలతో సహా కార్యకలాపాల పురోగతిపై మరియు పోలింగ్ బూత్‌ల స్థాయిలో కమిటీలను బలోపేతం చేయాలనీ అన్నారు . ఈసమావేశంలో జిల్లా బీజేపీ అధ్యక్షులు గల్లా సత్యనారాయణ ఇతర నాయకులు పాల్గొన్నారు …