Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఖమ్మం కాంగ్రెస్ సభకు ఎన్ని లక్షలమంది హాజరు …?

ఖమ్మం కాంగ్రెస్ సభకు ఎన్ని లక్షలమంది హాజరు …?
ఐదు లక్షలు అంటున్న కాంగ్రెస్
మూడు లక్షల మంది రావచ్చునని పరిశీలకుల అభిప్రాయం
లక్ష లేదా అంతకు కొంత ఎక్కువ అంటున్న బీఆర్ యస్ వర్గాలు
మొత్తానికి సభ సక్సెస్ అని అంగీకరిస్తున్నా పలువురు
రాహుల్ స్పీచ్ సూపర్బ్ అంటున్న పరిశీలకులు

 

ఖమ్మంలో జరిగిన తెలంగాణ జన గర్జన సభ గ్రాండ్ సక్సెస్ అయింది. రాహుల్అ స్పీచ్ సూపర్బ్ అంటున్నారు . అయితే సభకు జనం ఎంతమంది హాజరయ్యారనే దానిపై వివిధ పార్టీల్లో తర్జన భర్జనలు జరుగుతున్నాయి. అందుకు అన్ని పార్టీలు ఆరా తీస్తున్నాయి. మొత్తానికి సభకు బాగా జనం వచ్చారని అందరు అంగీకరిస్తున్నా సంఖ్యలోనే అగీకారం కుదరడం లేదుసహజంగా కాంగ్రెస్ తన సభకు 5 లక్షల మందిపైగానే వచ్చారని అంటుండగా , లక్షకు కొంత అటు ఇటు అంటూ బీఆర్ యస్ వర్గాలు అంటున్నాయి. ఇంటలిజెన్స్ కూడా ఇదే చెప్పినట్లు ప్రచారం జరుగుతుంది. అయితే పరిశీలకు మాత్రం 3 లక్షల మంది వచ్చినట్లు అంచనా వేశారు . వాస్తవానికి మధ్యాహ్నం 3 గంటల వరకుబహిరంగ స్థలంలో ప్రజలు పెద్దగా లేరు .దీంతో బీఆర్ యస్ నేతలు జనం లేక వెలవెల సభ అంటూ ప్రచారం ప్రారంభించారు . అయితే 5 గంటలకే గ్రౌండ్ పూర్తిగా నిండిపోయింది. జిల్లాకు నాలుగు వైపులనుంచి ఇంకా ప్రజలు వాహనాల ద్వారా వస్తూనే ఉన్నారు . కొన్ని వాహనాలు నుంచి ప్రజలు దిగకుండానే గ్రౌండ్ లోపలి వెంటర్ కాలేక వెనుదిరిగారు . బైపాస్ రోడ్ లో ట్రాఫిక్ జాం అయింది. ఉదయం రోడ్లపై బారికేడ్లు వేసి ప్రజలు వస్తున్న వాహనాలు ఆపిన పోలీసులు,ఆర్టీఏ తర్వాత కాంగ్రెస్ నేతల జోక్యంతో పెద్దగా పట్టించుకోలేదు . ఒక పక్క పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , భట్టి విక్రమార్క , మరో పక్క రేణుకా చౌదరి , కోమటి రెడ్డి వెంకటరెడ్డి ,వి .హనుమంతరావు , పోలిసుల చర్యలపై ఫైర్ అయ్యారు . రేణుక చౌదరి కరుణగిరి వద్ద బారికేడ్లను తొలగించి మమ్మలను ఆపేది ఎవడ్రా అని గైంకరించారు.ఆమె స్వయంగా బారికేడ్లు తొలగించి అక్కడ నిలిపిన వాహనాలను పంపించారు . రేవంత్ రెడ్డి ,మధు యాష్కీ లు రాష్ట్ర డీజీపీ తో మాట్లాడి రాహుల్ సభకు అంటకాలు కల్పిస్తే భాద్యత పోలీసులదే అవుతుందని హెచ్చరించారు . తర్వాత ఖమ్మం సీపీ సభకు వచ్చేవారిని పోలీసులు ఎక్కడ అడ్డుకోవడంలేదని ప్రకటించారు . అంతకు ముందు ఆటంకం కల్పించిన పోలీసులు బారికేడ్ల దగ్గర లేకుండా వెళ్లి పోయారు .

రాహుల్ కాంప్లిమెంట్స్విజయోత్సవ సభ ఇక్కడే అన్న రేవంత్

సభ గ్రాండ్ సక్సెస్ కావడంతో కాంగ్రెస్ వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. రాహుల్ గాంధీ సైతం పొంగులేటిని , ఖమ్మం కాంగ్రెస్ ను అభినందించారు . సభ సమీకరణ ఏర్పాట్లపై కాంప్లిమెంట్స్ ఇచ్చారు . అందుకే రేవంత్ రెడ్డి చివరలో మాట్లాడుతూ తెలంగాణా లో అధికారంలోకి వచ్చిన తర్వాత విజయోత్సవ సభ కూడా ఇదే గ్రౌండ్ లో పెడతామని హర్షద్వానాల మధ్య ప్రకటించారు.

పీఎం , పీఎం నినాదాలతో మారుమోగింది సభ ప్రాగణం

రాహుల్ గాంధీ ప్రసంగించడానికి వేదిక వద్దకు రాగానే పీఎం , పీఎం అంటూ ప్రజలు పెద్ద పెట్టున నినాదాలు చేశారు . దానికి రాహుల్ అర్ భాయి సునీయే ,సునీయే అంటూ ప్రజలను వారించే ప్రయత్నం చేశారు . సభలో పీపుల్స్ మార్చ్ చేసిన భట్టి ,పార్టీలో చేరిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , ప్రజాగాయకుడు గద్దర్ ప్రత్యేక ఆకర్షణ నిలిచారు . శ్రీనివాస్ రెడ్డితో పాటు ఖమ్మంలోని వివిధ నియోజకవర్గాలకు చెందిన అనేక మంది నాయకులూ మాజీ ఎమ్మెల్యేలు లకు రాహుల్ గాంధీ పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోని ఆహ్వానించారు . పార్టీలో చేరిన వారిలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు ప్రసాద రెడ్డి కూడా ఉండటం గమనార్హం….

 

How many lakhs attend Khammam Congress meeting?
Congress is saying five lakhs…
According to observers, three lakh people may come…
BRS factions say one lakh or more
Many agree that the assembly was a success
Observers say Rahul’s speech is superb

The Telangana Jana Garjana Sabha held at Khammam was a grand success. Rahul’s speech is superb. However, various parties are arguing about how many people attended the meeting. All parties are asking for that. Although everyone agrees that the assembly was well attended, there is no agreement on the number…Of course, the Congress says that only 5 lakh people came to the assembly, but the sources of BRS say that it is a few lakhs here and there. Propaganda goes on as intelligence says the same. But it is estimated that 3 lakh people came for Parisila. In fact, there were not many people in the open space till 3 o’clock in the afternoon. With this, BRS leaders started campaigning as Janam or Velawela Sabha. But by 5 o’clock the ground was completely full. People are still coming from four sides of the district by vehicles. People could not enter the ground without getting down from some vehicles and turned back. There is a traffic jam on the bypass road. The police, who put up barricades on the roads in the morning and stopped the vehicles coming from the people, did not pay much attention to the intervention of the Congress leaders after the RTA. On one side, Ponguleti Srinivas Reddy, Bhatti Vikramarka, on the other side, Renuka Chaudhary, Komati Reddy Venkata Reddy, V. Hanumantha Rao, were fired at the actions of the police. Renuka Chaudhary removed the barricades at Karunagiri and chanted who is stopping us. She herself removed the barricades and sent the vehicles parked there. Revanth Reddy and Madhu Yashki spoke to the State DGP and warned that if Rahul creates stickers for the assembly, the police will be held responsible. Later it was announced that the police are not stopping those coming to Khammam CP meeting. The policemen who obstructed the barricades before that went away.

Rahul’s compliments … Vijayotsava Sabha is here Anna Revant

Congress circles are expressing happiness as the meeting was a grand success. Rahul Gandhi also congratulated Ponguleti and Khammam Congress. Compliments were given on the assembly arrangements. That’s why Revanth Reddy said at the end that after coming to power in Telangana, the victory assembly will also be held in the same ground and announced amidst cheers.

The hall echoed with slogans of PM, PM…

When Rahul Gandhi came to the stage to deliver his speech, people raised slogans saying PM, PM. To that, Rahul Ar bhai tried to avoid people by saying Sunye, Sunye. Bhatti, who led the people’s march in the assembly, Ponguleti Srinivas Reddy, who joined the party, and Gaddar, a popular singer, were special attractions. Along with Srinivas Reddy, many leaders from various constituencies in Khamma warmly invited the former MLAs to join the party by covering them with Rahul Gandhi’s party scarves. Ponguleti Srinivas Reddy’s brother Prasada Reddy is also among those who joined the party.

 

Related posts

టీఆర్ యస్ పగ్గాలు కేటీఆర్ కేనా …?

Drukpadam

వైసీపీది ఆరాచక పాలనా …అది ప్రజలకు అర్థం కావాలి :చంద్రబాబు…

Drukpadam

12 డిమాండ్లతో టీడీపీ సీనియ‌ర్ నేత‌ల‌తో క‌లిసి దీక్ష‌కు దిగిన చంద్ర‌బాబు…

Drukpadam

Leave a Comment