Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ లో అగ్నిప్రమాదం.. తగలబడ్డ బోగీలు

  • హౌరా నుంచి సికింద్రాబాద్ వస్తున్న రైలు
  • బీబీ నగర్ మండలంలో ప్రమాదానికి గురైన ఎక్స్ ప్రెస్
  • పూర్తిగా తగలబడిపోయిన నాలుగు బోగీలు

ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. హౌరా నుంచి సికింద్రాబాద్ కు వస్తున్న ఈ ఎక్స్ ప్రెస్ యాదాద్రి జిల్లా బీబీ నగర్ మండలం పగిడిపల్లి – బొమ్మాయిపల్లి మధ్య అగ్నిప్రమాదానికి గురైంది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాకున్నా.. షార్ట్ సర్క్యూట్ కారణం కావచ్చని భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఒక్కసారిగా రైల్లో మంటలు చెలరేగాయి.

ఆరు బోగీలకు మంటలు అంటుకోగా… నాలుగు బోగీలు పూర్తిగా తగలబడిపోయాయి. తొలుత పొగలు వచ్చిన వెంటనే ప్రయాణికులు రైలు చైన్ లాగి కిందకు దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అగ్ని ప్రమాదంలో ప్రయాణికులు ఎవరికీ ప్రమాదం జరగలేదు.

ప్రమాద స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేసారు . మరోవైపు దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ హుటాహుటిన ప్రమాద స్థలికి చేరకుని పరిస్థితిని సమీక్షించారు.

ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ ప్రమాదం: దక్షిణ మధ్య రైల్వేకు బెదిరింపు లేఖ రాసిన అనుమానితుడి అరెస్టు

  • బీహెచ్‌ఈఎల్‌కు చెందిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • బెదిరింపు లేఖపై విచారణ..
  • అతనే రాశాడా, ఇంకెవరైనా రాశారా అనే కోణంలోనూ దర్యాప్తు
 
ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ రైలు అగ్నిప్రమాదం ఘటన నేపథ్యంలో.. దక్షిణ మధ్య రైల్వే శాఖకు ఇటీవల బెదిరింపు లేఖ రాసిన అనుమానితుడిని పోలీసులు అరెస్టు చేశారు. బీహెచ్‌ఈఎల్‌కు చెందిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
 
ఈ బెదిరింపు లేఖపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ లేఖను అతనే రాశాడా, లేక ఇంకెవరైనా రాశారా? కారణమేంటి? ఇందులో కుట్రకోణం ఏమైనా ఉందా? వంటి విషయాలపై దర్యాప్తు చేస్తున్నారు.
 
జూన్ 30వ తేదీన దక్షిణ మధ్య రైల్వే శాఖకు బెదిరింపు లేఖ అందింది. ఒడిశాలోని బాలాసోర్‌‌ తరహాలో ఢిల్లీ- హైదరాబాద్ రూట్‌లో రైలు ప్రమాదం జరిగే అవకాశం ఉందని లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖపై రైల్వే శాఖాధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
 
అగంతుకుడు బెదిరింపు లేఖ… సంబంధం లేదని స్పష్టం సీపీఆర్ఓ రాకేష్
 
ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ ప్రమాదం నేపథ్యంలో, రైల్వే శాఖకు ఓ అగంతుకుడు బెదిరింపు లేఖ రాసిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీనిపై రైల్వే సీపీఆర్ఓ రాకేష్ స్పందించారు. ఆగంతుకుడి బెదిరింపు లేఖకు, ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ ప్రమాదానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఆగంతుకుడి లేఖపై విచారణ జరుగుతోందని తెలిపారు. ఈ ఘటనలో 3 బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయని చెప్పారు. ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ ప్రయాణికుల కోసం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో మూడు హెల్ప్ డెస్కులు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. 

అటు, ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ ప్రమాదం నుంచి బయటపడిన ప్రయాణికులు మీడియాతో మాట్లాడారు. మంటలు అంటుకున్నాక వేగంగా వ్యాపించాయని తెలిపారు. మంటల ఉద్ధృతి చూసి వణికిపోయామని, చనిపోతామేమోనన్న భయం వేసిందని వెల్లడించారు. ఈ ప్రమాదం వెనుక కుట్ర ఉంటే నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టవద్దని ప్రయాణికులు స్పష్టం చేశారు.

 

రైలు ప్రమాదంపై తెలంగాణ డీజీపీ ట్వీట్

  • అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదన్న డీజీపీ
  • ప్రయాణికులందరినీ బస్సుల్లో తరలించామని వెల్లడి
  • 7 బోగీల్లో మంటలు చెలరేగాయని, 3 బోగీల్లో మంటలను ఆర్పివేశారని ట్వీట్
Telangana DGP tweets on train fire accident

 

హౌరా నుంచి సికింద్రాబాద్‌ వస్తున్న ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. యాదాద్రి జిల్లా బీబీ నగర్ మండలం పగిడిపల్లి – బొమ్మాయిపల్లి మధ్య ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ స్పందించారు. అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని చెప్పారు.
 
‘‘భువనగిరి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ప్రయాణికులందరినీ సురక్షితంగా కిందికి దించేశాం. వారిని బస్సుల్లో తరలించాం” అని ట్వీట్ చేశారు. పోలీసులు, అగ్నిమాపక శాఖ, రైల్వే శాఖ సమన్వయంతో పనిచేస్తున్నాయని, ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని, ఎవరూ గాయపడలేదని పేర్కొన్నారు.

సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. ‘‘మొత్తం 18 కోచ్‌లలో 11 కోచ్‌లను వేరు చేసి.. వాటిని సురక్షితంగా తరలించారు. 7 బోగీల్లో మంటలు చెలరేగాయి. అందులో 3 బోగీల్లో మంటలను ఆర్పివేశారు” అని చెప్పారు. 

Related posts

భారత ఎన్నికలను ప్రభావితం చేసేందుకు ఇజ్రాయిల్ ప్రయత్నించిందా …?

Ram Narayana

అమృతపాల్ సింగ్ కోసం కొనసాగుతున్న వేట …చిక్కినట్లే చిక్కి తప్పించుకుంటున్న వైనం …

Drukpadam

అసోంలో రాహుల్ గాంధీపై కేసు నమోదు

Ram Narayana

Leave a Comment