Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలురాజకీయ వార్తలు

బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో మమతా పార్టీ జోరు, రెండో స్థానంలో బీజేపీ!

బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో మమతా పార్టీ జోరు, రెండో స్థానంలో బీజేపీ!

  • 18వేలకు పైగా పంచాయతీల్లో టీఎంసీ గెలుపు!
  • 4,592 స్థానాలతో రెండో స్థానంలో బీజేపీ
  • తేలిపోయిన కాంగ్రెస్, సీపీఐ(ఎం)

పశ్చిమ బెంగాల్ లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో తృణమూల్ , బీజేపీ లు హోరా హోరి తలపడ్డాయి. ఈసందర్భంగా భారీ హింస చెలరేగింది. 30 పైగా మరణించారు, వందలాది మందికి గాయాలైయ్యాయి . పంచాయతీ ఎన్నికల్లో హింసను కంట్రోల్ చేయడంలో మమతా ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బీజేపీ మరికొన్ని రాజకీయ పార్టీల ఆరోపిస్తున్నాయి. బీజేపీ కేంద్ర బలగాలను సైతం రంగంలోకి దింపింది. అయినప్పటికీ అధికార తృణమూల్ కాంగ్రెస్ సత్తా చాటుతోంది. సాయంత్రం ట్రెండ్స్ ప్రకారం 63,229 గ్రామ పంచాయతీలకు గాను టీఎంసీ 18,332 పంచాయతీల్లో, బీజేపీ 4,592, కాంగ్రెస్ 1,142, సీపీఐ(ఎం) 1,894 పంచాయతీల్లో గెలుపు లేదా ముందంజలో కొనసాగుతున్నాయి. పంచాయతీ సమితిల విషయానికి వస్తే టీఎంసీ 134, బీజేపీ 8, సీపీఎం 6 స్థానాల్లో, జిల్లా పరిషత్‌లలో టీఎంసీ 22, సీపీఎం 1 స్థానంలో ముందంజలో ఉన్నాయి. 63వేలకు పైగా గ్రామపంచాయతీలకు గాను 28వేల పంచాయతీల సమాచారం మాత్రమే ప్రస్తుతం వెల్లడైంది. మరో 35వేలకు పైగా గ్రామపంచాయతీల ఓట్లు లెక్కించాల్సి ఉంది.

Related posts

చైనాను వెన‌క్కు త‌గ్గేలా చేసిన భార‌త్‌.. కీల‌క ప్రాజెక్ట్ నిలిపివేత‌!

Drukpadam

బద్వేల్ లో పోటీకిసై అంటున్న బీజేపీ ….

Drukpadam

నేను ప్రజలు ఎన్నుకున్న సీఎంని.. నీవెవరు?: కేజ్రీవాల్ ఫైర్

Drukpadam

Leave a Comment