Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలురాజకీయ వార్తలు

పార్టీ హైకమాండ్ దృష్టిలో పొంగులేటి…!

పార్టీ హైకమాండ్ దృష్టిలో పొంగులేటి…!
రాష్ట్ర ప్రచార కమిటీ కో -చైర్మన్ పదవితో పార్టీలో మంచి గుర్తింపు
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ లో సముచిత స్థానం పట్ల ..ఖమ్మం లో సంబరాలు
ఒక్కడిగానే తిరిగిన పొంగులేటి …నేడు జాతీయపార్టీ రాష్ట్ర నేతగా
తనకు కాంగ్రెస్ అనే మహా వృక్షం అండగా ఉందనే ధీమా ..!
రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తేవడమే తన లక్ష్యమని వెల్లడి
అందుకు పార్టీ అప్పగించిన పనిచేసేందుకు సిద్ధమన్న పొంగులేటి ..

పొంగులేటి …పొంగులేటి రాష్ట్ర రాజకీయవర్గాల్లో ఇప్పుడు ఏ నోటా విన్నా ఇదే చర్చ…కేసీఆర్ ను ఇంటికి పంపిస్తానని సవాల్ చేస్తున్నారు … కేసీఆర్ వ్యతిరేకులను ఐక్యం చేయాలనే పట్టుదలతో ఎత్తులు వేస్తున్నారు .ఇందుకోసం తన శాయశక్తులా ఉన్న అవకాశాలను ఉపయోగిస్తున్నారు . వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు … పట్టుదలతో చిత్తశుద్దిగా కృషి చేస్తున్నారు….ఖమ్మం జిల్లా నుంచి ఒక్క బీఆర్ యస్ ఎమ్మెల్యేని కూడా అసెంబ్లీ గేటు తాకనివ్వనని శపథం చేశారు . రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తేవడం కోసం పార్టీ అప్పగించిన పనిని చేసేందుకు సిద్ధంగా ఉన్నానని పొంగులేటి వెల్లడించారు. హైకమాండ్ దృష్టిలో ఉన్న పొంగులేటి ప్రచార కమిటీ కో – చైర్మన్ పదవి అప్పగించింది.. తనకు పదవి ఇచ్చిన మల్లికార్జన ఖర్గే కు రాహుల్ గాంధీకి ,తమ సహకారం అందించిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంతే రెడ్డికి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కు రాష్ట్రంలోని ఇతర పెద్దలకు కృతఙ్ఞతలు తెలిపారు . దీంతో అసలు ఎవరు ఈ పొంగులేటి …ఆయనకు అంత సీన్ ఉందా…ఎందుకు ఇంత పాపులర్ అయింది ఈపేరు అనేది చర్చనీయాంశంగా మారింది…

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 1999 లో అధికారంలోకి వచ్చిన లో చంద్రబాబు నాయుడు కేసీఆర్ కు మంత్రి పదవి ఇవ్వకుండా , ఉపసభాపతి ఇచ్చారు.అది ఆయనకు ఇష్టంలేదు … తనకు నచ్చని పోస్ట్ పై కష్టంగానే కూర్చున్నారు . తెలంగాణ మలిదశ ఉద్యమం అప్పుడే పురుడు పూసుకుంటుంది. మేధావులు , కవులు ,కళాకారులూ ,తెలంగాణ రాష్ట్రంకోసం అక్క్డడక్కడ సభలు సభావేశాలు పెడుతున్నారు. దీంతో ఆంధ్ర పాలకులవల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతుందని భావించిన కేసీఆర్ ఉపసభాపతి పదవికి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. 2002 లో టీఆర్ యస్ పార్టీని ఏర్పాటు చేశారు. చంద్రబాబు కేసీఆర్ కు మంత్రి పదవి ఇస్తే ఇంత జరిగేది కాదనే వాదన ఉంది …

అదే విధంగా 2014 లో తెలంగాణ ఏర్పడి కేసీఆర్ సీఎం అయ్యారు . ఖమ్మం పార్లమెంట్ నుంచి వైసీపీ ఎంపీగా గెలుపొందిన పొంగులేటి వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు . కేసీఆర్ మంత్రంగాతో పార్టీ పోస్ట్ కు గుడ్ బై చెప్పిన పొంగులేటి కేటీఆర్ దౌత్యంతో టీఆర్ యస్ లో చేరారు . చేరినప్పుడు కండిషన్ ఏమిటంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి తిరిగి 2019 ఎన్నికల్లో ఎంపీ సీట్ ఇస్తానని కేటీఆర్ మాట ఇచ్చారు . అది ఇవ్వకుండా కేసీఆర్ పొంగులేటిని మోసంచేశారు . అంతే కాకుండా తనమీద వచ్చిన నిందలకు వివరణ ఇచ్చుకునేందుకు శ్రీనివాస్ రెడ్డి కేసీఆర్ అపాయింట్మెంట్ కోసం అనేక సార్లు ప్రయత్నం చేసిన ఫలితం లేకుండా పోయింది .దీంతో అవమానానికి గురైయ్యానని పొంగులేటి అభిప్రాయపడ్డారు .ఆత్మగౌరవాన్ని చంపుకుని బీఆర్ యస్ లో కొనసాగటం కంటే బయటకు వెళ్లడమే మంచిదని నిర్ణయించుకున్న శ్రీనివాస్ రెడ్డి చివరకు కాంగ్రెస్ లో చేరారు . కాంగ్రెస్ కూడా కొద్దీ రోజుల్లోనే సముచిత స్థానం ఇచ్చి గౌరవించింది …అందుకు ఆయన సంతోషం వ్యక్తం చేస్తున్నారు .ఆయన అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు.

ఖమ్మం జనగర్జనసభలో పొంగులేటి ఫైర్ స్వయంగా చూసిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఫిదా అయ్యారు …..ఖమ్మం లో జరిగిన బహిరంగ సభ సక్సెస్ చేయడంలో శ్రీనివాస్ రెడ్డి నిద్ర ఆహారాలుమాని అహోరాత్రులు శ్రమించారు . అధికార బీఆర్ యస్ పార్టీ ఖమ్మం లో జరిగిన కాంగ్రెస్ జనగర్జన బహిరంగసభకు ప్రజలను వెళ్లకుండా చేసిన, అన్ని రకాల ప్రయత్నాలు విఫలమైయ్యాయి… లక్షలాదిగా ప్రజలు ఆసభకు తండోపతండాలుగా తరలి వచ్చారు .ఇది రాహుల్ గాంధీ మనుసులో నాటుకుంది .ఖమ్మం సభ చూసిన తర్వాత రాహుల్ కు ఒక నమ్మకం కలిగినట్లు సమాచారం …స్థానిక నాయకులు ఐక్యంగా పనిచేసి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవాలని నేతలకు విడివిడిగా క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తుంది…

వాస్తవానికి పొంగులేటి బీఆర్ యస్ నుంచి సస్పెన్షన్ కు గురైన తర్వాత ఏపార్టీలో చేరాలనే దానిపై తర్జన భర్జనలు పడ్డారు . బీజేపీ కూడా ఆయనకు గాలం వేసింది.చేరికల కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ నేతృత్వంలో ఒక బృందం నేరుగా ఖమ్మం వచ్చి పొంగులేటి నివాసంలో ఐదు గంటలపాటు సుదీర్ఘంగా చర్చలు జరిపింది.అయినప్పటికీ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవని గ్రహించిన పొంగులేటి వారికీ సున్నితంగానే సమాధానం చెప్పారు. చివరకు రాష్ట్రంలో బీఆర్ యస్ ను ఓడించాకలిగే పార్టీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అందుకు అనుగుణంగా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఖమ్మంలో జులై 2 న లక్షలాదిమందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి రాహుల్ సమక్షం లో ఆయన చేతుల మీదగా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో పొంగులేటి పేరెత్తగానే ప్రజల నుంచి వచ్చిన రెస్పాన్స్ స్వయంగా చూసిన రాహుల్ పొంగులేటి ఫైర్ ను పార్టీకి ఉపయోగించుకోవాలని అనుకున్నారు. అందులో భాగంగానే ఆయనకు కీలకమైన రాష్ట్ర స్థాయి పదవికి ఎంపిక చేశారు . .ప్రచారం కమిటీ చైర్మన్ గా మధు యాష్కీ ఉండగా, కో – చైర్మన్ పదవి పొంగులేటి కట్టబెట్టడం ఆషామాషీ కాదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్రస్థాయిలో తమ అభిమాన నాయకుడికి పదవి వచ్చిందని తెలియగానే శనివారం ఉదయం ఖమ్మం లో ఆయన అభిమానులు క్యాంపు కార్యాలయం వద్ద బాణా సంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు . రాహుల్ నాయకత్వం వర్ధిల్లాలి ,శీనన్న నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినదించారు . క్యాంపు కార్యాలయ ఇంచార్జి తుంబురు దయాకర్ రెడ్డికి స్వీట్లు తినిపించారు .

నిరంతరం ప్రజల్లో ఉన్న నేతగా పేరు తెచ్చుకున్నారు …

2014 రాజకీయాల్లోకి అడుగు పెట్టిన పొంగులేటి వెనకడుగు వేయలేదు …పదవి ఉన్న లేకపోయినా నిరంతరం ప్రజల్లో ఉన్న నేతగా పేరు తెచ్చుకున్నారు .చిన్న చిన్న లాప్స్ ఉన్న వాటిని సరిచేసుకుంటూ ముందుకు సాగారు . ఎక్కడ ఏ కార్యక్రమం ఉన్న వదిలి పెట్టలేదు . అనేక సార్లు జిల్లాను చుట్టారు ప్రజల కోసం ప్రజల వెంట నడిచారు . ఎక్కడకు వెళ్లిన పొంగులేటి …పొంగులేటి అనే పేరు మరు మోగింది…. ప్రధానంగా పేదల కష్టసుఖాల్లో పాలుపంచుకున్నారు . మొదటిసారి ఎంపీ అయిన తర్వాత తెలంగాణాలో పార్టీని జగన్మోహన్ రెడ్డి వదిలి వేయడంతో 2016 లో బీఆర్ యస్ లో చేరారు .2019 లోకసభ ఎన్నికల్లో తిరిగి టికెట్ ఇస్తానన్న కేసీఆర్ ఇవ్వకపోయినా పార్టీ నిర్ణయించిన అభ్యర్థికి ప్రచారం చేశారు .తర్వాత రాజ్యసభ , ఎమ్మెల్సీ సీట్లు ఇస్తారని ప్రచారం జరిగినా, అవి రాలేదు . పైగా లోకసభ ఎన్నికల తర్వాత సీఎం కేసీఆర్ ,పొంగులేటికి కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు ..దీంతో ఆయన పార్టీ పట్ల అసంతృప్తితోనే ఉన్నారు .అది రోజురోజుకు మరింత పెరిగి పార్టీని వీడేదాకా వచ్చింది…

రాజకీయ ఆరంగేట్రం చేసిన కొద్దీ నెలలకే ఎంపీగా విజయం ..

ఆయన రాజకీయ అరంగేట్రమే విచిత్రంగా ఉంది. 2014 ఎన్నికలకు కొద్దీ నెలల ముందు ఉమ్మడి రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా చేసిన దివంగత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు జగన్ మోహన్ రెడ్డి స్థాపించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరారు .ఖమ్మం ఎంపీగా పోటీచేశారు .మొదటిసారి ఎన్నికల బరిలోనే నిలిచి టీడీపీ నేత నామ నాగేశ్వరరావు ను ఓడించి ఎంపీ గా గెలుపొందారు . అది రాష్ట్రంలోనే సంచలన విజయంగా మారింది .లోకసభలో టీడీపీ పక్ష నాయకుడిగా ఉన్న నామ ఓటమి చెందారు. అయితే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మ అసెంబ్లీకి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన నామ టీఆర్ యస్ అభ్యర్థి గా పోటీచేసిన పువ్వాడ అజయ్ నామ ను ఓడించారు . కొద్దినెలల తిరిగాక ముందే అదేనామకు కేసీఆర్ టీఆర్ ఖ్మమం ఎంపీ టికెట్ ఇవ్వడం పొంగులేటి ఇష్టం లేకపోయినా కష్టంగా ఒప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీ పొంగులేటి టికెట్ ఆఫర్ చేసిన టీఆర్ యస్ కు అభ్యర్థికోసం పనిచేశారు . తాను టీఆర్ యస్ పార్టీలో చేసిన సేవలు గట్టుకు కట్టెలు మోసిన చందంగా ఉన్నాయనే అభిప్రాయంతో ఆయన ఉన్నారు .

మారిన రాజకీయ పరిస్థితుల్లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ రాష్ట్రనేతగా ప్రచార కమిటీ కో-చైర్మన్ గా ఎలాంటి పాత్ర పోషిస్తారనేది ఆసక్తిగా మారింది….

Related posts

తెలంగాణాలో యమ తాగేస్తున్నారు …!

Ram Narayana

 ఏపీ ప్రభుత్వం చేసిన అప్పులపై లెక్కలు చెప్పిన పురందేశ్వరి!

Ram Narayana

ఏపీలో బీఆర్ఎస్ ఏం చేస్తుందో చూద్దాం: బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి!

Drukpadam

Leave a Comment