Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అంతర్జాతీయం

వీడికి ఇదో రకం పాడు బుద్ది …జపాన్ లో కామాంధుడు …!

వీడికి ఇదో రకం పాడు బుద్ది …జపాన్ లో కామాంధుడు …!
అతడి వాహనం చుట్టూ నాలుగు కెమెరాలు… ఎందుకో తెలిస్తే దిగ్బ్రాంతికి గురవుతారు!
క్యోటో నగరంలో కామాంధుడు!
స్కర్టులు ధరించి అమ్మాయిలే అతటి టార్గెట్
వారికి సమీపంలో వాహనం పోనిచ్చి, కెమెరాలతో స్కర్టు లోపలి భాగాల చిత్రీకరణ
అతడి ఇంట్లో 1000 మంది అమ్మాయిల స్కర్టు వీడియోలు

జపాన్ ముఖ్య నగరాల్లో క్యోటో ఒకటి. ఈ నగరానికి చెందిన సతోషి నిషిముర ఒక ట్రక్కు డ్రైవర్. సరకు రవాణా నిమిత్తం క్యోటో నుంచి తన ట్రక్కుతో వివిధ ప్రాంతాలకు ప్రయాణిస్తుంటాడు. కాగా, నిషిముర ట్రక్కుకు చుట్టూ నాలుగు కెమెరాలు అమర్చి ఉంటాయి. ఆ కెమెరాలు ఎందుకో తెలుసుకున్న పోలీసులు దిగ్భ్రాంతికి గురయ్యారు.

జపాన్ లో దుస్తులు ధరించే విధానం పాశ్చాత్య దేశాలను పోలి ఉంటుంది. జపాన్ అమ్మాయిలు స్కర్టులు ధరించడం సాధారణమైన విషయం. నిషిముర ఏం చేసేవాడంటే… రోడ్డుపై స్కర్టు ధరించిన అమ్మాయిలు కనిపిస్తే చాలు… తన ట్రక్కును వారికి సమీపానికి పోనిచ్చేవాడు. ఆ ట్రక్కు చుట్టూ అమర్చిన కెమెరాలతో అమ్మాయిల స్కర్టు లోపలి భాగాలను చిత్రీకరించేవాడు.

గత 11 ఏళ్లుగా నిషిముర ఈ తరహా వీడియో రికార్డింగ్ లు చేస్తున్నాడు. ఇటీవల ఓ మహిళ కొన్ని వీడియోలను చూసింది. అందులో తాను స్కర్టు ధరించినప్పటి దృశ్యాలతో అసభ్యకరంగా ఉన్న వీడియో కూడా ఉంది. దాంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిషిముర దుర్బుద్ధి వెలుగు చూసింది …

పోలీసులు అతడి నివాసంలో సోదాలు చేయగా, 1000 మంది అమ్మాయిలకు చెందిన స్కర్టు వీడియోలు బయటపడ్డాయి. 30 హార్డ్ డిస్కులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇన్ని ఆధారాలు ఉన్నప్పటికీ, నిషిముర మాత్రం తన వాదనలు మరోలా వినిపిస్తున్నాడు.

ఇరుకైన ప్రదేశాల్లో తన ట్రక్కును సులువుగా పార్కింగ్ చేయడం కోసమే వాహనం నాలుగు వైపులా కెమెరాలు అమర్చానని చెబుతున్నాడు. అయితే ఆ కెమెరాలు వాహనానికి బాగా కింది భాగంలో ఉండడమే కాకుండా, వాటి లెన్సులు పైకి చూస్తున్నట్టుగా ఉండడం అనుమానాలకు తావిస్తోంది. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించిన విచారణ జరుగుతోంది.

Related posts

కార్గో విమానంలో బోను నుంచి తప్పించుకున్న గుర్రం.. హడలిపోయిన సిబ్బంది

Ram Narayana

చైనా ఓ టైం బాంబ్.. ఎప్పుడైనా పేలిపోవచ్చు: అమెరికా అధ్యక్షుడు బైడెన్

Ram Narayana

కిక్కిరిసి.. కుక్కేసినట్టు.. అక్కడ అంత మంది జనమా?

Ram Narayana

Leave a Comment