Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలురాజకీయ వార్తలు

భాదితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం …సీఎల్పీ నేత భట్టి …ప్రతిపక్షాలది కడుపు మంట మంత్రి పువ్వాడ …

భాదితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం …సీఎల్పీ నేత భట్టి …ప్రతిపక్షాలది కడుపు మంట మంత్రి పువ్వాడ …
కేసీఆర్ భద్రాచలంకు ప్రకటించిన 11 కోట్లకు దిక్కులేదు భట్టి
ప్రజలనే కాదు భద్రాద్రి రామయ్య ను కేసీఆర్ మోసం చేశారు భట్టి
బీఆర్ యస్ …కాంగ్రెస్ లమధ్య వరద వార్
వరద భాదితులకు సహాయం బేస్…ప్రతిపక్షలు కావాలనే రాద్దాతం మంత్రి పువ్వాడ …
ఖమ్మం బొక్కల గడ్డలో భట్టిని ప్రజలు రక్కేసి వెళ్లగొట్టారు ..
మాకు ప్రభుత్వం మంచి సహాయం అందిస్తుందని ముఖం మీదనే చెప్పారు
అక్కడ ఏమి లేదని భద్రాచలంకు పేలాలు వేరుకునేందుకు వచ్చారు
12 వేలమందిని పునరావాస కేంద్రాలకు తరలించాం
చర్లలో కూడా పునరావాస కేంద్రాల్లో మంచి భోజనం పెడుతున్నారు
ఎక్కడ సమస్యలు లేవు ..
ఏరియల్ సర్వే అనంతరం మీడియా తో పువ్వాడ …

అధికార బీఆర్ యస్ , ప్రతిపక్ష కాంగ్రెస్ లమధ్య వరద రాజకీయాలు మొదలైయ్యాయి. గత నాలుగైదు రోజులగా కురిసిన భారీ వర్షాలకు ఖమ్మంలోని మున్నేరు వాగు , భద్రాచలం వద్ద గోదావరికి భారీగా వరదలు వచ్చాయి. వరద భాదితులను ఆదుకునేందుకు అటు ప్రభుత్వం , ఇటు ప్రతిపక్షాలు సహాయం చేస్తున్నాయి.ఇంతవరకు బాగానే ఉన్న .ప్రజలను ఆదుకోవడంలో , వరదలను అంచనా వేసి అరికట్టడంలో ప్రభుత్వం ,అధికారులు ఘోరంగా విఫలమైయ్యారని విమర్శలు గుప్పిస్తున్నాయి,. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వరద రాజకీయాలు మొదలైయ్యాయి. ఒక పక్క సీఎల్పీ నేత భట్టి ,మరోపక్క కాంగ్రెస్ ప్రచార కమిటీ కో- చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికార పార్టీ వైఫల్యాల కారణంగానే వరదలకు నిత్యం ప్రజలు ఇబ్బందులు బడుతున్నారని ధ్వజమెత్తారు . కాంగ్రెస్ అధికారంలోకి రాగానే భద్రాచలంలో , ఖమ్మంలో వరదకు రాకుండా కరకట్టలు కట్టిస్తామని భరోసా ఇచ్చారు .

దీనిపై జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు …ప్రభుత్వం వరద భాదితులను అన్ని రకాలుగా ఆడుకుంటుంటే కడుపు నొప్పితో ప్రతిపక్షాలు రాద్దాతం చేస్తున్నాయని మండిపడ్డారు . అందుకే ఖమ్మంలోని బొగ్గలగడ్డ ప్రాంతంలో ప్రజలు భట్టి వెళ్ళినపుడు రక్కెరని , మాకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయం చేస్తుందని ఇక్కడకు రావద్దని మీరు వెళ్లండని ముఖం మీదనే చెప్పారని అక్కడ వారి మాటలు వినేవారు లేక పేలాలు వేరుకునేందుకు భద్రాచలం వచ్చారని దుయ్యబట్టారు …గోదావరి ముంపు ప్రాంతాలలో 12 వేల మంది ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి అన్న పానీయాలు , విద్యత్ సౌకర్యం , అందజేస్తున్నామని అన్నారు . తాను స్వయంగా చర్ల ఏరియల్ సర్వే కు వెళ్లానని అక్కడ దిగి పునరావాస కేంద్రానికి వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నానని చెప్పారు . వారికీ భోజనం కూడా వడ్డించానని ప్రజలు సంతృప్తిగా ఉండటం ఇష్టంలేక ప్రతిపక్షాలు అనవసరంగా మాట్లాడుతున్నాయని అన్నారు . మరో పక్క ఎంపీలు నామ నాగేశ్వరావు , వద్దిరాజు రవిచంద్ర లు వరద భాదిత ప్రాంతాల్లో పర్యటించారు . భాదితులకు ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని తెలిపారు .

ఖమ్మంలో వరద భాదితులకు సహాయం అందించిన మంత్రి ,ఎంపీలు

మున్నేరు వరద ముంపు బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. శనివారం నగరంలోని మున్నేరు ముంపు ప్రాంతాలైన వేంకటేశ్వరనగర్, పద్మావతినగర్, బొక్కల గడ్డ, మోతీనగర్ లోని వరద బాధితులకు పువ్వాడ ఫౌండేషన్ అధ్వర్యంలో సమకూర్చిన సమకూర్చిన నిత్యావసర సరుకులు, స్థానిక కార్పొరేటర్ తోట గోవిందమ్మ రామారావు అధ్వర్యంలో సమకూర్చిన 6 రకాల కూరగాయలను మంత్రి పువ్వాడ పంపిణీ చేశారు.
పువ్వాడ ఫౌండేషన్, మమత ఆసుపత్రి సంయుక్త అధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత హెల్త్ క్యాంపును మంత్రి ప్రారంభించి, ఉచిత మందులు పంపిణి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మునుపెన్నడూ లేని విధంగా మున్నేరు ఉధృతిని చూశామని, అయిన ఎక్కడ ఎలాంటి ప్రమాదం లేకుండా ప్రజలందరినీ కాపాడుకున్నామని అన్నారు. ఇంట్లో నష్టపోయిన వస్తువుల నష్టాన్ని భర్తీ చేసేందుకు తమవంతు సహకారం అందిస్తామని మంత్రి తెలిపారు. మున్నేరు కు రూ.147 కోట్లతో ఆర్సిసి వాల్ నిర్మించేందుకు ఇప్పటికే ప్రతిపాదనలు సిద్దం చేశామని, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళామని, త్వరలోనే వాల్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎంపిలు నామా నాగేశ్వర రావు, వద్దిరాజు రవిచంద్ర, నగర మేయర్ పునుకొల్లు నీరజ, జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, జిల్లా కలెక్టర్ వి పి గౌతమ్, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, డిసిసిబి చైర్మన్ కురాకుల నాగభూషణం, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ దోరేపల్లి శ్వేత, సుడా చైర్మన్ విజయ్ కుమార్, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులు నల్లమల్ల వెంకటేశ్వరరావు, మునిసిపల్ డిప్యూటీ కమీషనర్ మల్లేశ్వరి,
అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఖమ్మం రూరల్ లో వరద భాదితులకు ఎమ్మెల్యే కలెక్టర్ సహాయం అందజేత !

ముంపు బాధితులకు పునరావాస కేంద్రాల్లో భోజన, వసతితో పాటు అన్ని మౌళిక వసతుల కల్పన చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. శనివారం కలెక్టర్, పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి తో కలిసి ముంపు బాధితులకు రామ్ లీల ఫంక్షన్ హాల్లో ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రాన్ని తనిఖీ చేశారు. పునరావాస కేంద్రంలో అందుతున్న సేవల గురించి బాధితులను అడిగి తెలుసుకున్నారు. భోజనం, సురక్షిత త్రాగునీరు అందించాలన్నారు. కేంద్రం లోపల, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. టాయిలెట్లు శుభ్రంగా, రన్నింగ్ వాటర్ ఉండేట్లు చూడాలన్నారు. బాధితులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు.
అనంతరం కాల్వఒడ్డు వద్ద మున్నేరు వంతెన పైనుండి మున్నేరు ఉధృతిని పరిశీలించారు. గురువారం సాయంత్రం 5.00 గంటలకు రికార్డ్స్ స్థాయికి 30.70 ఫీట్లకు చేరిన మున్నేరు నెమ్మదిగా శాంతిస్తూ, శనివారం సాయంత్రం 6.00 గంటలకు 12.80 ఫీట్లకు చేరుకుందని వారు తెలిపారు.

ఈ సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, జడ్.పి. సి.ఇ.ఓ. వి వి అప్పారావు, జిల్లా ఉపాధికల్పనాధికారి శ్రీరామ్, ఏసీపీ బస్వా రెడ్డి, ఖమ్మం రూరల్ ఎంపిపి బెల్లం ఉమ, తహసీల్దార్ సుమ, ఎంపిడివో అశోక్, జెడ్పిటిసి వరప్రసాద్, స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మున్నేరు వరదల్లో మృతి చెందిన పెండ్ర సతీష్ కుటుంబానికి 4 లక్షల చెక్కు అందజేత …

మున్నేరు వరదల్లో మృతి చెందిన పెండ్ర సతీష్ కుటుంబానికి ప్రభుత్వం నుండి ఎక్స్ గ్రేషియాను జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్, పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డితో కలిసి శనివారం జలగం నగర్ లోని పెండ్ర సతీష్ ఇంటి వద్ద అందజేశారు. ప్రభుత్వం నుండి ఎక్స్ గ్రేషియ కు సంబంధించి రూ. 4 లక్షల చెక్కును వారు పెండ్ర సతీష్ భార్య కూడెల్లి శ్రుతి కి అందజేశారు. ఈ సందర్భంగా పెండ్ర సతీష్ మృతికి సంతాపం తెలుపుతూ, కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ధైర్యం తెలిపారు.
ఈ సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, జడ్.పి. సి.ఇ.ఓ. వి వి అప్పారావు, ఖమ్మం రూరల్ తహసీల్దార్ సుమ, ఎం.పి.డి.ఓ. అశోక్, ఎ సి పి బస్వా రెడ్డి, ఎం పి పి బెల్లం ఉమా, జడ్ పి టి సి వరప్రసాద్, బెల్లం వేణు,రెడ్యా నాయక్ స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

బీజేపీకి గాలి జనార్దన్ రెడ్డి గుడ్​బై.. కర్ణాటకలో కొత్త పార్టీ ప్రకటన!

Drukpadam

ఏపీలో బిల్లుల కోసం కాంట్రాక్టర్లు కోర్టుకు వెళ్లొద్దంటూ సర్కార్ రూల్…చంద్రబాబు ఫైర్…

Drukpadam

తుమ్మల ..రేగా సమావేశం ఆంతర్యం ఏమిటి ?

Drukpadam

Leave a Comment