- ఒకే వేదికపై మోదీ, శరద్ పవార్.. ఇవి ఎప్పటికీ గుర్తుండిపోయే క్షణాలన్న ప్రధాని
- పూణేలో తిలక్ స్మారక్ మందిర్ ట్రస్ట్ కార్యక్రమానికి హాజరైన మోదీ, పవార్
- లోకమాన్య తిలక్ జాతీయ పురస్కారాన్ని స్వీకరించిన ప్రధాని
- పవార్ ను ఆప్యాయంగా పలకరించిన మోదీ
రాజకీయాల్లో కొన్ని ఆసక్తికర విషయాలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. ఈరోజు అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. ప్రధాని మోదీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ లు ఒకే వేదికను పంచుకున్నారు. మహారాష్ట్రలోని పూణేలో తిలక్ స్మారక్ మందిర్ ట్రస్ట్ నిర్వహించిన కార్యక్రమానికి వీరిద్దరూ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో లోకమాన్య తిలక్ జాతీయ పురస్కారాన్ని మోదీ స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శరద్ పవార్ ను మోదీ ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ ఇవి తనకు గుర్తుండిపోయే క్షణాలని చెప్పారు.
ఇండియా కూటమి మూడో సమావేశం త్వరలో ముంబైలో జరగబోతున్న తరుణంలో ప్రధానితో వేదికను పంచుకోవడం సరికాదని కొందరు నేతలు చెప్పినప్పటికీ శరద్ పవార్ పట్టించుకోలేదు. లోక్ సభలో మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో బీజేపీ పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన శరద్ పవార్, మోదీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెళ్లడం వారికి మింగుడు పడటం లేదు.