Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

ఉప్పల్ టీఆర్ యస్ ఎమ్మెల్యేపై భూకబ్జా ఆరోపణలు … ఖండించిన ఎమ్మెల్యే…

ఉప్పల్ టీఆర్ యస్ ఎమ్మెల్యేపై భూకబ్జా ఆరోపణలు … ఖండించిన ఎమ్మెల్యే…
-తనకు భూకబ్జాకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటన
– పరువు నష్టం దావా వేస్తానని ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి హెచ్చరిక
-తనపై ఆరోపణలు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్దమే
-మేకల శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యేపై కేసు నమోదు

టీఆర్ యస్ పార్టీలో భూకబ్జాలు వ్యవహారం పై ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కొత్తగా టీఆర్ యస్ కే చెందిన ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. ఆయనపైనే , కాప్రా ఎం ఆర్ ఓ పైన ఆరోపణలతో కేసుకూడా నమోదు అయింది అయితే తనపై వచ్చిన ఆరోపణలను ఎమ్మెల్యే తీవ్రంగా ఖండించారు.
మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా పరిధిలోని కాప్రాలో భూకబ్జా ఆరోపణలపై ఉప్ప‌ల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి స్పందించారు. క‌బ్జాకు గురైన భూమికి, త‌న‌కు ఎలాంటి సంబంధం లేద‌ని స్ప‌ష్టం చేశారు. తప్పుడు ఆరోపణలతో త‌న‌పై బుర‌ద‌జ‌ల్లే ప్ర‌య‌త్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.తనపై వచ్చిన ఆరోపణలు నిరూపిస్తే శిక్షకు తాను సిద్దమేనని ప్రకటించారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసినవారిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించి పరువు నష్టం దావా వేస్తానని తెలిపారు. కాప్రాలో భూక‌బ్జాదారుల‌పై పోలీసులు ఇప్ప‌టికే కేసు న‌మోదు చేసినట్లు తెలిపారు. ప్ర‌భుత్వ భూమి క‌బ్జా అవుతుంద‌ని స్థానికులు త‌హ‌సీల్దార్‌కు ఫిర్యాదు చేశారని.. దీంతో రెవెన్యూ అధికారులు అక్కడికి వెళ్లగా వారిపై కొంతమంది దాడికి ప్రయత్నించారని చెప్పారు. కేసులు నమోదైనవారే తమపై కేసుల నమోదుకు పోలీసులకు ఫిర్యాదు చేశారని చెప్పారు. పోలీసుల విచారణలో అసలు నిజాలు బయటపడుతాయని పేర్కొన్నారు. ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డితో పాటు కాప్రా ఎమ్మార్వో గౌతమ్ కుమార్‌పై సోమవారం(మే 24) జవహర్ నగర్ పోలీసులు 120 ఏ,166,167,168,170,171,447,468 తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. కాప్రాలో సర్వే నెంబర్ 152లోని 90 ఎకరాల భూ వివాదంలో సుభాష్ రెడ్డి తలదూర్చారన్న ఆరోపణల మేరకు వీరిపై కేసు నమోదైంది. ఎమ్మెల్యే తమ నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నాడని… తమకు చెందిన భూమిని అక్రమంగా ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారని మేకల శ్రీనివాస్ యాదవ్ అనే వ్యక్తి కోర్టుకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. దీంతో కోర్టు ఆదేశాల మేరకే ఎమ్మెల్యేపై కేసు నమోదైనట్లు సమాచారం. ఇటీవలి కాలంలో తెలంగాణలో భూ వివాదాలు హాట్ టాపిక్‌గా మారాయి. ఇదే నెలలో మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై భూకబ్జా ఆరోపణలు రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలో పౌల్ట్రీ విస్తరణ కోసం అసైన్డ్ భూములను ఆక్రమించారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణ జరిపిన అధికార యంత్రాంగం ఆరోపణలు నిజమేనని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నివేదిక ఇచ్చాయి. దీంతో ఈటలను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశారు. ఈటల రాజేందర్ కుమారుడు నితిన్ రెడ్డిపై కూడా భూకబ్జా ఆరోపణలు వచ్చాయి. మేడ్చల్ మండలం రావల్‌కోల్ గ్రామంలోని సర్వే నంబర్‌ 77లో 10 ఎకరాల భూమిని నితిన్ రెడ్డి కబ్జా చేశారని సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదులు అందాయి. మహేశ్ అనే రావల్‌కోసి వాసి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ వ్యవహారంపై ఏసీబీ,విజిలెన్స్‌తో విచారణకు సీఎం కేసీఆర్ ఆదేశించారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాలని కోరారు .

Related posts

ఢిల్లీలో టీనేజి అమ్మాయిని దారుణంగా చంపిన ప్రేమికుడు…

Drukpadam

రూ.200 కోట్ల హెర్బల్ ప్రొడక్ట్స్ స్కామ్ వివరాలు వెల్లడించిన హైదరాబాద్ సీపీ..!

Drukpadam

సల్మాన్ ఖాన్ నివాసం వెలుపల కాల్పులు జరిపిన షూటర్ల అరెస్ట్…

Ram Narayana

Leave a Comment