Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

సీలేరు నది విషాదం పడవలు బోల్తా 8 మంది వలస కూలీల గల్లంతు…

సీలేరు నది విషాదం పడవలు బోల్తా 8 మంది వలస కూలీల గల్లంతు…
లభ్యమైన ఆరు మృతదేహాలు ఇద్దరికోసమే గాలింపు
-ఒడిశాలోని కొందుగుడాలో విషాద ఛాయలు

సీలేరు నదిలో నాటుపడవలు మునిగి ఎనిమిది మంది గల్లంతయ్యారు. వీరిలో ఇద్దరు చిన్నారులతోపాటు ఆరుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. చీకటి పడటంతో గాలింపు చర్యలను సిబ్బంది నిలిపివేశారు. మిగిలిన ఇద్దరి ఆచూకీ కోసం బుధవారం గాలింపు చేపట్టనున్నారు. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా గుంటవాడ పంచాయతీ కోందుగూడా గ్రామానికి చెందిన సుమారు 11 మంది పనుల నిమిత్తం వలసకూలీలుగా హైదరాబాద్‌కు వెళ్లారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇటీవల తెలంగాణలో లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. దీంతో గిరిజనులు స్వగ్రామాలకు బయల్దేరారు.సోమవారం రాత్రికి సీలేరుకు చేరుకున్న గిరిజనులు తెలంగాణ రాష్ట్రం నుంచి రావడంతో ఎవరైనా అడ్డుకుంటారేమోననే భయంతో సీలేరు శివారు చెక్ పోస్టు వద్దకు చేరుకుని, అర్ధరాత్రి వరకు అక్కడే ఉండి చెక్ పోస్టు వెనుక నుంచి టేకు తోటల మీదుగా సీలేరు నది వద్దకు చేరుకున్నారు. అప్పటికే వారి గ్రామస్తులకు విషయం తెలియజేయడంతో వీరి ప్రయాణం కోసం రెండు నాటుపడవలను సిద్ధం చేసి ఉంచారు. రెండు నాటు పడవల మీద 11 మంది బయల్దేరారు. కాగా, నది మధ్యలోకి వెళ్లేసరికి ముందు వెళ్తున్న నాటు పడవ అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో రెండో నాటుపడవలో ఉన్నవారు నదిలో పడినవారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్న క్రమంోల రెండో పడవ కూడా మునిగిపోయింది. దీంతో రెండు పడవల్లోని 11 మంది నదిలో మునిగారు. వారిలో ముగ్గురు ఈత కొట్టుకుంటూ ఒడ్డుకు చేరుకుని గ్రామానికి వెళ్లి విషయం తెలియజేశారు. సమాచారం అందుకున్న అధికారులు, అగ్నిమాపక సిబ్బంది, సహాయక దళాలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంగళవారం ఉదయం చిన్నారులు అభి(2), గాయత్రి(4), అనూష(23) మృతదేహాలతో మరో ముగ్గురి మృతదేహాలను వెలికితీశారు. మరో ఇద్దరి కోసం బుధవారం ఉదయం గాలింపు చేపట్టనున్నారు. మృతుల బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Related posts

సాయం కోసం పోలీసులకు ఫోన్ చేస్తే.. వచ్చి కాల్చి చంపారు

Ram Narayana

వాజేడు ఎస్ఐ హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్…

Ram Narayana

బస్సులో యువతిపై లైంగికదాడి.. దుమ్మెత్తి పోస్తున్న ప్రతిపక్షాలు!

Ram Narayana

Leave a Comment