కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తున్న శాసనసభ …సింహగర్జన చేస్తున్న భట్టి ..
భట్టికి తోడుగా శ్రీధర్ బాబు …సీతక్క
శాసనసభ వేదికగా ప్రజాసమస్యలపై భట్టి వాణి గట్టిగానే ఉంది …
అధికార పార్టీ సభ్యులు 100 మందికి పైగానే ..పాండవుల్లా ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
చిన్నపాటి వర్షాలకే డ్రైన్లు పొంగిపొర్లు తున్నాయి ..హైద్రాబాద్ ప్రజలు ఇబ్బందులు తొలగించాలి ..
పట్టణ పల్లె ప్రగతిపై ప్రభుత్వాన్ని నిలదీసిన భట్టి
క్రీడాప్రాంగణాలపై సైటర్లు ..
పథకాలు గొప్పగా పెట్టడం కాదు. వాటిని పూర్తి చేయడానికి సరిపడా నిధులు ఇవ్వాలని డిమాండ్ …
ఈసారి శాసనసభ సమావేశాలు మూడు లేదా నాలుగురోజులే అయినప్పటికీ ప్రత్యేకతను సంతరించుకున్నాయి. చర్చలు వాడివేడిగా జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి సంఖ్యరీత్యా సభ్యులు పంచపాండవుల్లాగా ఐదుగురే అయినప్పటికీ పదునైన మాటలు మెటీరియల్ ఆవిడన్స్ తో 100 మందికి పైగా ఉన్న పలకపక్షాన్ని నిలదీస్తున్న తీరు ఆలోచింపజేసిందిగా ఉంది…ప్రత్యేకించి సీఎల్పీ నేత భట్టి తనపాదయాత్ర తర్వాత మరింత రాటుదేలారు …రాష్ట్రంలో ఉన్న సమస్యలపై తనదైన శైలిలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టె ప్రయత్నం చేస్తున్నారు. ఆయనకు తోడు ఈసారి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ,సీతక్కలు తమ వాడి వేడి ప్రసంగాలతో పాలక పక్షాన్ని కడిగి పారేస్తున్నారు. సహజంగానే ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీ వారు చేపట్టిన అనేక సమస్యలపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని సభలో చర్చకు వచ్చినప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతుంది…ఈ చర్చల్లో మంత్రులు కేటీఆర్ , హరీష్ రావు ల పాత్ర ప్రధానంగా ఉంటుంది…ప్రతిపక్షాలకు దీటుగా సమాధానం చెప్పేందుకు వారు చేస్తున్న ప్రయత్నాలు చెప్పుకోదగ్గవే ..
రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు జరిగిన నష్టం పై శ్రీధర్ బాబు , సీతక్క ప్రభువాన్ని ఉక్కిరి బిక్కిరి చేశారు .మద్యమద్యలో భట్టి సైతం వారికీ అండగా మంత్రుల దాడులను తిప్పికొట్టే ప్రయత్నం చేయడం ఫ్లోర్ కోఆర్డినేషన్ ను చూషిస్తుంది … కాంగ్రెస్ పార్టీ చివరి సమావేశాలుగా చెప్పబడుతున్న సమావేశాల్లో వ్యవహరించినతీరు ఆ పార్టీకి మంచి మైలేజి తెచ్చిపెట్టాయనే చెప్పవచ్చు
గ్రామ పంచాయతీలో చేసిన అభివృద్ధి పనులకు నిధులు ఇవ్వకపోవడంతో చాలా చోట్ల సర్పంచులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని భట్టి సభకు దృష్టికి తెచ్చారు ..సర్పంచుల్లో చాలామంది బడుగు బలహీన వర్గాలు దళితులు గిరిజనులు ఉన్నందున వారిని ఇబ్బందులు పెట్టకుండా వారు చేసిన పనులకు వెంటనే ప్రభుత్వం నిధులు విడుదల చేసి వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు .
రాష్ట్రంలోని అనేక గ్రామపంచాయతీలో ట్రాక్టర్లకు ఈఎంఐ కిస్తులు కట్టలేక డీజిల్ సమకూర్చలేక చాలామంది సర్పంచులు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న విషయాన్నీ గుర్తు చేశారు …
ఏకగ్రీవంగా ఎన్నికైన గ్రామ పంచాయతీలకు ప్రోత్సాహకాలు ఇవ్వకపోవడంతో సర్పంచులు నిధులు వస్తాయన్న ఆశతో అభివృద్ధి పనులు చేసి కాళ్ళు అరిగేలా ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నరని భట్టి ఆవేదన వ్యక్తం చేశారు .
హైదరాబాదు ను ఇస్తాంబుల్ , డల్లాస్ లాగా మార్చమని చెప్పడంపై భట్టి అభ్యంతరం వ్యక్తం చేశారు .హైదరాబాదును అభివృద్ధి చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే అని అన్నారు .హైదరాబాదులో రెండు లక్షల డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టామని చెప్పినప్పుడు చూపించాలని కోరగా నా వెంట వచ్చి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కేవలం 30 వేల ఇండ్లు మాత్రమే చూపించారని గుర్తు చేశారు .
మెరుగైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వల్ల హైదరాబాదులో చినుకు పడితే గంటల కొలది ట్రాఫిక్ నిలిచిపోతున్నది ఇది ఒక్క హైద్రాబాద్ లోనే కాదని వరంగల్ లో కూడా చూశామని అన్ని నగరాల్లో డ్రానైజ్ సిస్టం మెరుగు పర్చాలని అన్నారు .
కోకాపేటలో ఎకరం 100 కోట్ల రూపాయలకు ఊరికే అమ్ముడుపోలే.. గత కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఇంటర్నేషనల్ కంపెనీలను తీసుకురావడం వల్లనే భూములకు డిమాండ్ పెరిగిందన్నారు
ప్రజలకు ఉపయోగపడాలని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఔటర్ రింగ్ రోడ్డును 30 సంవత్సరాల పాటు లీజుకు ఒక ప్రైవేటు కంపెనీకి ఎలా ఇస్తారని భట్టి ప్రశ్నించారు .ఒకేసారి పన్నులు, లీజులు సేకరించి ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టిన తర్వాత భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వాలు ఎలా అభివృద్ధి చేస్తాయి? ఇది ఎక్కడి న్యాయం?.అన్నారు. రెండు లక్షల కోట్లకు పైగా ప్రభుత్వానికి ఆదాయం వచ్చేటువంటి ఔటర్ రింగ్ రోడ్డును 7వేల కోట్ల రూపాయలకు లీజుకు ఎలా ఇస్తారన్నారు ..దీనిపై సమగ్ర సమాచారాన్ని సభకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు .
ఔటర్ రింగ్ రోడ్ హైదరాబాదుకు మణిహారం.
భవిష్యత్తులో ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ మరిన్ని పరిశ్రమలు, సాఫ్ట్ వెర్
కంపెనీలు, కొత్తగామరిన్ని కాలనీలు వచ్చే అవకాశం ఉందని అన్నారు .
ఔటర్ రింగ్ రోడ్డు పరిసర ప్రాంతాల అభివృద్ధి చెందడం వల్ల భవిష్యత్తులో ప్రభుత్వానికి ఆదాయం పెరిగే అవకాశం ఉన్నందున ప్రభుత్వ పరిధిలోనే ఔటర్ రింగ్ రోడ్డును ఉంచుకోవాలన్నారు
మధిర మున్సిపాలిటీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి ఏర్పాటుకు తగిన నిధులు ఇవ్వాలని గత అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం జరిగింది. మున్సిపల్ శాఖ మంత్రి ని వ్యక్తిగతంగా కలిసి వినతి పత్రం ఇచ్చాము. పరిశీలించి నిధులు ఇవ్వాలని భట్టి కోరారు …
పేరుకే క్రీడా ప్రాంగణాలు …వాటిలో ఆడేదెట్ల …?
తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణాలు గ్రామాల్లో ఇష్టమొచ్చిన చోట్ల నిర్మిస్తే ప్రజలకు ఎలా ఉపయోగపడతాయని అసెంబ్లీ సాక్షిగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రభుత్వాన్ని నిలదీశారు ..కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం అంకుషాపూర్ గ్రామంలో నీటి కుంటలో ఏర్పాటుచేసిన క్రీడా ప్రాంగణం బోర్డు ఉన్న ప్రదేశాన్ని ఫోటోతో సహా అసెంబ్లీలో చూపించారు…పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం మారేడుగొండ గ్రామంలో ఏర్పాటుచేసిన క్రీడా ప్రాంగణంలో ఉన్న చెట్లను చూపించి ఇది కూడా క్రీడా ప్రాంగణమేనా అని ప్రశ్నించారు….పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్ మండలం ఇప్పలపల్లి గ్రామంలో వైకుంఠధామం వర్మీ కంపోస్ట్ యార్డు పక్కన ఏర్పాటుచేసిన క్రీడా ప్రాంగణం లో క్రీడాకారులు ఎలా ఆడతారని వేసిన ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి సరైన సమాధానం రాకపోవడం దురద్రష్టకరమన్నారు . ఇది క్రీడలపట్ల వారి చిట్టా శుద్ధిని తెలియజేస్తున్నదని భట్టి ప్రభుత్వ విధానాలను దుయ్యబట్టారు ..