Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
పార్లమంట్ న్యూస్ ...

లోకసభలో ప్రభుత్వంపై వాడివేడిగా చర్చ ..సభలో గందరగోళం ..

అవిశ్వాస తీర్మానంపై చర్చ ప్రారంభం.. ఏయే పార్టీకి ఎంత సమయం కేటాయించారంట

  • చర్చను ప్రారంభించిన కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్
  • మొత్తం చర్చకు 16 గంటల సమయం కేటాయింపు
  • వైసీపీకి 29 నిమిషాలు, బీఆర్ఎస్ కు 12 నిమిషాలు మాట్లాడే అవకాశం

లోకసభలో కేంద్ర ప్రభుత్వం అవిశ్వాసంపై చర్చ…సభలో గందరగోళం

చర్చను కాంగ్రెస్ కు చెందిన గౌరవ్ గొగోయ్ ప్రారంభించగా బీజేపీ సభ్యులు అభ్యంతరం చెప్పారు . రాహుల్ గాంధీ చర్చను ప్రారంభిస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగిందని స్పీకర్ కార్యాలయానికి కూడా అదే సమాచారం ఉందని ఒక్కసారిగా ఎందుకు మార్చుకున్నారని బీజేపీ సభ్యులు ఒక్కసారిగా లేచి అభ్యంతరం చెప్పారు . చివరకు హోమ్ మంత్రి అమిత్ షా , పార్లమెంటరీ వ్యవహార మంత్రి సైతం లేచి నిలబడి రాహుల్ చర్చను ఎందుకు ప్రారంబించడంలేదో చెప్పాలని నిలదీశారు . దానికి కాంగ్రెస్ సభ్యులు సైతం గట్టిగానే కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు .తొలుత చర్చను ప్రారంభించిన గౌరవ్ గొగోయ్ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వంపై విరుచుక పడ్డారు . మణిపూర్ అల్లర్లపై ప్రధాని మోడీ ఎందుకు మౌనం విడటంలేదని , పార్లమెంట్ లో ఎందుకు ప్రకటన చేయడంలేదని ప్రశ్నించారు . గతంలో ఏ ప్రభుత్వం ఉన్న శాంతి భద్రతలకు తీసుకున్న చర్యలను వివరించారు . తర్వాత బీజేపీ ఎంపీ దూబే ఆపార్టీ తరుపున చర్చను ప్రారంభించారు . ఈ సందర్భంగా కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు ..ఆయన ప్రసంగాన్ని కాంగ్రెస్ సభ్యులు అడ్డుకునే ప్రయత్నం చేశారు ..

మోదీ ప్రభుత్వంపై విపక్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై లోక్ సభలో చర్చ ప్రారంభమయింది. కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ చర్చను ప్రారంభించారు. సభలో సంఖ్యాబలం లేదనే విషయం తమకు తెలుసని… అయినా అవిశ్వాస తీర్మానం తీసుకురావాల్సిన పరిస్థితిని తమకు కల్పించారని విమర్శించారు. మణిపూర్ హింస నేపథ్యంలో ఇండియా కూటమి ఈ తీర్మానాన్ని తీసుకొచ్చిందని చెప్పారు. మణిపూర్ కు న్యాయం జరగాలని ఆయన డిమాండ్ చేశారు. 

మరోవైపు అవిశ్వాసంపై చర్చకు మొత్తం 16 గంటల సమయాన్ని స్పీకర్ ఓం బిర్లా కేటాయించారు. ఇందులో బీజేపీకి 6 గంటల 41 నిమిషాలు,  కాంగ్రెస్ కు 1 గంట 9 నిమిషాలు, వైసీపీకి 29 నిమిషాలు, బీఆర్ఎస్ కు 12 నిమిషాలు, డీఎంకేకు 30 నిమిషాలు, తృణమూల్ కు 30 నిమిషాలను కేటాయించారు. 

Related posts

ఇప్పుడు లోక్‌సభ సమావేశాలకు రాహుల్ హాజరుకావచ్చా?

Ram Narayana

పదేళ్ల ఎన్డీఏ పాలన పూర్తి.. మరో 20 ఏళ్ల పాలన మిగిలే ఉందన్న మోదీ…

Ram Narayana

మోడీ ప్రభుత్వంపై వీగిపోయిన అవిశ్వాసం …

Ram Narayana

Leave a Comment