Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఏపీ రాజకీయాల్లో చిరంజీవి మాటల దుమారం ..!

రాజకీయ దుమారం లేపిన మంత్రి రాంబాబు డ్యాన్స్
… చిరంజీవి మాటల దుమారం ..!

ప్రత్యేక హోదా గురించి ఆలోచించండి.. సినిమా ఇండస్ట్రీపై పడతారేంటి?: చిరంజీవి ఘాటు విమర్శలు

ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్న చిరంజీవి కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నిస్తున్న వైసీపీ నేతలు

  • పేదల కడుపు నింపే పథకాలపై దృష్టి పెట్టాలన్న చిరంజీవి
  • రోడ్లు, ప్రాజెక్టులు, ఉద్యోగాల గురించి ఆలోచించాలని హితవు
  • అలా చేస్తే అందరూ మీకు తలవంచి నమస్కరిస్తారని వ్యాఖ్య
  • పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా సినీ ఇండస్ట్రీపై పడతారేంటని మండిపాటు

మంత్రి రాంబాబు డ్యాన్స్…బ్రో సినిమాలో ఇమిటేట్ చిరంజీవి మాటల దుమారం ..!ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ మారాయి. అంబటి రాంబాబు తన నియోజకవర్గంలో ప్రజలతో కలిసి ఒక పండగ సందర్భంగా డ్యాన్స్ వేశారు . దాన్ని పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలో అలంటి సీన్ ను యధాతధంగా పెట్టారు . దీంతో రాంబాబు తీవ్రంగానే స్పందించారు . పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ పై స్పదించారు . సినీ నిర్మాత పై విమర్శలు గుప్పించారు . దీంతో ఇది కాస్త రాజకీయ దుమారంగా మారిపోయింది. పవన్ కళ్యాణ్ , ఆ సినిమా బృందం మధ్య మాటల యుద్ధం కొనసాగుతుండగా ఒక సినిమా ఫంక్షన్ లో పాల్గొన్న చిరంజీవి మాట్లాడుతూ ఏకంగా వైసీపీ ప్రభుత్వంపైనే టార్గెట్ చేశారు. ప్రత్యేకహోదా , రోడ్లు , ఇతర అభివృద్ధి కార్యక్రమాలపై ద్రుష్టి పెట్టాలని చురకలు అంటించారు . దీంతో వైసీపీకి చెందిన పేర్ని నాని , కొడాలి నాని , అంబటి రాంబాబు , నందిగం సురేష్ , బొత్స సత్యనారాయణ తదితరులు చిరంజీవి మాటలపై ఘాటుగానే స్పందించారు . అవి వారి మాటల్లోనే చూద్దాం …

రాజకీయాలపై మెగాస్టార్ చిరంజీవి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘మీ లాంటి వాళ్లు’ అంటూ పరోక్షంగా ఏపీ ప్రభుత్వానికి చురకలంటించారు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంగా సినీ పరిశ్రమపై పడ్డారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల కడుపు నింపే పథకాలపై దృష్టి పెట్టాలని హితవుపలికారు. వాల్తేరు వీరయ్య 200 రోజుల వేడుకలో ఈ వ్యాఖ్యలు చేశారు

‘‘మీ లాంటి వాళ్లు ప్రత్యేక హోదా గురించి, రోడ్ల నిర్మాణం గురించి, ప్రాజెక్టులు, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల గురించి ఆలోచించాలి. పేద వారి కడుపు నింపే దిశగా ఆలోచించాలి. అలా చేస్తే అందరూ మీకు తలవంచి నమస్కరిస్తారు. అంతేకానీ పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా సినీ ఇండస్ట్రీపై పడతారేంటి?” అని మండిపడ్డారు.

2014 తర్వాతి నుంచి కేవలం సినిమాలకు మాత్రమే చిరంజీవి పరిమితమయ్యారు. రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ఇటీవల ‘బ్రో’ సినిమా విషయంలో జరిగిన పలు ఘటనల నేపథ్యంలోనే చిరంజీవి ఇలా స్పందించినట్లుగా చర్చ జరుగుతోంది.

పకోడీగాళ్లు సలహాలిస్తున్నారు.. చిరంజీవికి కొడాలి నాని కౌంటర్

ex minister kodali nani respond on mega star chiranjeevi comments

ఏపీ ప్రభుత్వంపై మెగాస్టార్ చిరంజీవి చేసిన పరోక్ష విమర్శలపై వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని తీవ్రంగా మండిపడ్డారు. ప్రభుత్వం ఎలా ఉండాలో సినిమా ఇండస్ట్రీలో చాలా మంది పకోడీగాళ్లు సలహాలిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘మనకెందుకురా బాబు.. మన డ్యాన్సులు, ఫైట్లు మనం చేసుకుందాం’ అని తమ వాళ్లకు కూడా సలహాలివ్వాలని ఎద్దేవా చేశారు. చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించడంతో ఆయన మండిపడ్డారు.

మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్‌ కల్యాణ్‌పైనా కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘ఈ రాష్ట్రాన్ని ఎక్కువ కాలం నడిపింది చంద్రబాబే. ఆ రోజు ప్రాజెక్టులు ఎందుకు పూర్తిచేయలేదో చెప్పాలి. తెలంగాణలో మహబూబ్‌నగర్‌‌ను దత్తత తీసుకుంటానని చెప్పి ఎందుకు గాలికొదిలేశారు?” అని ప్రశ్నించారు.  

చంద్రబాబు ఒక 420 అంటూ కొడాలి నాని తీవ్రంగా విమర్శించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరు చెబితేనే చంద్రబాబు భయపడిపోతున్నారని అన్నారు. బయటి జిల్లాల నుంచి జనాన్ని తీసుకొచ్చి పుంగనూరులో చంద్రబాబు గొడవ చేయించారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో కుప్పంలో ఓడిపోతారని జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికలే ఆయనకు చివరివని అన్నారు. 

జనసేనపై కొడాలి నాని సెటైర్లు వేశారు. ‘‘జనసేన ఓ కామెడీ పార్టీ. అది జనసున్నా పార్టీ. పవన్ కల్యాణ్ రెండు చోట్ల పోటీ చేసి.. నాలుగు చోట్ల ఓడిపోగలరు. చంద్రబాబుకు సేవ చేయడానికే పవన్ పార్టీ పెట్టారు” అని అన్నారు.

చిరంజీవి గారూ.. మొదలు పెట్టిందే మీ తమ్ముడు: నందిగం సురేశ్

Nandigam Suresh response to Chiranjeevi comments

ఏపీ ప్రభుత్వంపై మెగాస్టార్ చిరంజీవి చేసిన విమర్శలు దుమారం రేపుతున్నాయి. రాష్ట్ర అభివృద్ధిని చూసుకోవాలని, సినీ పరిశ్రమ గురించి ఎందుకని చిరంజీవి విమర్శించారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా చిరంజీవికి కౌంటర్ ఇస్తున్నారు. వైసీపీ ఎంపీ నందిగం సురేశ్ స్పందిస్తూ… ‘చిరంజీవి గారు తొలుత మొదలు పెట్టిందే మీ తమ్ముడు’ అని ట్వీట్ చేశారు. బురద రాజకీయాలు చేయవద్దని మీ తమ్ముడికి చెప్పాలని అన్నారు. నోరు అదుపులో పెట్టుకోవాలని పవన్ కు చెప్పాలని… రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఎలా తీసుకురావాలో మేం చూసుకుంటామని చెప్పారు.

చిరంజీవి కేంద్రమంత్రిగా ఉన్నప్పుడే రాష్ట్రానికి అన్యాయం జరిగింది.. ఆయన అభిమానిగా చెబుతున్నా: పేర్ని నాని

  • రాజకీయాల్లో దాడి చేస్తే ఎదురుదాడి ఉంటుందన్న పేర్ని నాని  
  • ఫిలిమ్ నగర్ నుండి ఏపీ సచివాలయం ఎంత దూరమో.. ఇక్కడి నుండి అక్కడికీ అంతే దూరమని ఎద్దేవా 
  • రెమ్యునరేషన్ గురించి ఎక్కడ వచ్చిందో తెలుసా? అని ప్రశ్న
  • ఒక రాజకీయ నాయకుడిపై కక్ష తీర్చుకునే ప్రయత్నం చేశారని ఆగ్రహం 
  • చిరంజీవి కాంగ్రెస్‌లో ఉన్నప్పుడే హోదాను చట్టంలో పెట్టలేదని వెల్లడి
  • అప్పుడు ఆయన ఏం చేశారని ప్రశ్నించిన నాని
Perni Nani lashs out at Chiranjeevi for his comments

మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి పేర్ని నాని ఘాటుగా స్పందించారు. తాను చిరంజీవి అభిమానిగా చెబుతున్నానంటూ చురకలు అంటించారు. పేర్ని మాట్లాడుతూ.. తాను మెగాస్టార్‌కు అభిమానినని అన్నారు. సినిమాను సినిమాగా.. రాజకీయాలను రాజకీయంగా చూడాలని హితవు పలికారు. రాజకీయాల్లో దాడి చేస్తే ఎదురుదాడి ఖాయమన్నారు. దృతరాష్ట్రుడికి తన కుమారులపై ప్రేమ ఉంటే ఎలా నష్టం జరిగిందో.. అలాంటి ప్రేమ ఉంటే ఇప్పుడూ నష్టం జరుగుతుందన్నారు. హైదరాబాద్ ఫిలిమ్ నగర్ నుండి ఏపీ సచివాలయానికి ఎంత దూరమో.. ఏపీ సచివాలయం నుండి హైదరాబాద్ ఫిలిమ్ నగర్ అంతే దూరమని గుర్తుంచుకోవాలన్నారు.

అసలు రెమ్యునరేషన్ గురించి చర్చ ఎక్కడ వచ్చింది? ఎందుకు వచ్చిందో తెలుసా? అని ప్రశ్నించారు. కథకు సంబంధం లేకుండా సినిమాలో మీ దురద తీర్చుకోవాలనుకున్నప్పుడు అదే తరహా ఎదురు దాడి జరిగిందని.. దాడి జరిగినప్పుడు ఎదురు దాడి సహజమేనని అన్నారు. ఒక రాజకీయ నాయకుడు సంక్రాంతి పండుగ సందర్భంగా డ్యాన్స్ చేస్తే, దానిని పోలిన పాత్ర సినిమాలో పెట్టి, ఒక రాజకీయ నాయకుడిపై కక్ష తీర్చుకునే ప్రయత్నం చేశారన్నారు. అలాంటి సమయంలో రెమ్యునరేషన్ గురించి చర్చ వచ్చిందన్నారు.

మా అభిమాన నటుడు, మా అభిమాన హీరో అయిన చిరంజీవి రెమ్యునరేషన్ గురించి కనుక మాట్లాడితే ఆయన అభిమానిగా.. రాజకీయ నాయకుడైన అభిమానిగా ఇదే నా సమాధానం అన్నారు. చిరంజీవి, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, మహేశ్ బాబు రెమ్యునరేషన్ గురించి ఎవరైనా అడిగారా? అని ప్రశ్నించారు. ‘న్యూటన్ లా’ ఇదేనని.. దాడి చేస్తే ఎదురు దాడి ఉంటుందన్నారు. అయితే నిజంగా చిరంజీవి ఈ వ్యాఖ్యలు చేశారా? అని మీడియాను నాని ప్రశ్నించారు.

రాష్ట్ర విభజన జరిగినప్పుడు చిరంజీవి ఏ పార్టీలో ఉన్నారని నిలదీశారు. ఆయన కేంద్రమంత్రిగా ఉన్నప్పుడే ఏపీకి అన్యాయం జరిగిందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాపై హామీ ఇచ్చారని, కానీ దానిని చట్టం చేయలేదని గుర్తు చేశారు. అప్పుడు రాష్ట్రానికి అన్యాయం జరిగినప్పుడు చిరంజీవి ఎందుకు మాట్లాడలేదో చెప్పాలన్నారు. ప్రత్యేక హోదా చట్టంలో పెట్టకుండానే విభజన చేశారన్నారు. అప్పుడు చట్టంలో పెట్టనప్పుడు నా హీరో ఎక్కడ ఉన్నారో తెలిసిందే అన్నారు. చిరంజీవికి తాను వ్యక్తిగతంగా అభిమానిని అని నాని చెప్పారు.

మంత్రి బొత్స మాట్లాడుతూ సినిమా అంటే పిచుక అని చిరంజీవి ఒప్పుకుంటున్నారా…? ఆ విషయాలు తన తమ్ముడికి చెప్పాలి …ఇష్టం మొచ్చినట్లు మాట్లాడవద్దని సలహా ఇవ్వాలి , మేము ఎవరినైనా ఏదైనా అంటాం … అంటే కుదురుతుందా …అని అన్నారు …

Related posts

ఏకంగా 70 కిలోమీటర్లు బైక్ పై ప్రయాణించిన కిషన్ రెడ్డి…

Drukpadam

ఓ తలకు మాసినోడు వచ్చి తడిగుడ్డలతో ప్రమాణం చేస్తావా అంటాడు!: చండూరులో కేసీఆర్

Drukpadam

అమ‌రావ‌తి మాస్టర్ ప్లాన్ అక్రమాల కేసులో.. మాజీ మంత్రి నారాయ‌ణ‌కు ముంద‌స్తు బెయిల్‌!

Drukpadam

Leave a Comment