Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కేసీఆర్.. మీది గుండెనా..బండనా.?: షర్మిల …

కేసీఆర్.. మీది గుండెనా..బండనా.?: షర్మిల తీవ్ర వ్యాఖ్యలు…
-గతంలో సెలెక్ట్ అయిన నర్సులకు పోస్టింగులు ఇవ్వకపోవడం పై మండిపాటు
-కేసీఆర్ ను కలిసేందుకు వెళ్లిన స్టాఫ్ నర్సులను అరెస్ట్ చేయించడం దారుణం
-కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై వైయస్ షర్మిల తీవ్ర విమర్శలు గుప్పించారు. మీది గుండెనా? లేక బండనా? అని ఆమె అన్నారు. గతంలో సెలెక్ట్ అయిన స్టాఫ్ నర్సులకు ఇవ్వకపోడంపై ఆమె మండిపడ్డారు. వెంటనే పోస్టింగులు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. ఉద్యోగాలు రాక బాధ పడుతున్న 658 కుటుంబాల ఉసురు పోసుకోవద్దని ఆమె అన్నారు. వైద్య, ఆరోగ్యశాఖలో ఖాళీలన్నీ భర్తీ చేయాలని కోరారు.

ఉద్యోగాలు సాధించిన వారిని కేసీఆర్ ఎందుకు పక్కన పెట్టారో చెప్పాల్సి ఉందని అన్నారు. ఎన్ని ఆఫీసుల చుట్టూ వీరు తిరుగుతున్నా… ఇప్పటి వరకు న్యాయం జరగలేదని అన్నారు . కేసీఆర్ ను కలిసేందుకు వారు వెళ్తే… అరెస్ట్ చేయించారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రికి ఇంత కఠిన హృదయం ఎందుకని ప్రశ్నించారు.

నాలుగేళ్ల తర్వాత మరోసారి ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చి, ఉద్యోగ నియామకాలను చేపట్టే సమయానికి వీరిలో చాలా మందికి ఏజ్ బార్ అయిపోతుందని షర్మిల అన్నారు. నర్సుల పోస్టుల అవసరం ఉందని కేసీఆరే చెపుతున్నారని… అలాంటప్పుడు వీరిని ఉద్యోగాల్లోకి ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు అన్నీ కాంట్రాక్టు పద్ధతిలోనే నియామకాలను చేపడుతున్నారంటూ కేసీఆర్ విమర్శించారని… ఇప్పుడు కేసీఆర్ కూడా కాంట్రాక్టు వైపే మొగ్గు చూపుతున్నారని మండిపడ్డారు.

వైద్య రంగంలో దాదాపు 23 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని పీఆర్సీ చెపుతోందని… ప్రస్తుత కరోనా టైమ్ లో ఆ ఖాళీలను భర్తీ చేయవచ్చు కదా? అని షర్మిల అన్నారు. కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉందని ప్రజలు ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. వైద్య రంగానికి రాష్ట్ర బడ్జెట్ లో గత ఏడాది కంటే తక్కువ కేటాయింపులు చేశారని విమర్శించారు. ఉద్యోగాలు లేక యువకులు కుంగిపోతున్నారని… వాళ్లు ఆత్మహత్యలకు పాల్పడక ముందే ఉద్యోగ నియామకాలను చేపట్టాలని డిమాండ్ చేశారు.

కరోనా వల్ల పేదలు పిట్టల్లా రాలిపోతుండటం మీకు కనిపించడం లేదా? అని షర్మిల ప్రశ్నించారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేశారు. ఆయుష్మాన్ భారత్ పథకం కింద తెలంగాణలో కేవలం 25 లక్షల కుటుంబాలు మాత్రమే లబ్ధి పొందుతాయని చెప్పారు. ఆయుష్మాన్ భారత్ లో రూ. 5 లక్షల కవరేజ్ మాత్రమే అందుతుందని… ఆరోగ్యశ్రీలో రూ. 13 లక్షల కవరేజ్ అందుతుందని తెలిపారు.

Related posts

చస్తే కూడా శ్మశానంలో చోటు దొర‌క‌ట్లేదు.. ఇదేనా బంగారు తెలంగాణ‌?: రేవంత్ రెడ్డి

Drukpadam

మరోసారి తెరపైకి కేసీఆర్ మంత్రివర్గ విస్తరణ …సండ్ర వెంకటవీరయ్య పేరు ప్రస్తావన!

Drukpadam

తమ టార్గెట్ కేసీఆర్ …ఎంపీలు ఎమ్మెల్యేలతో తమకు పంచాయతీ లేదు …ఈటల

Drukpadam

Leave a Comment